పశ్చాత్తాపం

పశ్చాత్తాపం

రచన : తిరుపతి కృష్ణవేణి

సరస్వతి మనసు మనసులో లేదు.పెళ్లి అయిన దగ్గరనుండి ఇప్పటి వరకు మాకు ఏ లోటు లేకుండా నా పుట్టింటి వారు చూసుకుంటున్నారు.
ఇంకా ఏం తక్కువ అయినట్టు ఈయనకి,?
ఇద్ధరు పిల్లలతో మేమెక్కడ ఇబ్బంది పడతామే మొనని,అన్నీనాన్న వాళ్ళే చూసుకుంటున్నారు.
నిన్న మొన్నటి వరకు ఇంత మంచి అత్త మామలు
ఎవరికీ దొరకరు!, అని పొగిడిన ఆయన, ఎప్పుడయితే పెద్ద తమ్ముడికి పెళ్లి సంబంధం చూడటానికి వెళ్ళాలి అన్నారో,? అప్పటి నుండే ఈయనలోఈమార్పు
మొదలైంది.
పోనీ,పిల్లల పెండ్లి పేరంటాల సమయంలో మా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? తప్పని సరిగా మేము అడగకుండానే సహాయం చేస్తారు. ఆ సంస్కారం వారికి ఉంది.
మీ తమ్ముడికి ఇప్పుడు ఎక్కువ కట్నం తీసుకుంటున్నారుగా? మనకు అప్పడు చాలా తక్కువ ఇచ్చారు?
అప్పుడు ఇచ్చిన దానికి కొంత కలిపి ఇప్పుడు మనకు ఇవ్వాలి?
అది ఆయన అడుగుతున్నారు.
అలా ఒప్పుకుంటేనే? లేదంటే మనం ఆ ఇంటికి వెళ్ళేదే లేదు? ఆ ఇంట్లో పెళ్ళి సందర్భంగా జరిగే ఏ శుభకార్యాలకు కూడా మనం వెళ్ళాలసిన పని లేదు?
నన్ను కాదని నువ్వు వెలతానంటే వెళ్ళు ,!! నేనేమీ అభ్యంతరం చెప్పను,?అని వెటకారంగా ఆయన మనసులో ఉన్నఅసలు విషయం చెప్పాడు సరస్వతి భర్త వాసు.
సరస్వతికి ఏం చేయాలో అర్ధం అవటంలేదు. అమ్మ, నాన్నలకు ఈయన గురించి తెలిస్తే ఏమనుకుంటారు.? ఈయన మీద ఉన్న గౌరవ భావము పోతుంది.
అలాఅని ఆయనను ఒప్పించలేను? ఆయన్ను కాదని పుట్టింట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికి నేను వెళ్ళలేను.?
నాన్న వాళ్లకు ఆయన మీద చెడు అభిప్రాయం కలిగితే, ఇంతకాలం అండగా ఉన్న వాళ్ళ గుమ్మం ముందుకు ఏదయినా అవసరమైనపుడు మళ్ళీ వెళ్ళగలుగుతామా?
మా పెళ్లి అయి పదిహేను సంవత్సరాలుఐనది. ఇన్ని సంవత్సర కాలంలో వాసు మనసులో ఎన్నడూ ఇటువంటి దురాలోచనలు ఉంటాయని తమ్ముళ్లు గాని, అమ్మ నాన్నలు గాని కలలో కూడా ఊహించలేదు? ఎందుకంటే తమ్ముళ్ళతో పాటు వాసును కూడా వాళ్ళ పెద్ద కొడుకులా చూచు కుంటారు కాబట్టి.

ఇంత కాలం తర్వాత వాసులో ఇటువంటి స్వార్థ పూరిత ఆలోచన వస్తుందని కలలో కూడాఎవరూ ఊహించని విషయం.
ఒకరకంగా ఇది వరకట్న వేధిoపేఅవుతుంది.ఇది ఆయనకు ఎందుకు అర్ధం అవటం లేదు.?
మంచి సమయం చూసి మెలిక పెడితే, కూతురు మీద ఉన్న ప్రేమతో వాళ్ళే గత్యంతరంలేక ఇస్తారు, ఆమెతోనే ఇది అడిగించాలి,?అని ఎవరో ఈయనకు నూరి పోసారు?అమ్మాయిఒక్కతే కాబట్టి కొడుకులతో సమానంగా ఆస్థిలో వాటా ఇద్దామనే ఆలోచన వాళ్లకు కలిగించినట్లు అవుతుంది,
అని ఆయన ఉద్దేశ్యంకాబోలు అనుకుంటా?తమ్ముళ్ళ పెళ్లిళ్ల సందర్భంలో అయితేనే ఇది సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆడబిడ్డ లేకుండా పెళ్లిళ్లు జరగవు కాబట్టి.
అసలు ఈ వాదన కరెక్టేనా?
ఇవన్నీ పెళ్ళికి ముందే ఏనాడో మాట్లాడుకోవలసిన విషయాలు.
వారి ఇష్ట ప్రకారం అడిగినంత కట్నం, ఇతర లాంఛనాలు తీసుకుని పెళ్లి జరిగిన ఇంతకాలమైన తర్వాత ఈ రకమైన కోరికలు కోరటం సరియైనదేనా? ఇది సరస్వతిని వేధిస్తున్న ప్రశ్న? భర్త లో వచ్చిన ఈ పరిణామాన్ని ఊహించ లేక సరస్వతి సత మత మవుతూoది .
స్వతహాగా వాసు చాలా మంచి వాడే, ఇంట్లో పిల్లలకి గానీ నాకు గానీ ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. ఎవరికీ ఒంట్లో నలతగా వున్నా విల విల లాడిపోతాడు. ముందు చూపుతో బాగా పొదుపుగా ఖర్చు పెడతాడు.అలా అని పిసినారి కాదు.
అవసరం అనుకుంటే ఎంతయినా ఖర్చు పెడతాడు . అత్త మామలు అంటే చాలా గౌరవభావం కలిగి వుంటాడు. అలాంటి వ్యక్తి ఇలా మారటం ఏమిటి?పైగాఆయన కోరికల విషయం, అమ్మ నాన్నలతో నేనే అడగాలి అంటాడు?
ఇది ఏమైనా పద్దతేనా? ఆయనకు ఎందుకు అర్ధం కావటం లేదు. ఇంతకాలం తర్వాత కొత్తగా ఇదేంబుద్ది?
ఇది ఈయనకు పుట్టిన బుద్దికాదు . ఎవరో ఈయనబుర్ర పాడుచేశారు. అందుకే అంటారు. చెప్పుడు మాటలు చెవులకు చాలా ఇంపుగా ఉంటాయని? మనకు ఆడపిల్లఉంది ,ఇదిసరియిన పద్ధతి కాదండి అని చెప్పినా? మన అమ్మాయి కి కావాలసినవి వాళ్ళతో అడిగించుకోను? నా కూతురుకు అడగకుండానే అన్నీ సమకూర్చుతా? మీ వాళ్ళలా కాదు అని వాదనకు దిగుతాడు.
అటు అమ్మవాళ్లకు, ఇటు భర్తకు చెప్పలేక మధ్యలో నలిగి పోతూంది సరస్వతి.
సరస్వతి కూడా కాంటాక్ట్ పద్దతిపై అడపా దడపా చేతికి అందిన ఉద్యోగాలు చేసి ఎంతో కొంత సంపాదిస్తూనే ఉంటుంది. డబ్బుకు కొదవే్మీ లేదు. అయినా ఆయనకు ఈ ఆశ ఏంటో అర్ధం కావటం లేదు.
ఆయన నేరుగా తన కోరికను అమ్మ, నాన్నలకు చెప్పటానికి మొహమాటం, నా ద్వారా చెప్పించాలనే ఆయన ఆలోచన నాకు నచ్చదు? నేను చెప్పలేను.
ఇలా అప్పుడప్పుడు గొడవలు, వాదనల మధ్య
మా సంసారం అశాంతిగానే సాగుతువుంది. మా వాళ్ళు మాత్రం పనుల వత్తిడికారణంగా అల్లుడు ఇదివరకటిలా ఉండలేక పోతున్నాడని సరిపెట్టుకుని మామూలుగానే ఉంటున్నారు. పెళ్లిళ్లకు, శుభ కార్యాలకు రావాలసిన లాంఛనాలు పెడుతూనే ఉన్నారు.
పెద్దతమ్ముడి పెళ్లి చూపుల దగ్గర మా ఇంట్లో మొదలైన గొడవలు ఎడ ముఖం పెడ ముఖంగానే అన్ని పెళ్లి పనులు పూర్తి ఐనాయి.
పెద్ద తమ్ముని పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చిన్నతమ్ముని వివాహం కూడా జరిగింది. పెద్ద తమ్మునికి ఇద్దరు పిల్లలుకూడా కలిగారు.బారసాలలు సైతం జరిగి పోయినవి.

ఈయన ఆలోచనా విధానంలో మాత్రం మార్పులేదు. కాలం బరువుగా సాగి పోతూంది.
ఆయనకు గుర్తుకొచ్చినప్పుడల్లా నువ్వు మీ అమ్మ నాన్న కే సపోర్టుగా ఉంటావు?భర్తగా నాకు సపోర్టు గా మాట్లాడవు? అని సాధిస్తూనే ఉంటారు. సరస్వతి పెద్దగా ఆమాటల్ని పట్టించు కోదు.
అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచి పోతున్నాయి.
వాసు, సరస్వతి ల పెద్దమ్మాయి సరయు చదువు పూర్తి అయి మంచి ఉద్యోగంలో ప్రవేశించింది.అబ్బాయి కాలేజీ లో ప్రవేసించాడు బంధువుల ద్వారావచ్చిన ఓ మంచి సంబంధం చూసిఅమ్మాయికి పెళ్లి నిర్ణయించారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సాఫ్టు వేర్ ఇంజనీర్లే!! మంచి ముహూర్తంలో భారీ కట్నకానుకలు, లాంఛ నాలతో బంధువులందరి సమక్షంలో కుమార్తె పెళ్లి వైభవంగా చేసారు.

సరయూ సమీర్ దంపతులు వాళ్ల ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్ లో ఎంతో అన్యోన్యమయిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
కొంత కాలం తర్వాత ఒక రోజు , సమీర్ భార్యతో కలసి మామ గారింటికి వచ్చారు. మాట మంతి అయిన తర్వాత
కుమార్తె తండ్రి తో వచ్చిన విషయం చెప్పింది. మీ
అల్లుడు గారు స్వంతంగా కొత్త అపార్టుమెంటు కొనాలని అనుకుంటున్నారు.ప్లాట్ కూడా చూసారు. యాబై లక్షలు అవుతాయట, సగం డబ్బు మా వద్ద ఉంది సగం డబ్బు మీ దగ్గర తీసుకుందామని వచ్చామునాన్న అని చెప్పింది .
వాసు ఒక్కసారి నివ్వెరపోయాడు. కూతురుకు ఏమి చెప్పాలనో అర్ధం కావటంలేదు. అబ్బాయికి కాలేజీ ఫీజు, డొనేషన్ కట్టాలి చాలా ఖర్చు అవుతుంది. ఎలా చేయాలి? సరస్వతి తో మాట్లాడాడు. ఇవ్వకపోతే బాధ పడతాడేమో? అసలే కొత్త అల్లుడుఅని సరస్వతి
గొణిగింది ఇబ్బందిగా!!
కూతురుకు నచ్చచెప్పటానికి ప్రయత్నం చేస్తూ, నా వద్ద అంత డబ్బులేదమ్మా?
అన్నాడు.
అదేంటి నానా నాకు రావాలసిన వాటాగా నైనా ఈ డబ్బు ఇవ్వండి అన్నది కుమార్తె సరయు.
నీకు వాటా ఎక్కడిది అమ్మ? నీకు ఇవ్వాలసినది పెళ్ళిలోనే ఇచ్చేసాము గదా! మావద్ద ఏమి లేదు. అన్నీ నీ పెళ్ళికే ఖర్చు చేసాము. అన్నాడు వాసు.
అదేంటి నానా మీ అల్లుడికి కోపం వస్తుంది. ఎలా? అన్నది.
కోపం ఎందుకమ్మా?మేము నీకేం బాకీ లేము కదా! మీకు ఇవ్వాలిసినది ఇచ్చేసాము అన్నాడు కోపంగా వాసు. సరయు చిన్నగా మాటతగ్గించి
చూసావా నానా నీదాకా వస్తే గాని నీకర్థం కాలేదు. ఇంతకాలం అమ్మను మీరు వేధించేది ఇదే సమస్య మీద గదా!ఎప్పుడో పెళ్లియిన మీకు ఇంకా తాతయ్య అస్థి ఎలా వస్తుంది? నేను అడిగితే కాదని అంటున్నారు? నాకొక రూలు? మీకొక రూలా? ఇంత కాలం నుండి అమ్మను వేదిస్తున్నారు. ఏదయినాప్రేమాభి మానాలు కూడబెట్టుకోవాలి గాని, బలవంతంగాఒకరిని ఇబ్బంది పెట్టి ఆస్టులు కూడబెట్టటం కాదు నాన్న! మాకెందుకు నాన్న నీ డబ్బు. అమ్మ పడ్డ బాధ ను చూసి నీకు తెలియ జేయాలనే మీ అల్లుడు గారు నేను మాట్లాడుకొని ఇలా నాటకం ఆడాము.
నేను అడిగితే మీరు ఎంత బాధ పడ్డారు? అలానే అమ్మ తాతయ్యవాళ్ళను అడిగితే వాళ్ళు అంతే బాధ పడేవారు నాన్న.డబ్బు కాదు ముఖ్యం
ప్రేమను రాగాలతో కలసి మెలసి బ్రతకాలిఅన్న కుమార్తె మాటలకు తండ్రి మనసునే పశ్చాత్తాపం తో కృంగి పోయాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!