అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ

రచయిత :: వైష్ణవి

ఈ రోజు మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు ఎందుకో చెప్పుకోండి చూద్దాం! అని తన హస్బెండ్ ని అడిగితే సిగ్గుపడుతూ.

ఎందుకో అంత ముఖ్యమైన రోజు ఈరోజు మా పెళ్ళి రోజు, కూడా కాదు కదా? అని అడిగాడు నవ్వుతూ.

నీకు అన్నీ సరదాలే కానీ, నేను చెప్పేది వినండి ఇంకా మాన ఇంట్లో కూడా చిన్న పిల్లల కేరింతలు మొదలవుతాయి.

హోం అదా విషయం సరే నువ్వు ఏమి పనులు చేయద్దు, బరువులు కూడా ఎత్త వద్దు. ఈ టైం లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.

నాకు చాలా ఆనందంగా ఉంది దానితో పాటు భయం కూడా మొదలైంది. నెలలు గడుస్తున్నా కొద్దీ బిడ్డ మీద ప్రేమ ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న తపన ఇద్దరిలో. లోపల తను తాంటున్నపుడు ఎప్పుడు బయటకు వచ్చి నాతో ఆడుకుంటాదో అని ఆలోచనలో గడిచాయి రోజులు.

తొమ్మిది నెలలు మోసి అనే నొప్పులు భరించి ఇంకో జీవితానికి ఆయుష్షు పోసి తను మరో ప్రాణాన్ని పోషించడానికి సిద్ధం అయింది.

డాక్టర్ వచ్చి మీకు ఆడబిడ్డ పుట్టింది అండి అనగానే ఇద్దరు చాలా ఆనందపడి పాపను ముద్దాడి గుండెలకు హత్తుకున్నారు.

పాపను కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళిద్దరు వాళ్ళ జీవితాన్ని మరిచి, పాప లో వాళ్ల ఆనందం మరియు జీవితాన్ని చూసుకుంటున్నారు. పాపకు వాళ్లు స్వేచ్ఛ అని పేరు పెట్టారు. తను జీవితంలో స్వేచ్ఛగా జీవించాలని, తను అనుకున్న పనులు సాధించి తన కాళ్లమీద తాను నిలబడాలని ఆ పేరు పెట్టారు.

స్వేచ్ఛ ఆనందం కోసం వాళ్ళ అందాలని పక్కనపెట్టి తను అడగకముందే అన్నీ సిద్ధం చేసేవారు.

అమ్మ అయితే ఎప్పుడు ఏది అడిగినా కాదు అనదు. తను తన జీవితంలో అనుభవించలేని, ఆనందం తన కూతురు అనుభవించాలని నేను ఏమి అడిగినా ఎక్కడకు వెళ్లాలి అన్నా నాన్నను అడిగి ఒప్పించి తన ఖర్చులు కొంచెం డబ్బులు చేసి ఇచ్చేది. ఇంట్లో ఆ మిగతా డబ్బులతోనే సరుకులు అన్ని సమకూర్చేది మాకు లోటు లేకుండా. అమ్మ నా మీద అంతులేని ప్రేమ చూపించేది.

కానీ నేను మా అమ్మ ప్రేమ అర్థం చేసుకోలేదు. ఎప్పుడు ఫోన్లో ఉండే దానిని అమ్మతో సరిగా మాట్లాడేదాన్ని కాదు. అమ్మ నాకోసం ఏదైతే కలలు కనిందో దానికి అమ్మ తో కోపంగా ఉండటం మొదలు పెట్టాను. అమ్మ నాతో ఇలా చాలా సార్లు అనేది ఇలా వచ్చి నాతో మాట్లాడుతూ సాయం చేయొచ్చుగా అని కానీ నేనెప్పుడూ వెళ్లే దానిని కాదు.

నా చదువు పూర్తి అయ్యింది. ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకో అని చెప్పారు కానీ, నాకు బయటకు వెళ్లి ఏదైనా ఉద్యోగం చేయాలన్న కోరిక. అమ్మ మాత్రం ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండేది. ఈ విషయంలో కూడా నాన్నకు చెప్పి ఒప్పించి నన్ను బయటకు పంపించింది. తన నేను లేకుండా ఉండలేను అని నా భవిష్యత్తు కోసం అన్ని వదులుకుంది.

నాకు మంచి ఉద్యోగం వచ్చిందని అమ్మానాన్నలకు స్వీట్స్ పంచి పెట్టాను. నాకంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలా చాలా ఏళ్ళు గడిచాయి, అందులో చాలా సార్లు ఇంటికి వెళ్ళాను. అమ్మ నాతో చాలాసార్లు మాట్లాడదాం అనుకుంది మనసు విప్పి కానీ అమ్మతో నేను అంత మాట్లాడే దానిని కాదు. అమ్మ ముఖంలో ఏదో ఆవేదన, బాధ కనిపించేవి కానీ పైకి మాత్రం చిరునవ్వుతో దానిని మూసేసేది.

ఇంతలో నేను ఒక రోజు ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ నాన్న అమ్మకు బాగోలేదు ఆసుపత్రికి తీసుకు వచ్చాము. నువ్వు వెంటనే ఇక్కడికి రా అని చెప్పాడు నేను త్వరగా ఇంటికి బయలుదేరాను. నేను ఇంటికి చేరుకున్నాను ఇంటి చుట్టూ జనం నాలో భయం అమ్మకు ఏమైందో అని ఆ దేవుని ప్రార్థిస్తున్నా మనసులో మా అమ్మకు ఏమీ కాకూడదు అని ఇంతలో నాన్న చాలా ధైర్యం తెచ్చుకొని బాధను భరిస్తూ చిట్టి తండ్రి రా నువ్వు ఇలాంటి సమయంలో చాలా ధైర్యంగా ఉండాలని నాకు నచ్చ చెపుతున్నాడు నేను అడిగా నాన్న అమ్మ కు ఏమైంది మీరు ఎందుకు ఇలా నాతో మాట్లాడు తున్నారు నాన్న నన్ను అలా ముందుకు తీసుకు వెళ్లారు అక్కడ అమ్మ పడుకొని ఉంది అందరూ ఏడుస్తున్నారు నాన్న అమ్మకు ఏమైంది అని అడిగా ఏడుస్తూ అమ్మ మనకు ఇంకా లేదు అని చెప్పి నాన్న కుప్పకూలిపోయాడు అక్కడే ఏడుస్తూ. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడే అలా అమ్మను చూస్తూ ఉండిపోయా, అమ్మానాన్న చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా చూశారు ఆ జ్ఞాపకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నా కళ్ళ ముందుకు వస్తున్నాయి, అమ్మ నాతో మాట్లాడాలని ప్రతిసారి మాట్లాడకపోతే ఎంత బాధ పడే దో ఆ బాధ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అమ్మకు గుండెపోటు రావడానికి అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేనిది ఈ లోకంలో అమ్మ ప్రేమకు మించినది ఏదీ లేదు.

అమ్మను పోగొట్టుకున్నాను నాన్న ను జాగ్రత్తగా చూసుకోవాలని నాతో తీసుకొని వెళ్ళాను నాన్న నేను జీవితంలో సంతోషంగా ఉన్నాము ఒకే ఒక లోటు అమ్మ ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని ప్రతి సంవత్సరం ఇంటికి వెళ్లి అమ్మ జ్ఞాపకాలతో గడిపి ఆనందంగా ఉంటున్నాం.

ఈ కథను చదివిన వాళ్ళందరూ అర్థం చేసుకోండి మీ అమ్మ ప్రేమను వాళ్ల జీవితం అంతా మీ కోసమే త్యాగం చేసి మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటారు.

ఇది రాయడానికి మా అమ్మ నాకు రోల్డ్ మెడల్ నాలో ఉన్న ఒక కళను నేను బయటకు తీసుకురావాలఅన్నదే తన కోరిక.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!