(అంశం:: “చాదస్తపు మొగుడు”)
నా చాదస్తపు బావ
రచయిత :: శ్రీలత. కె
నా చాదస్తం బావతో నా పాట్లు..
అగచాట్లు..
కంటిమీద ముద్దు పెట్టు అంటే
కాటుక అంటుంటుంది అంటాడు.
ముక్కు మీద ముద్దు పెట్టమంటే
ముక్కెర అడ్డం అంటాడు..
బుగ్గమీద ముద్దు పెట్టు అంటే
కందిపోతుంది అంటాడు.
పెదాలమీద ముద్దు పెట్టు అంటే
అయ్యబాబోయ్ ఎంగిలి అంటాడు.
ఇవేవి ఒద్దుగాని కౌలించుకో అంటే
ఓరి దేవుడో….
కరెంట్ పోనీ అంటాడే నా బావ..
ఎట్టా ఎగేది వాడితో.. ఇంకెట్టా.. నేనేగేది..