అడవిలో అమ్మాయి

(అంశం:”అల్లరి దెయ్యం”)

అడవిలో అమ్మాయి

రచన : పుష్పాంజలి

ఇందు అందమైంది చాల ధైర్యవంతురాలు.తను చదవే కళాశాల లో ఎన్ సిసి లో జాయిన్ అయింది….తను చురుగ్గా  క్రమశిక్షణకు మారుపేరుగా వుండడం తో  ఎన్ సిసి క్యాంపుకు సెలెక్ట్ అయ్యింది …

అడవిలోకి పంపడానికి తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా వారిని ఒప్పించి తనతోటి విద్యార్థులతో మాస్టర్ తో బయలుదేరింది…… అది భయంకరమైన నల్లమల అడవి అక్కడ అనీలతో పాటు వారి బ్యాచ్ కు బస ఏర్పాటు చేసారు. …. అక్కడ నుండి మరునాడు అడవికి ప్రయాణం  మొదటిరోజు శిక్షణకు వెళ్ళారు .పందెంలో  అందరికి కంటే చురుగ్గ చాకచక్యంగా ఇందు మొదటి స్దానం దక్కించుకుంది ………. మొత్తం వారం రోజులు క్యాంపు అది మరి రెండవ రోజు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళారు……. రెండవ,మూడవరోజు కూడా ఇందుదే మొదటి స్దానం ఇకా ఇందు మీదా తోటివారికి ఈర్షధ్వేషం మొదలైంది…. నాలుగు రోజు ఆ ఈర్షతో తననే దారి మరలించినారు దానితో అడవిలో దారి తప్పింది ఇందు…..

అడవి అంటే చిరునామా లేనిదే కదా ఎటువైపు చూసినే  ఒకేరకంగా  గుబురుగా పచ్చగా  వృక్షాలతో నిండి వుండేది  …… ఎంతో  వెదికిన  కనిపెట్టాలేరు అడవికి  కొత్తగా వెళ్ళినవారు , కాని తను కరెక్ట్ దారిలోనే వున్నాను అనుకున్నా ఇందు మాస్టర్ చెప్పినా పాఠం మరిచిపొయింది. … చాలదూరం వెళ్ళినా తరువాత కాని అర్థం కాలేదు తను దారి మారినవిషయం
ఆ అడవిలో ఒంటరిగా ఇందు చిన్న చెట్లను మడచి పెట్టాసాగింది గుర్తు కోసం…తను వెళ్లిన దానికి గుర్తుగా  మాస్టర్ అరవడం మొదలు పెట్టింది కాని తన శబ్దం తనకు ప్రతిధ్వని లా వస్తుంది…

అడవిలో సెల్ ఫోన్ లో సిగ్నల్ లేదు కాని అదృష్టమే అని చెప్పాలి చార్జింగ్ వుండడం వలన   లైట్ వేసుకుంది….. కాని భయంకరమైన కటిక చీకటి పులలు
సింహలు తిరిగిచోటు అదే  తన నీడే తన వెనుక
ఒక ఆకారం దెయ్యం లా భయకరంగా వుంది…..

ఇంతలో దూరంగా పులి గాండ్రిపు వినబడింది
ఎందుకైనా మంచిదని ఒక గుబురు చెట్టుపైకి
ఎక్కి నక్కి కూర్చొంది … .

నిజంగా ఒక పులి వచ్చింది అటుప్రక్కకే
ఇందు కొంచెం భయపడలేదు  దానికి
ఆహారం గా  ఎదో చిన్న జంతువులు దొరకడంతో  కుందెలం పిల్ల  దొరకడం వలన
అది  అలా వాటిని పట్టుకుని వెళ్ళిపొయింది….

ఇందు చెట్టు మీదా నుండి మెల్లగా క్రిందకి దిగింది
అలా దిగుతున్న ఇందుకు ఒక నల్లని భయకరమైన ఆకారం కనిపిస్తుంది అది   ఏమిటి  అర్థంకాని పరిస్థితి .అది మెల్లిగా తనవైపు వస్తుంది
గొంతు తడారిపోతుంది అంతకంతకూ దగ్గరకు వస్తుంది అప్పుడు ఇందు కు  చటుక్కున గుర్తుకు వచ్చింది అంజనేయస్వామి దండకం, అమ్మ దగ్గర నేర్చుకుంది గుర్తుకు చేసుకుంది. వెంటనే దండకం చదవడం మొదలుపెట్టింది……

ఇందుకు తర్వాత అది కనిపించేలేదు తర్వాత సెల్ లో లైట్ సాయంతో ఒంటరిగా  నడవసాగింది….

ఒక ఎలుగుబంటి వెంబడించి సాగింది అది అర్థం అయినా ఇందు తన బ్యాగ్ లో వున్న టార్చ్ అగ్గిపెట్టి గుర్తుకు వచ్చింది బయటకు తీసి నిప్పు వెలుగు కీ ఎలుగుబంటి పారిపొయింది….

ఒక  కుందేలు పిల్లని పట్టుకుని దానితోటి కబుర్లు చెప్పుకుంటు నడవసాగింది…….

ఇందు మాసర్ట్  కంగారు పడుతుంటే తోటి విద్యార్థులకు పశ్చతాపం కలగడం వలన
అనీల వెళ్ళిన దారి కొంతవరకు తెలుసు కాబట్టి
అ దారిలో ఇందు ఇందు శబ్దం వినబడసాగింది తను బదులు గా మాస్టర్ అనే కేకతో బదులు ఇచ్చింది …..

ఎలానైయితే ఏమి మాస్టర్ ని తోటి విద్యార్థులు చేరుకుంది .అంతే “మాస్టర్ భయంకరంగా తిట్టసాగారు”…..

“నాకు ఎంతో వ్యధనే కలిగించినావో , ఎంతా భయం వేసింది తెలుసా ఆడపిల్ల వి పైగా ఒంటరి గా అమ్మాయి వి ఈ అడవిలో అడవి మృగాలే కాదు మృగాలాంటి మనుషులు ఉంటారు నీకు తెలుసా అరవసాగారు”……

కాని ఇందు ఒక్కమాట బదులు మాట్లలాడలేదు తనతోటి వారి గురించి కూడా చెడుగా మాస్టర్ కి చెప్పాలేదు……

తనతోటి విద్యార్థులు ఆమె ఔన్నత్యాన్ని గుర్తించి సార్ మేమే తను దారి తప్పడానికి కారణం అయినాం అని చెప్పాలి అంటే ఇందు ఆపేసింది…..

నాకు తిట్లలతో సరిపెట్టారు మీకు భయంకరమైన పనిస్మెంట్ ఇస్తారు చెప్పకండి అని చెప్పింది…

అందరు తమ స్దావరం దగ్గరకు వెళ్ళారు. అలా తను
అడవిలో కూడ  ఒకటే ప్రయాణం సాగించి విజయముతో పాటు మానవత్వం సాటినే ఇందులేఖ …

తరువాత మాస్టర్ ఎలాగో నిజం తెలసి ఇందుకు క్షమాపణ చెప్పారు…….

ఇందు సార్ మీరు మాకు విద్యానేర్పి గురువులు భగవంతుడు తో సమానం మీరు తిట్టవచ్చు మాస్టర్ మమ్మల్ని దండించవచ్చు ఆ అధికారం మీకు ఉంది అని చెప్పింది ఇందులేఖ….

మాస్టర్ అందరితో  అన్నారు ఈ అమ్మాయి ఆత్మస్థైర్యం ధైర్యం మానవత్వం లా అందరికి ఉంటే భారతదేశం,ఇంకా అభివృద్ధి వైపు నడస్తుంది దానికితోడు తల్లితండ్రులు పెంపకం చాలా బాగుంది తొందరలో  ఇందు అమ్మనాన్న. ని కలుద్దాం అనుకుంటున్నాను…..

” మంచి నిర్ణయం మాస్టర్”” మేము కూడా వస్తాం ఎందుకంటే ఇందు ని చాల ఇబ్బంది పెట్టాం కదా ఇలాగైనా అంటి ని అంకుల్ ని కలిసి  క్షమాపణ చెప్పినట్టు ఉంటుంది .ఇందు కి క్షమాపణ చెప్పిన
మాకు తృప్తిగా లేదు .అలాగే రా తప్పకుండా వెళ్ళి కలుద్దాం……

ఎన్ సిసి క్యాంపు అలా ముగిసింది కానీ
ఊరు చేరిన తరువాత*  కళాశాలలో అరుదైనగౌరవం లభించింది ఇందుకు*.” అందరు ఆమె ధైర్యసాహసాలు ని పొగిడారు”…

మాస్టర్ ఇందులేఖ స్నేహితులు అనుకున్నట్లుగా
ఇందు తల్లితండ్రలని కలిసి మొదట క్షమాపణలు చెప్పారు తరువాత వారి పెంపకం గురించి పొగడారు
దానికి ఇందులేఖ తల్లితండ్రులు శ్రీదేవి ,వరప్రసాద్
ఇద్దరు కూడా మా అమ్మాయి కి మేము నేర్పింది ఏమిలేదు, మేము ఇద్దరం ఉద్యోగలం .కానీ
మా సమయం మా అమ్మాయి కి కేటియించివాళ్ళం
తనకు మా నిజాయితీ గురించి అర్దమైంది….

ఇందులేఖ సమాజం పట్ల తన భాధ్యత ని నేర్చుకుంది” ఇంతా చిన్నవయసులోనే మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నం .మా పిల్లకైనా ఇతరులకు అయిన చెప్పిదే ఒక్కటే విషయం ఎప్పుడూ ఇతరులకు హాని చేయకుండా నిజాయితీగా ఉంటే  అదే మనల్ని కాపాడుతుంది .దాన్ని మనం భగవంతుడు అనుకుంటాం .భగవంతుడు కావచ్చు కాకపోవచ్చు అది మనలోని “శక్తి, మంచి  రక్షణ అవుతుంది” దయ్యాలు భూతాలు ప్రత్యేకంగా ఉండదు నేను నా కూతురికి అల్లరి దయ్యం అని పేరు పెట్టాను.అల్లరి చేస్తూ సరదాగా ఉంటుంది ఎవ్వరిని ఏమి చేయదు. ఇతరుల ఈర్షను కూడా మంచిగా చేసుకుని నైపుణ్యం సంపాదించికుంది. దాన్ని నిజం చేసింది అంటూ నవ్వుతూ ముగించారు వరప్రసాద్. మాస్టర్ తో పాటు పిల్లలు అందరు కూడా వారిని అభినందించారు …..

ఇందులేఖ మాత్రం ఎప్పటికి ఆ సంఘటన గుర్తుండిపోయింది. కానీ తర్వాత ఇలా అనుకుంటూ ఉండేది..
ఆ అడవిలో రాత్రి నేను దయ్యలాంటిదాన్ని నేను ఎందుకు భయపడాలి అని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!