ఆనందం ఆనందం

(అంశం : నా అల్లరి నేస్తం) 

ఆనందం ఆనందం

రచన ::వడ్డాది రవికాంత్ శర్మ

ఆనందం ఆనందం ….
తెల్లవారితే ఆనందం …..

ఆనందం ఆనందం ….
రేడియో లో ప్రభాత వార్తల స్వరం ఆనందం ….

ఆనందం ఆనందం ….
సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ .. వేప పుల్లతో మహదానందం ….

ఆనందం ఆనందం …..
ఆవుపాలు పితికే అవ్వమోహంలో పల్లెజీవన ఆనందం …

ఆనందం ఆనందం ….
అమ్మపెట్టే పెరుగన్నం ముద్దలో ఆవకాయ రుచి బ్రహ్మానందం …

వస్తున్నాడు వస్తున్నాడు అల్లరి నేస్తం …
ఇరుకుగా ఉండే సర్కారీ స్కూలులో …
విశాల ప్రపంచంలో విహరించడానికి ….
ఒకే ఈడులో …ఒకే జోరులో …
జట్టుని నడిపించడానికి …
కొన్ని సార్లు ఓడించడానికి …
వస్తున్నాడు వస్తున్నాడు అల్లరి నేస్తం ….

పాఠశాల మైదానంలో …
ట్యూషన్ మాస్టారి సొంతపనుల్లో..
వరద రోజుల్లో సహాయకార్యక్రమంలో …
తిరునాళ్ల వేడుకల్లో …
పెళ్లి ఇంట్లో కలిసి చేసే సందట్లో …..

ఆనందానికి మరో నిర్వచనంలా …
వస్తున్నాడు అల్లరి నేస్తం ….
చిరకాలం నిలవాలి ఈ బంధం ..

You May Also Like

2 thoughts on “ఆనందం ఆనందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!