బంధం గొప్పతనం

బంధం గొప్పతనం

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

విసిగి వేసారినా బ్రతుకుతున్నామంటే
మన వారి కోసం తాపత్రయం వలనే

కొందరి కోసం భాధని దిగమింగుకుంటాం
ఒకరి కోసం ఒకరం అనుకుంటాం

బందం కాపాడు కోవటానికి ఓ మెట్టు దిగుతాం
ఎన్ని తిట్టినా మళ్లీ మళ్లీ మాట కలుపుతాం

అయిన వారి కోసం సమయం కేటాయిస్తాం
మరు జన్మ వరకూ ప్రేమను పంచుతాం

అవసరం కోసం బంధం వద్దనుకుంటాం
నమ్మిన వారి కోసం ప్రాణాలిస్తాం

తోడు ఉంటే సింహం లా పోరాడుతాం
ఊపిరి ఆగేవరకూ తోడు నిలవాలనుకుంటాం

అనుబందాల కోసం ముడి పడిన బంధం
కన్నీళ్ళ కానుకగా మారిన వైనం
కష్ట సుఖాల జీవన పయనం

మనవి కాని బంధాల కోసం తపించటం
గెలుపు కైనా ఓటమి కైనా నమ్మకం అవసరం

జీవితంలో ఒంటరిగా నిలిచి పోరాడతాం
ఓదార్పు అందించే హృదయం కోసం ఆరాటపడతాం

మనల్ని తాకే గాలి కూడా
ప్రియమైనవారి ఊపిరి కావాలనుకుంటాం
అదే కదా బంధం గొప్పతనమంటాం

You May Also Like

4 thoughts on “బంధం గొప్పతనం

  1. చాలా బాగా వ్రాసారు విద్య గారు
    బాగుంది.👌👍
    Congratulations 👌👍

  2. బంధం గొప్పతనం గురించి బాగా వివిరించారు.
    విద్య గారు చాలా బాగుంది.
    👌👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!