స్నేహమే నా ప్రాణం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                               స్నేహమే నా ప్రాణం

రచన ::వి. విజయ శ్రీ దుర్గ

స్నేహానికన్న మిన్న లోకాన లేదు
స్నేహం ఎంతో మధురమైనది
స్నేహం ఒక అనుభూతి
స్నేహం ఒక అద్భుతం
ఎప్పుడు చెరగని చిరునవ్వు
ఇచ్చే నా స్నేహితురాలు ఆమె
ప్రేమించటం తప్ప ద్వేషించటం తెలియని మనస్సు
కలిసి పెరిగాము కలిసి చదివాము
నా చరవాణి లో ప్రతిరోజు శుభోదయమంటూ పలకరింపు నేటికీ
ఓ మంచి చెలిమి బాల్యం నుండి
లోకమంతా ఒంటరి చేసినా నన్ను ఏనాడు ఒంటరి చెయ్యని ఆపన్న హస్తం
నాప్రాణమిత్రురాలు గాయత్రి
మనిషికి దేవుడిచ్చిన బంధం రక్తసంబంధం
స్నేహమనే బంధం మనంఎన్నుకుంటే వచ్చే అదృష్ట బంధం
ఎన్ని లోపాలున్నా సర్దుకుంటూ నా
చిన్ననాటి బాల్యమిత్రురాలు నా స్నేహశీలి నా చెలిమి నీవే నా ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు ఎందుకంటే స్నేహమేనాప్రాణం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!