నీ ఓర్పే మాకు రక్ష
రచన: చింతా రాంబాబు
మమ్ము మోసే భూమాతవు నీవే
మమ్ము కని పెంచే అమ్మవు నీవే
మమ్ము ఎత్తుకొని లాలించి
ఆడించే అక్కవు, చెల్లివి నీవే
మమ్ము నిద్రబుచ్చటానికి కథలు,బుద్ధులు చెప్పే నాన్నమ్మ, అమ్మమ్మవు నీవే
మమ్ము నమ్ముకొని భార్యగా వచ్చి
మా వంశాన్ని అభివృద్ధి చేసేది నీవే
మా కనుల పంటగా మమ్ము
ఆనందపరిచే కూతురువు నీవే
నీ జీవితం మాకే అంకితం చేశావు
కానీ…
నీ త్యాగం మరిచి మృగమై…
నీకు అడుగడుగునా కష్టం
కలిగిస్తున్నా..
నీవు మాపై చూపే ప్రేమలో లేదు ఏ మార్పు
నీవు ఉంటేనే ఉంటుంది మాకు పుట్టుక
అది గుర్తిస్తేనే మాకు మనుగడ
నీ ఓర్పే మాకు రక్ష.
అది నీవు కోల్పోతే మాకు పడుతుంది శిక్ష.