విధి చేతిలో ఆట బొమ్మలం

విధి చేతిలో ఆట బొమ్మలం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: లగిశెట్టి ప్రభాకర్

ఈ జీవితమే ఒక చదరంగం
ఆ దేవుడు ఆడించే జగన్నాటకం లో
పాత్రదారులమే మనమంతా
దర్శకుడు ఆ దేవ దేవుడే
ఎవరి కర్మల ఫలితానుసారం
ఆయా పాత్రలు నిర్ణయించబడుతాయి
ఆ ప్రకారం నడుచుకోవాలిసిందే..
అంతే కాని, అయ్యో..ఇలా చెయ్యకపోతిమి
అలా చేస్తే బాగుండేది
ఇలా చేస్తే ఆ ఆపద రాకపోయేదేమో
అని అనుకోవద్దు.. బాధపడొద్దు
ఇవన్నీ… మన భ్రమలు, ఆరాటాలు
విధి చేతిలో ఆట బొమ్మలం
శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదట
ఈ  నిజం తెలుసుకొని ప్రవర్తిస్తే
అంతా అవగతమవుతుంది…
కమ్మిన మాయ పొర తొలగుతుంది
అందుకే మనం దేవుడు ఆడించే బొమ్మలం
అతని చేతిలో కీలబొమ్మలం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!