యోధులు

యోధులు

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ప్రాణం కోసం పాకుడలట లేదు
మడమ తిప్పుట అలవాటు లేదు
భయభ్రాంతులు అన్న ఊసే లేదు
ఎదురుగా ఉన్నది ఒకేఒక్క లక్ష్యం

స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా
సమరమే ఒక ఆయుధంగా
సాదించే స్వాతంత్రమే విజయంగా
బతుకు బాట పట్టినారు యోధులు

మహాత్ముడుగా జన్మించిన వీరుడు
నెహ్రుగారై ప్రేమ పంచిన ప్రేమికుడు
సీతారామరాజుగా వెలసిన ధీరుడు
భగత్సింగ్ ఏ ప్రాణత్యాగ పూజ్యుడు

ఎన్నో జీవితాల త్యాగ ఫలం
మరెన్నో జీవుల కన్నీళ్ళ బలం
స్త్రీలు అనేను కాదు మేము అబలం
వెనుకంజ తెలియని యోధులం

అందరి మన్ననలు పొందిన వాళ్లు
జీవిత రుచి చవి చూడని వాళ్ళు
మనకు పెట్టిన భిక్ష ఈ భారతావణి
కాపాడుకుందామా చిరునవ్వులు ..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!