చేతి కర్ర

చేతి కర్ర
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు.

   జమిందార్ రాజనాల గారు అత్యంత ఐశ్వర్యవంతడు, చుట్టుపక్కల వంద గ్రామాల్లో ఏ అవసరమున్న ఆర్ధిక పరంగా, న్యాయపరంగా గాని జమీందారుగారి మాటకు తిరుగులేదు, రైతలూ, పేదవర్గాల ప్రజలు జమిందార్ రాజనాల గారిని మకుటం లేని మహారాజులా భావిస్తారు. ఆ క్రమంలో వందల ఎకరాల భూస్వామి జమీందారుగారికి రానురాను అహంభావం ఎక్కువైపోతుంది. రాజాప్రసాదం లా ఉన్న తన ప్యాలస్ లో విలాసవంతమైన జీవితంతో ఎంతోమంది కాళ్ళకు మడుగులెత్తే పరిచారికులతో సేవలు చేయిన్చుకొంటు ఆనందం గా ఉన్నాడు జమిందార్ రాజనాలగారు. ఒక రోజు తన భవన ప్రాంగణం లో ఉన్న చలువరాతి కొలను లో సేదదీరుతూ, తన కోసం ఎండలో చేతులు కట్టుకొని ఉన్న కొంత   మంది గ్రామ ప్రజలు తో మాట్లాడతూ బహుదర్పంగా నవ్వుతూ వారి ఆర్ధిక ఇబ్బందులు, పొలాలకు కావలసిన ఎరువులు గురించి వింటూ, “ఒరేయ్,మీ అందరికి బాగోగులు చూసే రాజు ని, మీ అందరూ నాకు సేవకులు ” అని ఎంతో అహంకారంతో నవ్వుతూ అనేసరికి ” ఇక్కడ ఎవరు ఎవరికి సేవకులు కాదు బాబయ్య, ‘అన్న మాటలు బిగ్గరగా జమీందారుగారికి వినిపించి ‘ఎవడ్రా,నా మాటకి ఎదురు చెప్పింది, ధైర్యంగా ముందుకి  వచ్చి మాట్లాడండి, అని కోపంతో అరిచాడు జమిందార్.
‘నేనె బాబుగారు రామయ్యని అంటూ ఒక75ఏళ్ళ వృద్ధుడు చేతికర్ర సాయం తో  వచ్చి ‘మీరు అన్న దాంట్లో తప్పు ఉంది కనుక నేనె అన్నాను బాబుగారు,”అనేసరికి “నీ కెంత ధైర్యం, నా మాటకి ఎదురు చెప్తావా, మీరందరు నాకు సేవకులు కాదా? అని కోపంగా అరిచాడు జమీందారు, కాదు, బాబయ్య! మనుషులు ఒకరికి ఒకరు సేవకులు, ఇది నిజం బాబయ్య అని రామయ్య అనేసరికి రెట్టించిన కోపం తో ‘ సరే, నువ్వు దేనికి వచ్చావు, అని అడిగాడు. ‘జమీందారుగారూ,మా గ్రామం లో చాలా ఎక్కువ నీటి కొరత తో ప్రజలు అల్లాడిపోతున్నారు, మీరు దయ తో ఒక మంచి నీటి బావి తవ్వించి అదుకోగలరని ప్రార్ధిస్తున్నాము బాబయ్య”,అని అన్నాడు రామయ్య. సరే, నువ్వు నీ గ్రామ ప్రజలు నా సేవకులని ఒప్పుకో, మీ గ్రామంలో ఒకటి కాదు 3 బావులు త్రవ్విస్తాను, అన్నాడు జమీందారు అహంకారంతో బిగ్గరగా నవ్వాడు, ‘అయ్యా,మీ దగ్గర నేను అలా మాట్లాడినందుకు మన్నించండి, కానీ మీకు సేవకులం కాదు, మనుషులంతా ఒకరికొకరు సేవకులు అని రుజువుచేస్తాను, ఒక్క గంటలో, మీరు అనుమతి ఇస్తే, అని అన్నాడు రామయ్య. “సరే, నీ మాటకు ఒప్పుకొంటున్నాను, రుజువు చెయ్యి, నువ్వు గెలిస్తే నీ గ్రామంలో 3 మంచినీటి బావులు ఉంటాయి, ఓడితే నీకు100 కొరడా దెబ్బలు ప్రజలందరూ సమక్షంలో శిక్ష ఉంటుంది'”అన్న జమీందారి షరతులకు ఒప్పకొంటు, అలాగే బాబయ్య,మావూరి ఆచారం ప్రకారం ఎవరితో పందెం కాసిన వారి పాదాలను తాకి ఒప్పకోవాలి, కనుక నేను మీ పాదాలను తాకడా నికి అనుమతించండి”, అని ఆడిగేసరికి జాలిపడి సరే అన్నారు జమీందారు. అక్కడే ఉన్న ప్రజలు అయ్యే ముసలాడికి మూడిందే, జమీందారు తొ పందేమా!, అని విస్తుపోయి చూస్తున్న తరుణంలో రామయ్య ‘మెల్లగా చేతికర్ర సాయంతో, జమిందార్ దగ్గరకు వఛ్చి నమస్కారం పెడ్తూ, స్వామి,”ఈ నా చేతికర్ర పట్టుకోండి,”అనగానే నవ్వుతూ చేతికర్ర తీసుకున్నాడు, రామయ్య వంగలేక వంగి జమీందారు పాదాలను తాకాడు, మళ్ళీ లేచి స్వామి,’ నా చేతికర్ర ఇవ్వండి “అని అనేసరికి, జమీందారు చేతికర్ర రామయ్యకు ఇచ్చేసాడు, అంతే ఆక్షణం లో వృద్ధుడైన రామయ్య,జమీందారు గారు ఇప్పుడే రుజువు చేస్తాను,”ముందు నేను రాగానే మిమ్మల్ని నా చేతికర్ర పట్టుకొమ్మన్నాను, ఆవిధంగా మీరు నాకు సేవ చేశారు, మీ పాదాలను తాకిన తర్వాత నా చేతికర్ర మీరు ఇచ్చారు, ఇలా ఒకరికి ఒకరం సేవ చేసుకొన్నట్లే, కనుక ప్రపంచంలో ఎవరు సేవకులు కాదు, ఒకరికొకరు సేవకులు మాత్రమే”‘అని రుజువయ్యింది, అని అనగానే జమిందార్ రాజనాలగారికి అహంకారం వదిలి రామయ్యాని దగ్గరకి తీసుకొని “నిజమే, మనుషులంతా ఒకరికొకరు సేవకులు మాత్రమే, ఎవరో ఒకరికి బానిసలు కాదు,అని పొగిడి,”రామయ్య,నువ్వే గెలిచావు, నీ గ్రామంలో 3 మంచినీటి బావులు త్రవ్విస్తాను”అనేసరికి అక్కడ ఉన్న ప్రజానీకం కరతాళధ్వనులతో జమీందారుగారికి, రామయ్యకి జేజేలు పలికారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!