చిన్ననాటి చెలికాడు

(అంశం: “ఏడ తానున్నాడో”)

చిన్ననాటి చెలికాడు

రచన: సుశీల రమేష్

నా చిన్ననాటి చెలికాడే
రోజు నా కలలో వస్తాడే
ఎక్కడున్నాడో వాడు
నా మదిని దోచిన వన్నెకాడు
చూపులతోనే బాణాలు
విసిరే విలుకాడే
మాటలతోనే ముద్దాడుతాడే
తన చేతుల్లో పడితే నా
సొగసును ఏం చేస్తాడే
నిద్రపోనివ్వడు నిలువనీయడే
తానమాడు వేళ వస్తాడే
తనువంతా పులకింత రేపుతాడే
వెల్లకిలా పడుకోనీయడే
మీదకొచ్చి నన్ను ఆక్రమిస్తాడే
వద్దన్నా వలువలు వలిచేస్తాడే
ఆపై నన్ను తనలో ఐక్యం చేసుకుంటాడే
ఓసి మనసా ఏడతానున్నాడో వాడు
ఒక్కగానొక్క నా చిలిపి చెలికాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!