కరోనా కాలనాగు

కరోనా కాలనాగు

రచయిత: రోజా రమణి

విలవలేదు.. విలువలేదు.. ప్రాణానికి విలువలేదు
కాల నాగు “కరోనా.”.కాలానికి కాటేసెను.

కరోనా విష సర్పపు కోరలలో భరత మాత..
ఉక్కిరి బిక్కిరి అయ్యి ఊపిరాడుకున్నది.

దగ్గరోడు, దూరమోడు, తెలిసినోడు, తెలవనోడు…
బేధమేది లేదంది కాలనాగు “కరోనా”..

చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముడగలేదు
ఎవరైనా నాకొకటే లెక్కలేదు అంటోంది.

ధనిక, పేద బేధాలు మనుషలకే.. నాకు కాదు
ఎవడైతే నాకేంటి నేనొక విష పురుగంది.

“ప్రాణమెంత విలువైనదో.. అందరికి ఎరుకే గా..
పిట్టల లా రాలుతుంటె మనసు నొప్పి పెడుతోంది.

దయ చేసి అందరికి దణ్ణమెట్టి చెప్తున్నా..
మాస్కు పెడితె మాయదారి కరోనా.. మనకి రాదు.

శానిటైజరే..వాడితే “సెల్యూటే” చేస్తుంది.
దూరం పాటిస్తె మనకు మన ప్రాణం దక్కుతుంది.

పని ఉంటే తప్ప బయటకడుగెయ్యొదండి బాబు..
దయచేసి అందరికి దణ్ణమెట్టి చెప్తున్నా..

తల్లి దూరమైన పాప.. పిల్ల దూరమైన తల్లి..
కొడుకు లేని తండ్రి బాధ .. తండ్రి లేక గుండె కోత..

ఎన్నెన్నో తీయనైన బంధాలే బలియాయెను..
చెప్పలేను చెప్పలేను కన్నీటి గాధలెన్నో…..

జాలి అన్నదసలు లేదు.. దయ అసలే లేదేమో..
కరోనా…కరోనా.. కాలసర్ప కోరలకు.

దయ చేసి అందరికి దణ్ణమెట్టి చెప్తున్నా..
బ్రతికుందాం… బ్రతకనిద్దాం.. బంధాలను నిలబెడదాం..
పాటిద్దాం పాటిద్దాం.. నియమాలను పాటిద్దాం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!