మనసు నాకు తెలుసు

(అంశం: “ఏడ తానున్నాడో”)

మనసు నాకు తెలుసు

రచన: కృష్ణకుమారి

“బావా రావా?” మరదలి పిలుపులకి అంతూ లేదూ,

కార్చే కన్నీటికి అదుపూ లేదు…

‘ఏడ ఉన్నాడో తెలీదు, చెప్పడు
సెల్ యుగంలో ఫోనే దొరకదు!

కఠినాత్ముడు నీ తండ్రిని ఒప్పించిందికే ఈ సైన్యం లో చేరేడని,

చేరిన తరవాత మన ప్రేమకన్నా, దేశమాత సేవే గొప్పదని
మనసా వాచా ఒప్పేసుకున్నాడని
అయినా తొందరలోనే బావ వస్తాడని, ఈ చిన్నారి మరదలికి చెప్పేదెవరని?

నీలిమేఘం గర్జించి చెప్పింది,

కేకి పురివిప్పి నాట్యమాడుతూ
కేకలు వేసింది..

మరదలు మనసు మయూరమై గెంతింది.. ఏరవాక
బావరాక ఒక్కసారే జరిగింది!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!