అహింసావాది

అహింసావాది

రచన :దోసపాటి వెంకటరామచంద్రరావు

అహింసయే ఆయుధంగా
సత్యాన్వేషణే ధ్యేయంగా
శాంతిని నెలకొల్పడమే గమ్యంగా
కొల్లాయికట్టిన సామాన్యజీవిగా
అన్యాయాన్నెదిరించిన ఆదర్శమూర్తి!
నగ్నపకీరుగా పిలవబడ్డాడు
ఒకచెంపైకొడితే రెండోచెంపచూపాడు
చెడు కనవద్దాన్నాడు
చెడువినవద్దన్నాడు
చెడు చెప్పొద్దన్నాడు
బొసినవ్వుతో పిల్లలకు ప్రియుడయ్యాడు
రవిఅస్తమించని బ్రిటీషుసామ్రాజ్యాన్ని తరిమికొట్టాడు
సత్యాగ్రహమనే సిద్దాంతాన్ని పాటించాడు
కులమతబేధాలను ఎదిరించాడు
ఎవరిపనివారేచేసుకోమన్నాడు
నిత్యస్మరణీయుడుగా
జాతిపితగా నిలచిపోయాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!