ఈ కధ ఇంతే!

ఈ కధ ఇంతే!

-దోసపాటి వెంకటరామచంద్రరావు

బిటెక్ మూడోసంవత్సరం చివర్లో కేంపస్ సెలెక్షన్స ఆరంభమయ్యేయి.రేవతి విప్రో కంపెనిలో సెలెక్ట అయ్యింది.తనతొపాటు మరో ఇద్దరు ఆడ నలుగురు
మగ వారు కూడా సెలెక్టయ్యారు.అందులో రేవతి కిష్టమైన క్రిష్ణప్రసాదు కూడా వున్నాడు.చాలా సంతోషమేసింది.సెలెక్టయ్యినవారందరిని ట్రెయినింగుకు బెంగళూరు పంపించారు.ఆరునెలల ట్రెయినింగు పూర్తి అయిపోయింది.రేవతి ని బెంగుళూరులోనే ఉంచేసి మిగతావారిని తలోచోటికి పంపేశారు.క్రిష్ణప్రసాద్ కి హైద్రబాద్ పంపారు.ఇద్దరూ
వేరే వేరే చోట్లలో పనిచేయాల్సివచ్చింది.ట్రెయినింగు సమయంలో వాళ్ళిద్దరూ మరింత దగ్గరయ్యారు. ఇక ఇంట్లోవాళ్లకి చెప్పి పెళ్ళి చేసుకుందామని అనుకున్నారు.కాని అనుకున్నది జరగలేదు.ఇద్దరూ నిరాశచెందారు.కొంతకాలం వేచిచూద్దామని నిర్ణయించుకున్నారు.అలా మరో ఆరు నెలలు గడచిపోయాయి.ఇద్దరూ పని ఒత్తిడిలో పడిపోయారు.ఇంతకుముందొతే ఎదో ఒక సమయంలో చాలా సేపు విడియోకాల్ చేసుకొని మాట్లాడు కునేవారు .ఇప్పుడు అదికూడా లేదు. అలా మరో ఆరునెలలు గడచిపోయాయి.ఇద్దరూ పనిఒత్తిడిలో ములిగిపోయారు.వారిమధ్య దూరం పెరిగిపోసాగింది.ఇరువురి ఇంటి పెద్దలు పెళ్ళిళ్ళు చేయడానికి ఒత్తిడి చేయసాగారు.రేవతి క్రష్ణప్రసాదులకు ఏమిచేయాలో తోచటంలేదు.పెళ్ళిచేసుకుంటే ఇద్దరూ ఒకచోట పనిచేసే అవకాశముంటుందేమోనని ఆఫిసులో అడిగారు.ఇప్పట్లో ఆ అవకాశం లేదన్నారు.మరో ఆరునెలలు గడిచిపోయాయి.క్రిష్ణప్రసాదుకు ఆస్ట్రేలియా వెళ్ళడానికి అవకాశం వచ్చింది.మళ్ళీ ఇద్దరూ సందిగ్దంలో పడిపోయారు.క్రిష్ణప్రసాదు వెళ్ళనని వేరేఎవరికైనా పంపమని చెప్పేశాడు.అప్పుడు కంపెని వాళ్ళు రేవతిని వెళ్ళమన్నారు.మళ్ళీ కధ మొదటికొచ్చిందనుకొని ఇద్దరు హతాశులయ్యారు.మరింకో అవకాశంలేక క్రిష్ణప్రసాదే వెళ్ళక తప్పలేదు.ముందు ఒక సంవత్సరంపాటు వుండాలన్నారు. సరేనని వెళ్ళిపోయాడు.ఎంత సంవత్సరమేకదా.తీరిగొచ్చేక పెళ్ళిచేసుకుందామనుకున్నారు.రేవతికి సరేననక
తప్పలేదు.
విధి చాలా చిత్రమైంది.విధి ఆడే వింతనాటకంలో మానవుడు ఏంచేయగలడు.రేవతి వాళ్ళిఃట్లో పెళ్ళికి ఒత్తిడెక్కవయ్యింది.అప్పుడిక చెప్పక తప్పలేదు రేవతికి తమ ప్రేమసంగతి.ఇంట్లో వాళ్ళు మండిపడ్డారు.రేవతి క్రిష్ణప్రసాదునే చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేసింది .అతను ఆష్ట్రేలియానుండి తిరిగి వచ్చాక పెళ్ళి చేసుకుంటామని చెప్పింది.
క్రిష్ణప్రసాదుతో మాట్లాడడానికే కుదరటంలేదు.తనకి పని ఒత్తిడి పెరిగిపోసాగింది.ఇంతలో కంపెని వాళ్ళు
తనని కూడా ఆష్ట్రేలియాకి వెళ్ళడానికి సిద్దంగా ఉండమని చెప్పేశారు.రేవతికి చాలా సంతోషమేసింది. మళ్ళీ ఇద్దరం ఒకేచోటుకి చేరే అవకాశం ఆ దేవుడు కల్పించాడని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.మరోవారం రోజులలో తను క్రిష్ణప్రసాదుని కలవబోతోందని చాలా సంతోషమేసింది.ఆ విషయం క్రిష్ణప్రసాదుకిఫోను చేద్దామనుకుంటుంటే క్రిష్ణప్రసాదు
నుండే ఫోను వచ్చింది”హయ్ రేవతి!నీకో గుడ్ న్యూస్!నేను బెంగళూర్ వచ్చేస్తున్నా!”ఆనందంగా చెప్పాడు.ఒక్కసారిగా రేవతి సంతోషమంతా ఆవిరైపోయింది.ఆఫీసులో తన ఆష్ట్రేలియా ఎసైన్మెంటు మార్చమని కోరింది.ససేమిరా మార్చడం కుదరదన్నారు.లేకపోతే ఉద్యోగం వదులుకోమని చెప్పారు.ఇక చేసేదేంలేక ఉసూరుమంది.
మరి ఈ కధ ఇంతే!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!