నాలుగు దశ లా ప్రయాణం వార్ధక్యo

నాలుగు దశ లా ప్రయాణం వార్ధక్యo

రచయిత :: జై ప్రశాంతి

అల్లరి చిల్లరి గంతులతో  పిల్లలు  ఆడెను
ఎన్నో  వింత ఆటలు
చీటికి మాటికీ అలకల తో అనుకున్నది కావాలి అని మారం చేయును
చదివే సమయాన  ఎన్నో ఆలోచన సుడిగుండాలు గిరున
తిరిగే వారి చిట్టీ బుర్ర లో
ఏవేవో తిక్క ప్రశ్నలు అర్ధం తేలిక పడే పట్లు పిల్లల తో సాగె బాల్యపు మధురస్మృతులు మధురంగా..
వాటిని తలుచుకొనే వార్ధక్యమా నీకు ఆనందమే కదా..

చదువు బాటా పట్టే ఎదిగే వయసు పరీక్షలు
పరుగుల చదువులకోసం పడే తపన
ఎంతటి ఆర్భాటాలు ఎన్ని పైసల  ఫీజులో
అర్థంకాని చదువుల వేటలో బాల్యం ఎదిగి
మూగేసేను కౌమార్యం లో తాను గెలిచినాది ఏమిటో
ఇంత చేసేది వార్ధక్యమానే ప్రశాంతతను పొందాలని చిరూ ఆశ కోసమే కదా

తుంటరి వయసు కోరికల హరివిల్లు విచ్చుకొనే
పరువాలు  దోబూచులు ఆడేవేళ  పడుచుతనం
కొంటె అల్లరి  వయసు చేసే చిలిపి కోలాటo  లో
జీవిత గమ్యాన్ని  చేరుటకోసం మనిషి చేసి ప్రయత్నం
అధికార హోదా లో వివాహ వేడుక మళ్ళీ చిగురించిన కొత్త జీవితపు యవ్వనాల కాంతి తుమ్మెదలే..
అని తెలుసు అనుకొనే ఈ యవ్వనం చివరికి చేరాలిసినది వార్ధక్యమానే  చివరి దశ కే కదా

క్షిణించిన శక్తి తో  జీవితనే నేర్చుకున్న అనుభావపు పాఠాలతో ముగిసిన సమయాన్ని నెమరు వేస్తూ కాలంతో  గడిపే ఓ వార్ధక్యమా నీకు మా పై అధిక్యo తగునా.
అలసిన మనసుకు ఊరట తీరేది స్మశానం లోన ఇదే కదా జీవితం అంటే మనిషి పుట్టుక చావులోనే సాగె సమరం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!