భూమి ఆకాష్ ఓ అపార్థం

భూమి ఆకాష్ ఓ అపార్థం

రచన:: ఎన్.ధన లక్ష్మి

“హా  అమ్మ !  హా బయలుదేరాను   నువ్వు చెప్పిన వస్తువులు అన్ని తీసుకున్న …క్లైమేట్ బాలేదు  అంటే కూడా  ఈ రోజు మంచి రోజు  అంటూ బలవంతాన పంపించావు … వచ్చేస్తున్నాలే ..

 ఇలా ఆదరాబాదరాగా  ఎదురుగ వచ్చిన వ్యక్తికి  డాష్ ఇచ్చేసి ఇద్దరు కింద పడతారు ..సారీ అండి

కంగారులో చూసుకోలేదు …పడిన తన వస్తువులను బాగ్ లో వేసుకొని పైకి లేచి ఎదురుగా  ఉన్న వ్యక్తిని చూసి ఆనందంగా  “భూమి ” అన్నాడు …

   క్రింద పడ్డ తన వస్తువులను తీసుకుంటున్న  “భూమి” అన్న పిలుపుతో తల ఎత్తి చూసి ” ఆకాష్ ”
అంది  కోపంతో  …..

   ఎప్పుడు తన వైపు ప్రేమగా చూసే తన ఇష్టసఖి ఎందుకు అంత కోపంగా చూస్తుందో అర్థము  కాలేదు ..  మనసులో కూడా ఇష్టసఖి అనుకోకూడదు తనకి పెళ్లి అయింది  కదా …నవ్వుతు భూమి కి  సాయం చేయాలనీ చుస్తే సున్నితంగా తిరస్కరించింది .
ఆ షాపింగ్ మాల్ నుంచి బయట పడాలని చుస్తే విపరీతంగా వర్షం  మొదలైంది ..క్యాబ్ కి  ఫోన్ చేస్తే
ఈ కుండబోతా వర్షంలో రావడం కష్టం అని చెప్పుతున్నారు భూమి కోపం ఎక్కువ అయి తన చేతిలో ఉన్న ఫోన్ పడేసి  వెళ్ళిపోయి ఆ  మాల్ లో  ఉన్న రెస్టారెంట్ కి  వెళ్ళి  గోర్లు  కొరుకుతూ  కూర్చుంది

  ఆకాష్  నవ్వుతు నీకు ఇంకా ఇలా  కోపం వస్తే  ఫోన్  పగలకొట్టే  అలవాటు పోలేదు  అనుకుంటూ  వాటిని తీసుకొని సెట్ చేసి ఆన్ చేసాడు … వాల్ పేపర్లో  భూమి పెళ్లి ఫోటో …ఒక  క్షణం బాధ  పడ్డ ,  ఎప్పటికి  నాది  కానీ  సొత్తు పై  ఆశ పడకూడదు అని మనసులో అనుకోని  భూమి దగ్గరికి  వెళ్ళి  ఫోన్  ఇచ్చాడు …

   భూమి  కోపంగా తీసుకొని ” ఇప్పుడే రావాలా ఈ  పాడు వాన …నా జీవితంలో  ఎప్పటికి చూడకూడదు,కలవకూడదు అనుకున్న వ్యక్తులను  చూడవలసి వస్తుంది అని తిట్టుకుంటూ ఉంటుంది …

   ఎందుకు  భూమి నీకు  నేనంటే అంత  కోపం? అసలు  కోపం నేను తెచ్చుకోవాలి . ప్రేమించినప్పుడు గుర్తుకు రాని  నా  స్టేటస్ ,పెళ్లి చేసుకోవాలంటే గుర్తుకు వచ్చినందుకు ..నన్ను ఎంతగా  అవమానించావు ..

అయిన  కూడా నేను ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకున్న ..

      హే  ఆకాష్ …ఏమి  మాట్లాడుతున్నావు …నేను ఎప్పుడు అలా అనుకోలేదు ,. అలా  అయితే నేనే నీ వెంట ఎందుకు పడతాను ..గుర్తు లేదా నేను నీకు ఎలా ప్రొపొసె చేసానో ???

 ఆకాష్ బాధ పడుతూ గతం గుర్తుకు తెచ్చుకుంటాడు …..

  ” ఆకాష్ సాధారణ మధ్యతరగతి అబ్బాయీ ..అందంతో  పాటు మంచితనం కలిగిన అబ్బాయీ.  టాపర్ ,సింగర్ .ఎప్పుడు కాలేజీలో అందరి దృష్టిని  తన వైపు ఉంటుంది ..ఎంతోమంది ప్రేమించమని వెంట పడ్డ తిరస్కరించేవాడు …

    భూమి పెద్ద బిజినెస్ పర్సన్  ఏకైక సంతానం .. ఆకాష్ కాలేజీలో జాయిన్ అయింది.

ఆకాష్ ని చూడగనే ప్రేమించడం మొదలు పెట్టింది .. తన ప్రేమను పలువిధాలుగా తెలిపేది
నిస్వార్తమైన ,స్వచ్ఛమైన భూమి ప్రేమ చూసాక తాను కూడా  ఇష్టపడ్డాడు ..కానీ ఎప్పుడు తన ప్రేమను తెలపలేదు ..కారణం  తన  పరిస్థితి …

  ఓ రోజు ఆకాష్ కాలేజీ గ్రౌండ్లో   ఫ్రెండ్స్  తో  కలిసి   ఫుట్ బాల్ ఆడుతుంటే భూమి రావడం చూసి అక్కడ ఉన్నవారు వెళ్లిపోయారు …

  ”  చూడు ఆకాష్ ,,,నా పై నీకు ప్రేమ ఉన్న  ఎందుకో చెప్పలేక పోతున్నావు … అబద్ధం అనకు ..
నేను  కనిపించిన ప్రతిసారి నీ  కళ్ళలో మెరుపును చూస్తాను …అది  నిజం…ఎందుకు  నన్ను దూరం
పెడుతున్నావు … ఈ  రోజు  సాయంకాలం 6 గంటలకి నువ్వు వచ్చి ఐ లవ్  యు  చెప్పేంతవరకు నేను ఇక్కడే ఉంటా అని  సీరియస్ గా   వార్నింగ్   ఇస్తుంది …కోపంగా చూస్తూ ఫోన్ కూడా పగలకొడుతుంది

    ఆకాష్  కోపంగా చూస్తూ ఏమైనా చేసుకో నేను రాను అనేసి  వెళ్ళిపోతాడు …

రూమ్ కి  వెళ్ళాడు కానీ  మనసంతా భూమిపై ఉంది . ఉన్నట్టుండి  వాన మొదలై అది కుండపోతగా మారింది,

      భూమి పట్టుదల  తెలిసి పరుగున కాలేజీకి చేరుకున్నాడు …అంత వానలో కూడా ఆకాష్ కోసం అలాగే నిలపడి ఉంటుంది …తనని చేరి రామని  పిలిస్తే రాలేదు …

 ” చెప్పగా ! ఐ లవ్ యు అని చెప్పితేనే వస్తాను అని ఇంకో మాట చెప్పేలోపు తన పెదాలను లాక్ చేసి ఇదే నా సమాధానం అంటాడు ..భూమి సిగ్గుపడుతూ  తనని హాగ్ చేసుకుంటుంది …

ప్రస్తుతం …

 నాన్న చెప్పింది నిజమే …నువ్వు స్వార్థపరుడువి ..నాకన్నా డబ్బున్న అమ్మాయీ కనపడగానే  నన్ను కాదు అనుకున్నావు .. మళ్ళీ    నన్ను  అంటున్నావు …

  ఎవరు  చెప్పారు ..నేను నిన్ను మోసం చేశాను అని …

  ఎవరో చెప్పారు అంటే నేను ఎందుకు నమ్ముతాను మా  నాన్న అన్నారు ..

కోటీశ్వరుడు అయిన  మన  పెళ్ళికి  ఒప్పుకున్నారు  అని  సంతోషపడక  ఆస్థి  మొత్తం నీ  పేరు మీద రాయమని చెప్పడమే కాకుండా , వాళ్ళని  నా నుంచి శాశ్వతంగా దూరం కామని  కండిషన్  పెట్టావు …నా కోసం అన్నిటికి  ఒప్పుకున్నాక ..
వేరే సంబంధం రాగానే నన్ను  వద్దు అని వెళ్ళిపోయావు ..ఎన్ని సార్లు ఫోన్  చేసిన కూడా నువ్వు రిప్లై ఇవ్వలేదు …నువ్వు  వెళ్ళిపోయినా కూడా నాకు మంచే జరిగింది నీ కన్నా గొప్పగా ప్రేమించే హస్బెండ్ వచ్చారు ..

 ఆకాష్  విరక్తిగా నవ్వుతుంటే  …

ఎందుకు   ఆ   నవ్వు ????????

మీ   నాన్న  చేసిన   మోసం  గుర్తుకు వచ్చి …

ఏమి  మాట్లాడుతున్నవు

   ” మీ  నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారు …మా ఇంటికి వచ్చి ఓ  వీడియో  చూపించారు
అందులో   ” నాన్న ఆకాష్ తో   ప్రేమ వరుకు  పర్లేదు కానీ  పెళ్ళి  చేసుకోకూడదు..అలాంటి  మిడిల్  క్లాస్ ఇంట్లో నేను  ఉండలేను …మీరు వెళ్ళి  క్యాన్సిల్  చేయండి పెళ్లి …”

 అది  చూసిన  ఆకాష్  కంట్లో  నీళ్లు ….
ఈ మాటలు నిజం ….
మన పెళ్లి కి   ఒప్పుకున్నాక   నన్ను  ఇంకోసారి  బాగా ఆలోంచించి నా నిర్ణయం   చెప్పమన్నప్పుడు   జరిగిన మాటలను మారిచి చూపించారు  ఆకాష్ …

 “నాన్న ఆకాష్ తోప్రేమ వరుకు  పర్లేదు కానీ  పెళ్ళి  చేసుకోకూడదు..అలాంటి  మిడిల్  క్లాస్ ఇంట్లో నేను  ఉండలేను …మీరు వెళ్ళి  కాన్సిల్  చేయండి పెళ్లి .. ఈ  మాట  నా  నుండి  ఆశిస్తున్నారు
జీవితాంతం నేను మీ కూతురిగా ఉండిపోతానని.. కానీ పెళ్లి ఎప్పటికీ చేసుకోను..
ఇది నేను చెప్పింది… నవ్వుతూ శభాష్ ప్రేమలో చాలా గట్టిగానే ఉన్నావన్నీ మెచ్చుకున్నారు.. కానీ ఆ నవ్వు  వెనకాల ఇంత కుట్ర దాగి ఉంటుంది అనుకోలేదు… నువ్వు నన్ను వద్దు అన్నావని నీకు వేరే సంబంధం కుదిరింది అని నాకు కట్టుకథ చెప్పారు
” బాధపడకు భూమి… మన ఇద్దరి తప్పు ఉంది …మీ నాన్న  చెప్పగానే  బాధ పడ్డి  ఊరు వదిలిపెట్టి వచ్చేసాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు.. లాస్ట్ కి  ఫోన్ పగల కొట్టేసాను  నిన్ను కలిసి అసలు విషయం  ఏంటో  తెలుసుకొని  ఉంటే బాగ ఉండు  .గతం  మనం  మార్చలేం .ఇప్పుడు నిజం తెలిసిన ప్రయోజనం లేదు మీ నాన్న పై కోపం తెచ్చుకోకు ..ఓ  తండ్రిగా ఆయన  కరెక్ట్ …నీ మంచి కోసమే చేశారు … ఏ తండ్రి అయిన కూతురుకి మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆరాటపడతారు.. నీ విషయంలో జరిగింది అదే భూమి.. నాన్న ప్రేమనే మాత్రమే చూడు మోసం కాదు..
ఏమి  చేస్తున్నావు ????
”  నువ్వు   దూరం అయ్యాక … కోపిష్టి వాడిలా తయారయ్యాను.. నన్ను ఎవరు ఏమన్నా కొట్టేసే వాడివి….
అమ్మకు కోపం వచ్చి ఒకరోజు
“ఆ  కోపం ఏదో దేశానికి  ద్రోహం చేసేవారిపై  చూపించుమని చెప్పింది” …
అందుకే  ఆర్మీ లో  జాయిన్ అయ్యాను ..ప్రెసెంట్ లీవ్ లో  ఉన్న ..ఈ  ఆదివారం  మరదలితో  పెళ్లి ఖాయం అయింది ..నువ్వు,మీ  ఆయనతో తప్పకుండా రావాలి అని కార్డు ఇచ్చాడు …
తప్పకుండ  వస్తాను …

  ఆకాష్  కి   వాళ్ళమ్మ  దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఇంతలో వాన కూడా తగ్గింది …

భూమి కి  బాయ్   చెప్పి   వెళ్ళిపోయాడు ….

 వెళ్తున్న  ఆకాష్  వైపు  చూస్తూ ” మన  పేర్లే  కలవలేదు ఇంకా  మనం ఏమి కలుస్తాము …ఇంట్లో  ఎలా అయితే  వస్తువులు ఉన్నాయో నేను అలాగే మా ఇంటికి మా ఆయనకి . డబ్బు మీద ఉన్న ఇష్టం నా మీద లేదు.. నీ మీద కోపంతో పెళ్లి చేసుకున్నాను
నీకోసం ఎదురు చూస్తూ ఉంటే బాగుండేది ఏమో..
ఇప్పుడు ఎన్ని అనుకుని ఏమి ప్రయోజనం ఓ సారి చేజారిపోయినా తరువాత..
వాన అయితే తగ్గింది కానీ  భూమి కంట్లో నుండి వచ్చే కన్నీటి ప్రవాహం తగ్గలేదు …..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!