మది మోసే గాయాలు

మది మోసే గాయాలు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీవిద్య

గుండెకి అతి భారమైనది
వేదనా భరితమైన ది
ఇష్టమైన వారికి నుండి
పొందే కన్నీటి వీడ్కోలు

చేదు జ్ఞాపకాలకు
మధురమైన క్షణాలకు
కాలం కాటేసిన కలతలకు
మది చేసిన గాయాలకు
ఇచ్చే కన్నీటి వీడ్కోలు

మనిషి జీవితంలో కడసారిగా
మరణం తో పలికే బాధాకర వీడ్కోలు

చల చల్లని రేయికి ప్రతి రాత్రి
హాయి గొలిపే తీపి కలల వీడ్కోలు

పుడమి తల్లికి కొత్త ఆశల చిగురులతో
నెలవుల వీడ్కోలు

ప్రాణానికి ప్రాణమైన ప్రియసఖి కి
విధి రాసిన ప్రేమ వీడ్కోలు

అందమైన బంధాలకు ప్రేమ భాష్యమై
కన్నుల్లో కారిన మేఘాలై
ఎదపై బరువుగా జారిన
ముత్యపు వీడ్కోలు

ఏ వీడ్కోలైనా అది మనసుకి ఎంతో భరించలేని ది సుమీ

✒️✒️✒️✒️✒️✒️✒️✒️

You May Also Like

3 thoughts on “మది మోసే గాయాలు

  1. మనసు లోని భారం అయిన వాళ్ళతో చెప్పుకుంటే పోతుంది
    బాగుంది
    👌👌👌👍✒️✒️✒️

  2. బాగుంది శ్రీ వి గారు. ఎన్నో రకాల వీడ్కోలు. తప్పదు గా మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!