ఊహలు గుసగుసలాడే

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

ఊహలు గుసగుసలాడే

రచన: జ్యోతిరాణి

Jyothirani

ఏమని చెప్పను!..
ప్రతిసారి నీ తలపులు
నన్ను చుట్టినప్పుడు
తడబడిన గుండెలయల
శబ్దాన్ని వింటూ నాలోనుండి
నా హృదయాన్ని వేర్లతో
పెకిలిస్తున్నట్లు భారమైన
మదిబాధను నీ ముందు
వర్ణించనా?…

హృదయంలోపలికి చొచ్చుకొనిపోయే
నీ పలుకుల సవ్వడిలేక
మూగబోయిన నా మనసు
నీ మాటలకోసం పరితపిస్తూ
నిన్ను నాలో నిగూఢమైన
ఙ్ఞాపకాల్లో వెతుక్కుంటున్నా
అని చెప్పనా?…

మళ్ళీ మళ్ళీ నీ ప్రేమలో
అసలైన నన్నుని చూసుకోవాలని
నీవుగా నీకై చుట్టుకున్న మాయపొరలు
చీల్చుకొని నాకై వచ్చే నీ ప్రేమను
మళ్ళీ చూడాలని ఎదురుచూస్తూ
ఇప్పటి నిజాన్ని అంగీకరించే కంటే
నీ ప్రేమ జ్ఞాపకాలతో నా మదిలోని
ఊహలు గుసగుసలాడుతున్నాయి
అని చెప్పనా…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!