నోదిటి వ్రాత

నోదిటి వ్రాత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం

ఒక అగ్రహారం లో విశ్వేశ్వర శాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి భక్తి భావాలు నిండుగా ఉంటాయి. అంతేకాదు ప్రతిది ఆ దేవుని లీల ఆయన ఆజ్ఞానుశారమే మనిషి యొక్క ఉనికి ఉంటుందని ప్రగడావిశ్వసం. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే పండుగలకు ఆ దేవుని దర్శనార్థం తీర్థయాత్ర లకు పోవటం అతని బలహీనత ఎన్ని ఆటంకాలు ఎదురైనా తీర్థయాత్రలకు పోకపోతే అపశకునంగా బావిస్తాడు. అలా విశ్వేశ్వర శాస్త్రి యొక్క అలవాటు. అతనికి పెళ్ళి జరుగుతుంది. అలా పెళ్ళి చేసుకొని భార్యతో కాపురం చేస్తున్న శాస్త్రి గారికి ప్రతిసారి భార్యను తీర్థయాత్రలకు తీసుకుపోవడం కుదరక ఇంట్లో భార్యను ఒక్కతినే ఉంచి పోలేక ఒకరోజు బాగా అలోచించ సాగాడు. తీర అతనికి ఒక శిష్యుడు ని గా తెచ్చుకొంటే అతని కి చేదోడువాదోడుగా ఉంటాడు తను తీర్థయాత్ర లకు పోయినప్పుడు తన భార్యకు కాపలాఉంటాడు అని అలోచించి “ఒక శిష్యుడు ని పెట్టుకున్నాడు. అతని పేరు  విఘ్నేశ్వర భట్టు” ముద్ధగా భట్టు అని శాస్రి పిలుచుకోనేవాడు. ఈ భట్టు చాలా చురుకైనవాడు. గురువు దగ్గర విద్యలు అభ్యసించడమే కాకుండా గురువు గారు తీర్థయాత్ర లకు వెళ్ళి నప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండే వాడు. ఇలా ఉండగా శాస్త్రి గారి “భార్య గర్భిణీ గా ఉన్న సమయంలో శాస్త్రి తీర్థయాత్ర కు వెలుతూ భట్టు కు అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో మని తను ప్రసవ సమయంలో జాగ్రత్తగా ఉండామని చెప్పి శాస్త్రి వెళ్ళ గా ఒక రోజు గురువు గారి భార్య ప్రసవం అవుతున్నది పురిటి నొప్పులురాగా, ఇరుగు పొరుగు వారు వచ్చి పురుడు పోస్తున్నారు. భట్టు పురిటి గది భయట కూచుని ఎంతా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మ తాత వచ్చి పురిటి గదిలోకి వెళ్లిబోయినాడు. ఎవరికి కనిపించని బ్రాహ్మ భట్టు చూడ గలిగాడు. కానీ ఎవరనేది. గుర్తించ లేదు.
“ఎవరు నీవు? ఎందకు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. లోపల మా గురువు గారు ఐన విశ్వేశ్వర శాస్త్రి గారి . అందుకే! బిడ్డ భూమిమీద పడకముందే నేను వాడి నుదుటి వ్రాతవ్రాయాలి నేను బ్రహ్మదేవుణ్ణి అన్నాడు! బ్రహ్మ. వెంటనే భట్టు తెలివిగా స్వామి దంభార్యప్రసవిస్తుంది ఈ పరిస్థితుల్లో మీరు లోపలకి పోవడం ససేమిరా వీల్లేదు.అన్నాడు! భట్టు. ” నాయనా భట్టు నేను లోపలికి వేళ్ళుతున్నదిడాలు! ఐతే,ఏమని? వ్రాస్తావో? చెబితే గాని నేను లోపలికి పోనివ్వనూ! అన్నాడు? భట్టు. నాకు నీతో ముచ్చటిం చేటంత వ్యవధి లేదు అదికాక నేను నొదుట వ్రాసే వ్రాత దేవ  రహస్యం ముందుగా తెలియకుడదు. అన్నాడు విధాత!

“ఐతే నేను కూడా మా గురువు గారి మాట ఇచ్చాను మా గురువు గారు తీర్థయాత్ర లు ముగించి వచ్చే దాక మా గురువు గారి కుటుంబం కాపాడతానని. కనుక నీవు లోపలికి వేళ్లటానికి వీల్లేదు! అన్నాడు! భట్టు మొండిగా! “సరే!ఏమి వ్రాస్తానో! నీకు చప్పగలను గాని నీవు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ తల నాలుగు వచ్చలై చస్తావు! అని బ్రహ్మతాత శాపం ఇచ్చాడు. భట్టుకు! “భట్టు నా కథంతా తెలియదు.  నువు వ్రాసే వ్రాత ఏమిటో!చెప్పిమరీ లోపలికి వెళ్ళు అన్నాడు! భట్టు.”ఐతే విను ఈ సంగతి ఎవరికన్న చెప్పవా! నీతల నాలుగు బద్దలవుతుంది. మీ గురువు గారి భార్య కు మగసంతానం కలగబోతుంది. వీడు బతికి నంత కాలం ఎంత వచ్చినా నిలువదు తినటానికి చిన్నపాటి పాడి అంతే ఎప్పుడూ దరిద్రంగానే ఉంటాడు. ఏమి చేసినా ఎంత చేసిన ఇల్లు సంసారం ఎక్కిరాదు. ఇదే వీడిరాత అన్నాడు. బ్రహ్మ.”అంత ధరిద్రమా? స్వామి ఒకరికి పెట్టుకునేటెందుకూ, చేసుకొనేటందుకూ కూడలేది?  అన్నాడు భట్టు!
“చేసుకన్న వారికి చేసుకున్నంత నేనేం చెయ్యని? అన్నాడు! విధాత.”పోనీ ఈవ్రాత ఐనా మారకుండా ఉంటాదా?అన్నాడు!భట్టు. ” నా వ్రాతను మారకుండా నేనే కాపాడు కుంటా అంటూ?!బ్రహ్మ పురిటి గదిలోకి వెళ్ళాడు. వారికి కిసేపటికి పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఆ తరవాత విశ్వేశ్వర శాస్త్రి యాత్ర నుంచి తిరిగి వచ్చి పుత్రుడు పుట్టి నందుకు చాలా సంబరపడి నామకరణ మహోత్సవం వైభవంగా జరిగిపించాడు. కానీ భట్టు అంతగా సంతోషపడలేదు. అసలు విషయం చెప్పలేడు.చెప్పితే తలపగిలి చనిపోతాడు. తరువాత రెండు మూడు సంవత్సరాలు గడిచాయి శాస్త్రి గారి భార్య మళ్లీ కనటానికి సిద్దంగా ఉంది. కానీ విశ్వేశ్వర స్వామి ఎప్పటి లాగే తీర్థయాత్ర లు చేస్తున్నాడు. భట్టు గురువు గారి భార్య ను జాగ్రత్తగా చూసుకొంటున్నాడు.ఇంతలో గురువు గారి భార్య కు పురిటినోప్పులు రావడంతో భట్టు ఇరుగు పొరుగు వారిని పిలిచి పురిటి గది లోకి పంపపేడు.భట్టు యధా ప్రకారం పురిటిగది బయట కాపలా ఉన్నాడు.
మళ్ళీ బ్రహ్మ వచ్చాడు భట్టు కు కనిపించాడు. స్వామి తమరు ఇక్కడే ఉన్నారా! అన్నాడు. లేదు, లేదు నేను ఇప్పుడే పుణ్యలోకం నుంచి వచ్చాను. అని బ్రహ్మ అనగా! ఐతే ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు వ్రాత రాయుటకు వచ్చినా! అని అడిగాడు భట్టు అవును! అన్నాడు, బ్రహ్మ ఐతే ఈ సారి ఏం పిల్ల?  మీరు ఏ వ్రాత వ్రాయబోతున్నారు.? అని అడిగాడు భట్టు. “అదంతనీకు కనవసరం నన్ను లోపలికి పోనీ అన్నాడు బ్రహ్మ . “చెప్పందేలోపలికి పోవటానికి వీల్లేదు అన్నాడు. భట్టు.చేసేది లేక ‌బ్రహ్మ చెప్పేవాడు. “ఈ సారి ఆడపిల్ల  దానికి పెళ్లి అయినా పిల్లలు పుట్టరు గుడ్డురాలు గా పేరు పోందుతుంది. ఎన్ని సార్లు ప్రయత్నించినా పిల్లలు గలగరు మానసికంగా బాధ పడుతూ జీవిస్తుంది. అన్నాడు. బ్రహ్మ. భట్టు చెప్పరాని కోపం వచ్చింది.కానీ ఏం చేస్తాడు? బ్రహ్మ వ్రాత కు అడ్డు ఏముంది. “ఈ సంగతి ఎవరి తోనైనా చెబితే నీ తల పగిలి చస్తావు.అంటూ!బ్రహ్మ పురిటిగది లోకి వెళ్ళాడు. అది జరిగిన కొద్ది కాలానికి భట్టు గురువు గారి వద్ద సెలవు తీసుకొని తన సొంత ఊరికి వెళ్ళి భట్టు కూడ పెళ్ళి చేసుకొని ఒక ఇంటి వాడు అయినాడు. అలా కాల చక్రం తిరగ కొన్ని సంవత్సరాలు గడిచాయి. భట్టు కు తన గురువు ఐన విశ్వేశ్వర శాస్త్రి ని చూసి తన పిల్లలకు బ్రహ్మ వ్రాసిన వ్రాతల వల్ల ఎలా బతుకుతున్నొరో ఒక సారి చూసి రావాలని,బ్రహ్మ వ్రాతకు తిరుగు ఉండదు కదా! ఆ వ్రాత ప్రకారం జరిగితే పాపం పిల్లలిద్దరూ నిష్కారణంగా కష్టాలు పడుతారని భట్టు అలోచించసాగాడు. ఎలాగైనా వారి ఇద్దరి వ్రాతలు మార్చాలని భట్టు వెంటనే గురువు వద్దకు బయలుదేరాడు గురువు ఆయన భార్య చనిపోయి కొద్దికాలం అయిందని పిల్లలిద్దరికి వివాహం అయిందని కొడుకు ఏదొ చిన్నపాటి పూజలు చేస్తే ఉన్నా కొద్ది పాటి పోలం చూసీ కుంటున్నాడు. ఎంత కష్టపడి పని చేసి ఎంత సంపాదించినా వ్రాత ప్రకారం అతనికి ఇంటి కి ఆరోజు కారోజు తిండి పాడి సరిపోతుందే తప్ప మిగలటంలేదు. గురువు గారి పాపకు పెళ్ళి ఐ సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలుగుటలేదు. దానికి పిల్లలు పుట్టరు అది గొడ్డు పోతు అని తిట్టు అత్తగారు.ఆ పిల్లకు అత్తగారింట్లో ఉంఉటం కష్టంగా ఉంది. భట్టు ఆ ఇద్దరికీ ఒక సలహా ఇచ్చాడు. అబ్బాయి తో ఈ విధంగా చెప్పాడు!”నీవు డబ్బు కేమీ విచారించకు నీ దారిద్ర్యం చూసి భయపడి కు నీ దగ్గర ఉన్నది ఏదైనా డబ్బు గింజలు ధాన్యం పెట్టి సరిపోయినంత మందికి మీ తల్లిదండ్రుల పేరుతో సంతర్పణ చేసెయ్యి సాయంకాలం అయేసరికి ఇంట్లో ఒక్క గిజగిజ మిగల్చకు నీకు ఉండే పాడి ఒక ఆవుదాన్ని కూడ ఉంచకు ఎవరికైనా విక్రయించే. అమ్ముడు పోకపోతే దానం చేసెయ్యినీకేమి నష్టం ఉండదు. అని సలహా ఇచ్చాడు. దానికి గురవు కొడుకు భయపడి”అసలే నాది బీద సంసారం నీవు చెప్పింది వింటే నా భార్య నేను చచ్చిపోమా? అన్నాడు.
“నా మాట నమ్ము నేను చెప్పినట్లు చేయ్యి నీకేమి నష్టం కలగకుండా నేను చూస్తాను కావాలంటే నేను కొంత కాలం ఇక్కడే ఉంటారు. నా మాట రుజువు చేస్తాను.  అన్నాడు. భట్టు “ఎంత కాదన్నా భట్టు మన సొంత మనిషే అని నమ్మి ఆ రోజు కారోజు కావలసిన గింజలు మాత్రం ఉంచుకుని మిగతావి వండించి నలుగురిని పిలిచి భోజనాలు పెట్టాడు. శాస్త్రి గారి కొడుకు, ఎన్నడూ పిల్లికి కూడా బిచ్చంపెట్టని స్థితిలో లేనివాడు సంణర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యంగా నే ఉంది.
ఆ రోజు సాయం కాలం ఉన్న ఒక్క అవును బజారుకు పట్టుకెళ్ళి శాస్త్రి గారి అబ్బాయి అమ్మేసి ఆ ఉబ్బు తనకు భార్యకు కావలసిన వస్తువులు కనుక్కోన్నాడు.మరునాడు పొద్దునే కల్లా శాస్త్రి గారి అబ్బాయి కి కబురు వచ్చింది.ఆ ఊరి ఆసామి ఇంట్లో ఏదో పూజ చేయాలని పిలుచుకొని పోయీ గింజలు ఒక ఆవును దానము దొరికింది. మరలా భట్టు చేప్పిన ప్రకారం శాస్త్రి గారి అబ్బాయి ఆ వచ్చిన గింజలు పంచిపెట్టి గోవును అమ్మేశాడు. మర్నాడు ఉదయం ఇంకోక కబురు పూజకు పిలిచారు వాళ్ళు కూడా శాస్త్రి గారి అబ్బాయి కి ఒక మూట గింజలు ఆవు దానం ఇచ్చారు. ఇలా పూజల తో కొన్నాళ్ళు గడిచింది. కాని మధ్యహన్నమే వరకు దోడిలో ఆవు కట్టెసి వుంది ఇంట్లో ఒక గింజల మూట ఉంది. శాస్త్రి గారి అబ్బాయి కాక నాటిఆనుఉంచి ఇల్లు కదల కుండానే గింజలు, ఆవు దొరుకుతున్నాయి. భట్టు శాస్త్రికోడుక్కి సలహా ఇచ్చినట్టు గానే శాస్త్రి కూతురికి కూడా ఒక సలహా ఇచ్చాడు. “అమ్మ పిల్లలు పుట్ట నీకు లేదని దిగులు పడకు నేను చెప్పినట్లు గా చెయ్యి నీకు లక్షణమైన పిల్లలు పెడతారు. అని నీవు నచ్చిన పిల్ల ను తెచ్చి సాకు వాడి నోటితో అమ్మా‌ అని పిలిపించుకో ఇలా నీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంత మందిని తెచ్చి సాకు అందరినోట అమ్మా అనే పిలుపు రావాలి అని చెప్పాడు. భట్టు. ఈ మాట వినగానే ఆ శాస్త్రి గారి అమ్మాయి కీ నన్ను చూస్తే నే తిట్టే వారు వారి పిల్లలని దత్తత ఇస్తారు, అని దిగులు గా అడిగింది.”ఇస్తారమ్మ ఇస్తారు నీవు కొన్ని దినాలు ఇలా చేయ్యి అన్నాడు. భట్టు. మర్నాడు ఆ అమ్మాయి పిల్లను తెచ్చి సాకడం వారికి అమ్మా అనే పదం నేర్పించడం మొదలుపెట్టింది. ఇలా కొంత మంది పిల్లను తీసుకొని వచ్చి సాకుతూ అమ్మా అనే పిలిచేటట్టు చేసింది. భట్టు ఒక చెప్పినట్లు చేయడం వల్ల శాస్త్రి గారి పిల్లలు ఇద్దరూ సమస్యలు పరిష్కారం ఐ ఇద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి. భట్టు వారికి జాగత్త లు చెప్పి మొదటి జామున కోడి కూసే వేళ తన సొంత ఊరి కి ప్రయాణంమైనాడు. కాస్త దారి చక్కగా కనపడతుంది. భట్టు దారిలో ఒక పెద్ద మనిషి ఎదురైనాడు. అతని ఒక భుజాన గింజల మూట ఒక చేతిలో పిల్లలు ఒక ఆవును పట్టకోని తెస్తున్నాడు. ఆ వచ్చేది. విధాత అని  భట్టు  గ్రహించి. స్వామి!అని దండాలు పెట్టాడు. “బ్రహ్మదేవుడు నీ మూలంగా నాకెన్ని పాట్లు వచ్చాయి చూడు, అన్నాడు. నన్నేంచేయ మంటారు స్వామి!  వాళ్ళ కర్మ వాళ్ళది. అన్నాడు భట్టు నవ్వుతూ! “ఇది వాళ్ళ కర్మ కాదోయీ నా ఖర్మ నాకు ఒక్క పనిఆచేసుకోటానోకి తీరిక చిక్కటంలేదు. అన్నాడు బ్రహ్మ తాత. అలా ఆ వ్రాత కొంచెం ఐతే చెరిపి వేయ్య కూడ దో!. అన్నాడు. భట్టు. “చెరపటం ఎలాగా! కానీ కొంచెం దిద్ది బ్రహ్మ దేవుడు వెళ్ళి పోయాడు. ఆనాటి నుంచి శాస్త్రి గారి అబ్బాయి పట్టిందెల్లా బంగారం అయింది. అమ్మాయి కి చక్కగా పిల్లలు కలిగారు. భట్టు చెసిన ఉపకారానికి గురువు చాలా సంతోషపడి స్వర్గానికి పోయారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!