అతి నమ్మకం

అతి నమ్మకం

-యాంబాకం

గతంలో నర్మదా నదీ తీరంలో ఒక చిన్న ఊరి లో వరాహశెట్టి అనే చిన్న పాటి వ్యాపారం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటూ వ్యాపారంలో లాభాలు భాగ గడిచాడు వరాహశెట్టి.నేర్పుతో వ్యాపారం లో వచ్చిన డబ్బుతో బంగారు బారులు కొని భవిష్యత్ లో బంగారు ధరలు పెరిగి నప్పుడు లాభాలకు అమ్ముకోవచ్చు అని ఒక వెయ్యి బంగారు బారులు నిలువ చేసాడు.
అలాఉండగా వరాహశెట్టి కి సంపాదన మీద ఆశ ఎక్కువ అయి ఆశపుట్టి పెద్ద,పెద్ద ఊరిలో కూడ వ్యాపారం చేసి ధనార్జన చేయ సంకల్పించి దూర ప్రాంతాలకు పోవడానికి నిర్ణయించుకొని,అప్పుడు ఇలా అలోచించసాగాడు. తన దగ్గర దాచివుంచిన వెయ్యి బారులు బంగారం తన వెంట తీసుకు పోవడం మంచిది కాదు అని తలచి వరాహశెట్టి తన దాచి వుంచిన బంగారాన్ని ఒక పెద్ద జాడీలో అడుగు భాగాన బంగారు ను ఎవరికీ అనుమానం రాకుండా,కనిపించకుండ పెట్టి పైన చింతకాయ తోక్కు నిప్పి మంచి గుడ్డ తో జాడి మూతిని తాడుతో గట్టిగా ముడివేసి తన తోటి వ్యాపారి అయిన పోలుశెట్టి ఇంటికి జాడిని తీసుకెళ్లి “అయ్యా పొలుశెట్టి గారూ నేను రేపు వ్యాపారం మీద దూర ప్రాంతాలకు వెళ్ళుతున్నాను. తిరిగి రావడానికి ఒక ఏడాది పట్ట వచ్చుఅంత వరకూ నాయీ చింతకాయ తోక్కుల జాడీని మీ ఇంట్లో భద్రంగా ఉంచగలరా”?అని అడిగాడు పోలుశెట్టి మొదట తటపాయించి సరే తోటి వ్యాపారి అని సరేనని తన ఇంట్లో నే ఒకమూల చోటు చూపాడు.వరాహశెట్టి స్వయంగా తన చేత్తోనే జాడిని అక్కడ పెట్టి వెళ్ళి పోయాడు.
వరాహశెట్టి కి వ్యాపారం అనుకున్న దానికన్నా అధికంగా కలసి వచ్చింది. ఎడాది లోపు తిరిగి వద్దామన్నుకొన్నా వరాహ శెట్టి కొన్ని ఏళ్ళదాకా తన సొంత ఊరికి రాలేక పోయాడు. ఈలో గా పోలుశేట్టి వరాహశెట్టి నే మరిచిపోయాడు. ఒక రోజు ఇంట్లో ఏదో శుభకార్యం చేయ ఇల్లు సర్దుతుండగా ఒకమూల ఒక జాడీ కనిపించడం చూసి పోలుశెట్టి జాడీ దగ్గర కు పోయి చూడగా గుర్తు పట్టి తన మనస్సులో “వరాహశెట్టి ఏ మైనట్టు”? ఇంత కాలం అయినది ఏడాది లోపు వస్తానని చెప్పి వెళ్ళాడు అసలు బ్రతికి ఉన్నాడా? అని మదనపడుతూజాడి ని దగ్గరకు తీసుకోని ఇందులో ఏముంది చూద్దాం”! అని పోలుశెట్టి జాడీ మూతతీసి అందులో ఉన్న చింతకాయ తోక్కును చేతి తో కదిపేడు. పైన ఉన్న చింతకాయతోక్కుని పక్కకు తీయగానే అడుగునవున్న బంగారు మెరుస్తూ కనిపించింది. పోలుశెట్టి కి ఒక ఉపాయం తోచింది. వరాహశెట్టి చనిపోయి ఉంటాడు ఇంక రాడు ఒకవేళ వచ్చినా ఆ జాడి లో చింతకాయ తొక్కే అనే కదా చెప్పినాడు కాబట్టి చింతకాయతోక్కు వరకే మన పూచీ!.
అని అలోచించి పోలుశెట్టి ఎవరికి తెలియకుండా బంగారు మొత్తం వెయ్యి బారులు తీసి వేసి దాచేసాడు. ఎందకైనా మంచిదని జాడీనిండా చింతకాయ తోక్కు తెచ్చి మూత పెట్టి యదాస్థానం లో పెట్టేసాడు.
ఇది జరిగిన కోద్దిరోజులకు వరాహశెట్టి ఊరికి తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే పోలుశెట్టీ దగ్గరకి వెళ్ళి తన జాడీ తీసుకోని ఇంటికి పోయి చూసుకొన్నాడు. ఎంత తీసినా జాడి నిండా చింతకాయతోక్కు తప్ప బంగారం జాడ ఏమిలేదు వరాహశెట్టి కి కడుపు మండి పోయింది అతను పోలు శెట్టి దగ్గర కు పోయి “నువ్వు పెద్ద మనిషివి అని అనుకున్నాను నా బంగారం కాస్తా కాజేస్తావా”?ఆనిఅడిగాడు.
ఏదో మంచి తనం మీద తోటి వ్యాపారి అని జాడీ నా దగ్గర సంవత్సరాలు జాగ్రత్తగా ఉంచి నందుకు నా మీద దొంగ తనం అంట గట్టడానికా? నీజాడీ నువ్వే తచ్చిపెట్టావు నువ్వే మళ్ళి తీసుకు పొయావు చింతకాయ తోక్కు జాడీలో బంగారం ఉంచట మేమిట? ఆరోజు ఎందుకు చెప్పలేదు. అన్నాడు పోలుశెట్టి కోపంనటిస్తూ.
ఇంక వరాహశెట్టి కి ఏమి తోచక ఆ ఊరి ప్రెసిడెంట్ వద్దకు వెళ్లిమొరపెట్టుకోగా ప్రెసిడెంట్ ఇరువురు ను పలిచి విచారణ చేయసాగాడు. ఈ వింత నేర విచారణ చూడటానికి ఊరి వారంతా వచ్చారు.
ఏడాది క్రితం తాను జాడీ లో వెయ్యి బంగారు బారులు దాచి వాటిపై చింతకాయ తోక్కు ఉంచి పోలుశెట్టి ఇంట పెట్టి వెళ్ళి తరిగి వచ్చిన వెంటనే పోలుశెట్టి ఇంటికి పోయి జాడీ తీసుకోని ఇంటికి పోయి చూడగా అందులో కేవలం చింతకాయతోక్క మాత్రమే ఉండటం చూసి అడగగా నీవు ఏదైతే ఉంచ్చావో అదేవుందని బంగారు సంగతి నాకు తెలియదని పోలుశెట్టి చెప్పిన తీరు ప్రెసిడెంట్ కి విన్నపించుకొన్నాడు వరాహశెట్టి
తాను ఆజాడీని ముట్టు కోనైనలేదని దాన్ని వరాహ శెట్టి స్వయంగా తన ఇంటికి పెట్టి మళ్ళీ ఇన్నేలకు వచ్చి స్వయంగా తానే తీసుకుపోయాడని యిప్పుడు దురుద్దేశంతో వరాహశెట్టీ కల్పన చేస్తున్నాడని పోలుశెట్టి మనవిచెసుకోన్ననాడు.
“ఏమయ్యా నీజాడీలో బంగారు పెట్టినట్లు చెప్పడానికి ఏమైనా సాక్ష్యం వుందా? అనివరాహశెట్టిని ప్రెసిడెంట్ అడిగాడు.”చిత్తం నాకు పోలుశెట్టి మీద ఉన్న నమ్మకం తప్ప ఇంకేమి సాక్ష్యం లేదు.”అన్నాడు వరాహశెట్టి.
“అలాంటప్పుడు నీ మాట నమ్మటం సాధ్యం కాదు అయినా నీ జాడీ సరిగా చూచుకున్నావా? బంగారు ఏమైనపెడితే అందులోనే ఉందేమో”అన్నాడు ప్రెసిడెంట్.
“చూశానండి చింతకాయ తోక్కు తప్ప అందులో ఏమిలేదు”అన్నాడు వరాహశెట్టి వెల వెల పోతూ “ఏది? జాడీపట్టుకొరా నలుగురి ఎదుట సందేహనివృత్తి చేసుకుందాం”అన్నాడు ప్రెసిడెంట్.
తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వరాహ శెట్టి కి పోయింది అయినా ప్రెసిడెంట్ కోరినట్లు ఇంటికి పోయి జాడీ తెచ్చి ప్రెసిడెంట్ ముందర వాటిని బయటికి తోడుతూ “చూడండి ఒక బంగారు బారు కూడా లేదు అన్ని కాజేశాడు మీరే చిత్త గించండి అన్నాడు వరాహ శెట్టి ఆవేదనతో అయితే ప్రెసిడెంట్ వరాహశెట్టి మాటలు వినటంలేదు ఆచింతకాయతోక్కు తీసు కొని పరీక్షగా “ఆశ్చర్యం ఆశ్చర్యం! అనసాగాడు అందరూ ప్రెసిడెంట్ కేసీ వింతగా చూస్తూన్నారు.
“మీరుకూడ చింతకాయతోక్కు ను తీసుకోని చూడండి! అన్నాడు ప్రెసిడెంట్ తెలియకుండానే అందరూ పరీక్షించారు ప్రెసిడెంట్ ఎక్కడ సంపాదించావయ్య ఈ అపురూపమైన చింతకాయతోక్క? అన్నాడు వరాహశెట్టి వెర్రి మోహం వేశాడు.మిగిలిన వారు మటుకు అయ్యా ఇది పాత చింతకాయ తోక్కు కాదు కొత్త చింతకాయ తోక్క అని పలికారు ప్రెసిడెంట్ తో.
ప్రెసిడెంట్ పోలుశెట్టి కేసీ తిరిగి “ఏమయ్యా? నువు ఈ జాడీ ని ముట్టు కొనైనాలేదంటివే?
ఇందులోకి కొత్త చింతకాయతోక్కు ఎలావచ్చాయి? నీవు అబద్ధం చెప్పి నందుకు తలారికి అప్పగించనా? మర్యాదగా బంగారం వరాహశెట్టికి అప్పగిస్తావా? అనిగట్టిగా అడిగేసరికి వెంటనే తానుచేసి తప్పు ఒప్పుకొని పోలుశెట్టి వరాహశెట్టీ కి వెయ్యి బంగారు బారులు ఇచ్చేవాడు. ప్రెసిడెంట్ యుక్తిని అందరూ మెచ్చుకొన్నారు.”అతినమ్మకం”కూడదని హితవు పలికారు తీర్పు చూడ వచ్చినవారు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!