మంత్రం

మంత్రం

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

ఎందరో మహానుభావులు పుట్టిన
భారత్ నామం పవిత్ర మంత్రమాయే;

బ్రిటిష్ వారిని గడగడలాడించిన
నేతాజీ ఆశయం పోరాట మంత్రమాయె,
గాంధీజీ అహింస శాంతి మంత్రమాయె,
తిలక్ నా జన్మ హక్కు నినాద మంత్రమాయె,
ఆంగ్ల దొరలు పలాయాన మంత్రంతో
స్వేచ్ఛా మంత్రం మన ఆధీనమాయె,

అయినా
గరీబీ హటావో; జై జవాన్, జై కిసాన్
మంత్రాలు మాయమాయె,
నాయకుల వాగ్దాన మంత్రాలు
నాలుక మీద నాట్యం చేస్తున్నాయి,
ప్రణాళికా అభివృద్ధి మంత్రాలు
తూతూమంత్రంగా మారిపోయే,
పెదవి కదపని మేధావి మంత్రం లేదాయె,
హద్దు మీరె యువత విప్లవ మంత్రం,
నైతికత నిరాశ మంత్రమాయె,

రేపటి మంచి భవిత కోసం ఆశల
మంత్రంతో కలలు కంటూ వుందాం
……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!