పసికందు వ్యథ
రచయిత :: బొడ్డు హారిక (కోమలి)
అమ్మ అంటే అమృతం
పంచేనంటారు కదా అమ్మ
నా విషయంలో విషం చిమ్మే
నాగువయ్యావు కదా అమ్మ
నేను నీకు భారమనిపిస్తే
కుక్షిలోనే కాలకూటమవచ్చు
కదా అమ్మ
రక్తపు తడి ఆరకుండానే
బొడ్డు కొసిన పుండు
మానకుండానే
సంచిలోన తోసేసి
చెత్తలోనా పడేసినావే
ఆయువు అందడంలేదని
పలుకలేను కదా అమ్మ
నీకేమి కననుకొంటివా అమ్మ
చెత్త లోనే చితిని పేర్చినావే