శాంతి ఎక్కడ?

(అంశం: “ఏడ తానున్నాడో”)

శాంతి ఎక్కడ?

నారుమంచి వాణి ప్రభాకరి

ఎక్కడ ఎక్కడ ? నీకోసం
అహోరాత్రులు వెతుకుతున్నారు ఎక్కడ కాన రావు నీ ఉనికి ఎక్కడ ?
ఎవరికి చిక్కవు,దొరకవు
ఎందెందు వెతికినా దొరకవు
ఓయసిస్ మాదిరి నీ కోసం తపన,కేజీ లెక్క న కొందామని
గూగుల్ పే ఫోనే పే రెడీ చేసా
ప్లే స్టోర్ ఫేస్ బుక్ ఇనిస్తో గ్రామ్
అన్ని టా వెతికినా కాన రావు
సెర్చ్ లైట్ వేసి విశ్వమంతా
వెతికినా నిరాశ నిస్ఫ్రుహ మిగిలి మనో వేదన కల్గి ఓ
శాంతి ఓ శాంతి నీ సంగతి
జ్ఞానోదయం అయింది నువ్వు
నా మదిలో హృదిలో పదిలంగా ఉన్నావని,

అందుకే నిన్ను వెతుకు తున్నానని జ్ఞానోదయం కలిగించిన నీకు
ధన్య వాదాలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!