అంకెల గారడీ
రచన:: కవి రమ్య
ఏకలవ్యుని వలె లక్ష్యం వైపు గురి ఉంచు,
ద్వంద్వ స్వభావాలు కలవారి వైఖరిని అరికట్టి విజయం సాధించు,
త్రినేత్రం దాల్చిన శివుని ప్రార్ధించి తపోశక్తి పెంపొందించు,
చతుర్ముఖ బ్రహ్మ వలె బ్రహ్మజ్ఞానం కొరకు యత్నించు,
పంచేంద్రియాలని అదుపున ఉంచి భక్తి మీరి ముక్తి కొరకు ప్రయత్నించు,
అరిషడ్వర్గములను అధిగమించు,
సప్తవర్ణాలని నింపుకున్న ఇంద్రధనస్సు వలె నింగికి ఎగిసి ప్రకాశించు,
అష్టైశ్వర్యాలతో తులతూగి ధర్మానికి ఆయువు పెంచు,
నవదుర్గల రూపాన్ని మదిలో ఎల్లప్పుడూ తలచి స్త్రీని గౌరవించు,
దశావతారములు దాల్చిన సర్వాంతర్యామిని
మదిలో నిలిపి ఆదర్శంగా జీవనరథం కొనసాగించు,
ఏకాదశ పితరులకు సదా ప్రణమములు ఆచరించు
*****