సుమన శ్రీ

సుమన శ్రీ 

రచన::నారుమంచి వాణి ప్రభాకరి

సుమన శ్రీ ది సూర్యోదయంతో పాటు పరుగు పెట్టే జీవితము. సుమన శ్రీ బొద్దుగా ముద్దుగా ఉంటుంది తెల్లగా ఒక విధంగా అందగత్తె అని చెప్పవచ్చును. పది పరీక్షలు రాసింది

సెలవలకి అమ్మమ్మ ఇంటికి పంపమన్నది తల్లి ఒప్పుకున్న బామ్మ వప్పుకోలేదు ఇంతకన్న పల్లెటూరు అక్కడ ఏముంది? సెలవల్లో వంట వార్పూ నేర్చుకో ఆనక కాలేజి చదువు అంటున్నావు అన్నది కానీ సైకిల్ పై రెండు కిలమీటర్ల దూరం వెడితే గాని కాలేజ్ రాదు అందుకు కొంచెం బాధ ఆడపిల్ల వర్షం వంగు వస్తె వెళ్ళడం కస్టమ్ కదా మనం చిన్న కుటుంబాల వాళ్ళం ఎంత చదివినా పెళ్లి తప్పదు నిన్ను ఉద్యోగంలో పెట్టీ ఉంచలేము అడ పిల్ల వెనకాల చెంబు గిన్నె పుచ్చుకుని వెళ్లే కుటుంబం కాదు ఏదో ఉద్యోగం చేస్తున్నా పెళ్లి తప్పదు అంటూ బామ్మ సాగ దీసింది.

ఆ ఇంట్లో అవిడ మాటకు ఎదురు ఎవరు? చెప్పలేరు. కారణం తాత పెన్షన్ అమెకు ఇస్తారు మిలట్రీ లో చేసి వచ్చాడు ఎదో కొంత పొలం ఇచ్చారు అది నాన్న చూసుకుంటాడు తాత ఎప్పుడు ఇల్లు పట్టించుకోడు అంతా బామ్మ చూసుకునేది ఒక అత్త అమె సిటీ లో ఉంటుంది బావ బికాం చదివినా మంచి ఉద్యోగం రాలేదు అన్నయ్య మాత్రం మిలట్రీ లోకి వెళ్ళాడు

సుమన పెద్ద చదువు మన కుటుంబాల్లో అనవసరము ఆకాశానికి నిచ్చెనలు వెయ్యకు ఈ రోజుల్లో మనం తినే తిండి కన్నా మందులకు ఎక్కువ ఖర్చు .అందుకే వచ్చిన డబ్బులో సగం మీ తాతకు సరిపోతుంది అని సాగ దీసింది

సరే బామ్మ ఏదో కుట్టు టైప్ లాంటివి సెలవల్లో నేర్చుకుంటా ఆన్న ది

కుట్టు రావడం మంచిదే కానీ నువ్వు బయటి నుంచి తెచ్చి ఏమి కుట్టలేవు అటు ఇటు కని సంసారాలు ఆడపిల్లను వీధి కెక్కించడం ఇష్టం ఉండదు

సరే లే ఇంటి పని నేర్చుకుంటూ చేతి కుట్లు నేర్చుకుంటూ ఉంటాను మళ్లీ కౌర్సే చేరితే ప్రక్క ఊరు వెళ్ళాలి అధి కాక డబ్బు ఖర్చు అనుకున్నది నువ్వు సైకిల్ పై వెళ్ళాలి అంటే పరికిణి కండువా పనికి రాదు అడ్డు పడుతుందికాబట్టి పంజాబీ డ్రస్ లు వేసుకో వాలి అది మాత్రం కుట్టడం నేర్చుకో జాకెట్ లంగా కుట్టడం నేర్చుకో ఆడవాళ్ళ బట్టలు చాలు అన్నది సరే కొంచెం దూరంలో దూరం చుట్టం ఉన్నది అమె కుట్టు నేర్పుతోంది ఆక్కడకు వెళ్ళు నేను డబ్బు కొంచెం తగ్గిచండి అని అడుగుతాను ఆన్న ది సరే ఎది ఒక కొత్త విద్య అనుకున్నది ఎక్కడి కక్కడే తృప్తి పడాలి అప్పుడు గానీ ఆడపిల్ల జీవితం బాగుపడదు.

ఓ వారం వెళ్లింది ఈ లోగా విజయ వాడ నుంచి అత్తయ్యా వచ్చింది . క్లాస్ నుంచి వచ్చే టప్పటికి నట్టింట్లో మంచం వేసుకుని కూర్చుని ఉన్నది ప్రక్కనే నాలుగు కొత్త దుస్తులు ఉన్నాయి ఇదేమిటి చెప్ప పెట్టకుండా కొత్త బట్టలు ఇంటిల్లి పాధికీ తెచ్చింది అనుకుంటూ అత్త ఎంత సేపు అయింది అన్నది

ఆ నువ్వు వెళ్లవు నేను వచ్చాను ఈ రోజు తొలి ఏకాదశి అని వచ్చాను.

చూడాలి అనిపించింది నాన్న కి ఈ ఓపిక ఉండగా నా పిల్లాడు పెళ్లి చెయ్యాలి ఆతరువాత ఇద్దరు ఆడపిల్లకి చెయ్యాలి అన్నది ముందు ఆడపిల్లల పెళ్లిళ్లు చెయ్యి తరువాత మొగ పిల్లాడు అని చెప్పినా సరే ముందు పిల్లాడు పెళ్లి అని కూర్చుంది

అంటే సుమన ను తన కొడుక్కు చెయ్యాలని ఆశ పై కి అనకుండా ఇలా చెప్పింది

బామ్మ ఆలోచనలో పడింది తన వంతు బంగారం డబ్బు కూతురికి ఇవ్వాలి అలా ఇచ్చే తప్పుడు పిల్లని చేస్తే ఒక పెళ్లి అయిపోతుంది అని అనుకున్నది అన్నయ్యకు ఒక మాట చెప్పు నీ పిల్లాడికి స్కూల్ టీచర్ ఉద్యోగస్తులు వస్తున్నారు కట్నం కూడా ఇస్తామన్నారు అని చెప్పు అని తల్లి చెప్పింది .

సుమన ఏముంటుంది? ఆ దాని కేమి తెలుసు ఇప్పుడే ఎదుగు తున్నాధి కాని ఏమి తొందలేదుఅక్కడేకూర్చుని ఏ విషయం తేల్చుకోవాలి అమ్మ డబ్బు తనకే కదా నాన్న పొలం అన్నయ్యకి పిల్లకి స్త్రీ ధనం కింద ఒక్ ఎకరం ఇమ్మనమని ఆమ్మ చేత చెప్పిస్తాను అన్నది

సరే తల్లికి ఇష్టమే అటు కూతురు కొడుకు ఇటు కొడుకు కూతురు బయటి సంబంధం అయితే పెట్టు పోతలు అంటారు ఇంట్లో పిల్లాడు కంచంలో కంచం మంచంలో మంచం అంటూ ఆరోజు
రాత్రి భోజనాలు దగ్గర కదిపింది అన్నయ్య నీకు ఒక్క కూతురు. నాక్కు ఒక్క కొడుకు కదా ఇద్దరికీ పెళ్లి చేసి సంబంధం విడకుండా కలుపు కుందాము
అన్నది
దానికే మీ మంచి మాట చెప్పావు నేను కట్నం నీకు తగ్గట్టు ఇవ్వలేను నీ పెళ్లికి చాలా ఖర్చు పెట్టాను ఇంకా పిల్లకి కట్నం ఇవ్వలేను అన్నాడు

పోనీలే ఏమి వద్దు ఇవ్వ గలిగితే ఒక ఎకరం ఇవ్వు లేదంటే లేదు అన్నది

సరే అయితే పిల్లాడిని బావని పిలు వాళ్ళుకూడా ఒప్పుకోవాలి కదా

ఆ వాళ్ళ దేముంది ? నువ్వు ఎలా అంటే అలాగే అన్నది పెళ్లికి ముందు అన్ని ఒప్పు కుంటారు తరువాత అధి ఇవ్వలేదు ఇది ఇవ్వ లేదు అంటారు అబ్బే అదేం లేదు పిల్లను బి ఎ చదివిస్తాన్ డిటిపి నేర్పిస్తాను దానికి మంచి భవిష్యత్తు ఉన్నది అన్నది

చదువు అనే టప్పటికి సుమన మనస్సు పెళ్లికి ఒప్పుకున్నది ఇంకేమి శ్రావణ మాసం లో పెళ్లి అత్తింటి పంపారు

అన్న మాట ప్రకారం సుమన మొగుడు పెళ్ళాం కోరిక మేరకు డిటిపి లో చేర్పించాడు ఆతరువాత కాలేజి లో చేరింది రెండు చదువుకు సంబంధించిన అన్ని విషయాలు వివరంగా నేర్చుకున్నది ఈ లోగా ఒక పిల్లాడు పుట్టాడు అటు అత్తా ఇంట పుట్టింట అనందం వచ్చింది

చదువు పూర్తి అయింది ఒక ప్రెస్ లో చేరింది భర్త సొంతంగా షాప్ పెట్టాలన్న ఉద్దేశ్యం చెప్పాడు కొంత అనుభవం వచ్చాక సుమన మహిళా లోన్  పధకం ద్వారా పబ్లికేషన్ కి లోన్ పెట్టీ సుమన శ్రీ పబ్లికేషన్స్ పెట్టింది. తెలుసున్న వాళ్ళకి చెప్పింది తను చుదువు కున్న కాలేజి వారి జాబ్ వర్క్ పంప్లెట్ లు ఇత్యాది వి తెచ్చి బిజినెస్స్ పెంచింది భర్త కూడ చేదోడు వాదొడు గా ఉన్నాడు

సుమనకి పెళ్లికి వప్పించూ కున్నట్లే ఆమెను చదివించి మంచి బిజినెస్స్ పెట్టించారు .ఆ రోజు పెళ్లి కి ఒప్పుకో బట్టి జీవితము మంచి మలుపు వచ్చింది ఆల కుట్టు నేర్చుకుని ఉపయాగం ఇంత ఉండదు

బావ కూడా కలిసి వచ్చి అన్ని నేర్పించి తనకు సంపూర్ణ సహకారం ఇచ్చాడు అనుకుంది నానా టీ బ్రతుకు నాటకము కీర్తన శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన రింగ్ టౌన్ గా వినియించిధి ప్రతి మనిషి జీవితం అత్తింటి సహకారం పై ఆధార పడి ఉన్నది

సుమన పూర్తి జీవితం లో ఎదుగు దలకి మేనత్త బావ కారణము ప్రతి ఆడపిల్ల జీవితం లో ఎదగాలి అంటే పుట్టింటి ఎంత వచ్చినా అత్తింటి సహ కారం ఉంటే గాని స్త్రీ ఎదగలేదు

చదువు కౌంటే చాలదు మంచి అవకాశం జీవిత మలుపు నిస్తుంది నువ్వు ఆడపిల్ల వి అనుకాక తప్పక అత్తింటి సహకారం ఇవ్వండి ఆడపిల్లను ఎదగ నివ్వడం అత్తింటి బాధ్యత పుట్టింట్లో 18 లేక 25 ఏళ్లు మాత్రమే ఉంటుంది జీవితం అంతా అత్తింటి లోనే అందుకే ఆడపిల్ల అంటుకట్టిన మొక్క జీవితము సుమన ఇప్పుడు ఒక్ చిన్న పబ్లిష్ ర్ గా ఎదిగింది పిల్లల్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో పెట్టింది కుటుంబ పురోగతి ఆడదాని చేతిలో ఉంది కానీ సంపూర్ణ సహకారం అత్తింటి నుంచి అని మరువకండి.

సుమన శ్రీ లాంటి అమ్మాయిలు ఎప్పుడు ఎందరో ఉన్నారు అందరికీ అభినందనలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!