కరిమింగింన వెలగపండులా

కరిమింగింన వెలగపండులా

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాధ ఓడూరి

కలలకు జీవం పోస్తూ
ఊహలకు మెరుగులు దిద్దుతూ
బ్రతుకు కొత్త వెలుగులతో
తూరుపున ఉదయించే సూర్యునిలా
భవిష్యత్తుని బంగారుమయం చేసుకుందాం
సరి కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటూ
కొత్త సంవత్సరానికి నాంది పలుకుదాం
ఓ కరోనా మహమ్మారి!
కరిమింగింన వెలగపండులా
ఈ సంవత్సరాన్ని మిగిల్చావు
ఇక చాలు నీవు చేసే మారణహోమాలు
దరిదాపుల్లో కూడా నీ ఉనికిని తెలియచేయకు
అంటూ ఈ సంవత్సరానికి వీడ్కోలు చెబుదాం
**

You May Also Like

One thought on “కరిమింగింన వెలగపండులా

  1. బాగుంది ఈ సంవత్సరానికి వీడ్కోలు. అవును ఎన్నో మింగేసింది. ఇక చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!