సాగినంతకాలం….!
రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు
సాగితనంతకాలం నాఅంతవాడులేడు
సాగినంతకాలం నాకునేనేరాజు నేనేమంత్రి
సాగినంతకాలం నన్నెవరూ ఏమిచేయలేరు
సాగినంతకాలం నేనెవరికి లొంగను
సాగినంతకాలం నామాటే సాగాలి
సాగినంతకాలం సాగని నాకేం పర్వాలేదు
సాగినంతకాలం సాగని ఎంతకాలమైన పర్వలేదు
సాగినంతకాలం నా వాళ్ళెవరు లేకున్నా పర్వలేదు
సాగినంతకాలం నేను ఒంటరిగానే బ్రతుకుతాను
సాగినంతకాలం నా సంతోషాలు నావే
సాగినంతకాలం నాకష్టాలు కన్నీళ్ళునావే
చితికిచేరేవరకు సాగని నాకేం పర్వాలేదు.