మనసే ఓ అద్భుతం!

మనసే ఓ అద్భుతం!

రచయిత :: సోంపాక సీత

భూమిని చుట్టగలవు!
ఆకాశాన్ని పడగొట్టగలవు!
సంద్రాన్ని ఈదగలవు!
లక్ష్యాన్ని చేరగలవు!

వారెవ్వా .. మానవా !
సంకల్పం నీదేనని ఎరుగవా !!

శిల నీవే !
శిల్పం నీవే !
ఉలివీ నీవే !
కర్తవ్యమూ నీవే !

వారెవ్వా.. సాధకా !
గమ్యపథ నిర్దేశకా !!

అనుభవాలను మరువకు !
ధ్యానాన్ని విడువకు !
జడపదా‌ర్థమై తిరగకు !
చెత్త బుట్టలా మెరవకు !

నసపెట్టే కలలెందుకు ?
మనసే ఓ అద్భుతమని తలుచుకో ..!

ఏదీ శాశ్వతం కాదు !
అశాశ్వతం అసలే కాదు !
నిర్వాణం అసలేకాకు !
నవ్వుకెపుడు దూరంకాకు !

వారెవ్వా..మానవా !
అయ్యావుగా మహానీయా !!

కాలానికి అతీతం !
ఆలోచనలకు అతీతం !
చైతన్యానికి అతీతం !
ఇంగితజ్ఞాన సమ్మతం !

మనసే ఓ అద్భుతం !
ఇదితెలవని జీవితమే బుద్భుదం!!

You May Also Like

2 thoughts on “మనసే ఓ అద్భుతం!

  1. ఓ మనసా… అంటూ.. జీవితాన్ని ధైర్యంగా ముందుకు సాగించే భరోసా నింపుతూ చక్కని కవితలు ఆవిష్కరించిన మీకు హృదయపూర్వక అభినందనలు మేడం… వంటకాలు.

  2. వారెవ్వా….కవిత్వం…👌👌💐💐💐సీత గారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!