స్వప్నలోకం

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

స్వప్నలోకం

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

స్వప్న లోకంలో విహరిద్దాం
ఊహల్లో గుసగులాడుకుందాం
మనసులోతుల్లో నిండిన భావాన్ని
మనసు భాషతో పంచుకుందాం

గతాన్ని మదిలో నిలుపుకుని
కదులుతున్న కాలాన్ని మలచుకుని
భవిష్యత్ కోసం తీపి కలలుకంటూ
జీవిత ప్రణాళిక సిధ్ధం చేసుకుందాం

ఉన్నతి కోసం శ్రమ పడదాం
ప్రగతి కోసం సాదన చేద్దాం
ఊహలను వదలి నిజంలో జీవిద్దాం
స్వప్నలోకం ఇహంలో చేరుదాం

విజయం నువ్వు సాధిస్తే
ఆ స్వప్నమే నిజమవుతుంది
నిన్ను నువ్వు నమ్ముకుంటే
ఆనందజీవితం నీ సొంతమవుతుంది

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!