మంచోడే

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

మంచోడే

రచయిత :: అనురాధ కోవెల


నువ్వే నా చందమామ అంటాడు
వెన్నెలై చెంత చేరితే డాగడిపోతావు అని దడి గడతాడు

శాకమేదో చేయమంటాడు
పాకమయ్యేదాక పక్కనే ఉంటాడు

పువ్వులు తెచ్చిస్తాడు
తురుముకుని దరి కొస్తే తుమ్ముతూ కూచుంటాడు

కొత్త చీర కట్టుకొని కొసరి నే వడ్డిస్తే
కోక బరువవునంటూ కొసమెరుపులిస్తాడు

సెల్ తనదని ముట్టుకోవద్దంటాడు
బ్యాటరీ నువ్వంటూ ఛార్జింగ్ మాత్రం నన్నే పెట్టమంటాడు

షికారు వెళ్దాం అంటాడు ..కారు మాత్రం తీయడు
ఏమంటే బ్రేకుల్లేని బైక్ మీద ఎంజాయ్ అంటాడు

మాటలేమో కోటలు చేతలేమో చెంగలువలు
కోపానికి దుర్వాసుడు మనసేమో వెన్నపూస

ఇదెందుకు అదెందుకు ఇరుగుపొరుగులతో మనకెందుకు అంటాడు
ఇంట్లో కరెంట్ పోతే మాత్రం కిటికీ నుండి తొంగి మరీ చూస్తాడు

పనికెళ్లేటి వేళ ఆలస్యం అవుతుంటే పిల్లి ఎదురైందంటాడు
ఇంటి పిల్లే పట్టుకోకుమంటూ.. రోజూ నేను రావడం లేదా ఎదురు అంటే నవ్వుతూ వెళ్తాడు

ఉపమానాలెన్నో చెప్పేను
ఉరడించాల్సిన వేళ గుక్కపట్టి ఏడ్చెను

ఏది ఏమైనా చాదస్తపు మొగుడు
మంచోడే కానీ చంటోడి మంకు
చెప్పే విధంగా చెపితే వింటాడు
చనువిస్తే చంకకూ ఎక్కుతాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!