పట్టుదల

పట్టుదల

రచయిత :: జయకుమారి

బొమ్మలు గీస్తూ..అది సరిగా రాలేదు అని పుస్తకం లో పేపర్స్ అన్ని చింపేస్తూ,నాకు  ఏమి రాదు,నేను ఏమి చెయ్యలేను అని ఏడుస్తున్న ,కొడుకుని  గమనిస్తూనే ఉంది జయ.
సరే చివరికి ఏమి చేస్తాడు అని అలా చూస్తూవుంది..
కానీ హరి(కొడుకు) మాత్రం  ప్రయత్నం చెయ్యడం మాని ,నాకు ఏమీ రాదు అంటూ అసహనంతో కోపంగా ఊగిపోతున్నా కొడుకు దగ్గరకు వెళ్లి , ఏమైంది హరి?
ఎందుకు ఏడుస్తున్నావ్!! ఎందుకు పేపర్స్ అన్ని పాడుచేస్తున్నావ్.! అన్ని పేపర్స్ వెస్ట్ అయ్యేయో  చూశావా.! అవి ఉంటే నీకు ఏమైనా రాసుకోడానికి ఉపయోగపడతాయి కదా.!
దేనినైనా పాడుచెయ్యడం సులభమే కానీ దానిని తిరిగి సంపాదించడం కష్టం హరి. సరేనా ఇంకెప్పుడూ ఇలా వేటిని వెస్ట్ చేసినా నేను ఊరుకోను.!సరే చెప్పు ఏమిటి నీ కోపానికి కారణం.
హరి::-అది అమ్మ నేను బొమ్మ గీస్తున్నా .ఎన్ని సార్లు గీసినా సరిగా రావడం లేదు.! అందుకే అలా చేసాను.!
జయ::- సరే ఏడవకు, ఆ చిన్న దానికే ఏడుస్తారా!ఇప్పుడు నీకు ఒక కథ చెబుతా  విను అనగానే అప్పటివరకు ఏడుస్తున్నా హరి మొఖం లో చిరునవ్వు చేరి,అమ్మ కథ చెబుతుంది అంట..
రా … అక్క.విందాం..అని ఇద్దరు వచ్చి  జయ దగ్గర కూర్చున్నారు.
కథ::
పూర్వం రాజుల కాలంలో యుద్దాలు జరిగేవి తెలుసా!  ఒక సారి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది.అందులో చిన్న సైన్యం తో ఒక రాజు.!పెద్ద సైన్యం తో ఒక రాజు రణ రంగంలోకి దిగుతారు.!
ఎవరి శక్తి కొలది వారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.! ఎదుటివారిని చిత్తు చేయాలని ఇద్దరు  ప్రయత్నం చేశారు.!కానీ పాపం! చిన్నసైన్యం ఉన్నా రాజు ఓడిపోయే పరిస్థితి వస్తుంది.!
ఆ రాజు మిక్కిలి అలిసిపోతాడు. వంటినిండా దెబ్బలతో ,తాను నెగ్గడం ఎటూ కుదరని పని అని తెలిసి! తన సైన్యం ను,రాజ్యం ను వదిలి ప్రాణాలు కాపాడుకోడానికి,ఆ రాజు మెల్లగా ప్రక్క దారిన పారిపోయి దగ్గరలో ని ఒక గుహలో దాక్కున్నాటాడు.! దీర్ఘంగా కూర్చుని ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నా అతనికి ఒక సాలిగూడు కనిపించింది.
ఆ గూడు ను అల్లే సాలి పురుగు తన గూటిని అల్లుకునే క్రమంలో సరైన ఆధారం లేక క్రింద  పడిపోతూ ఉంటుంది పాపం, కానీ సాలిపురుగు క్రిందనుండి పైనున్న తన గూటికి చేరుకోవాలనే ప్రయత్నం మానకుండ చేస్తోంది. కానీ అది క్రిందకు పడిపోతునే ఉంది.ఒకసారి కాదు అనేకసార్లు అది క్రిందపడిపోతునే ఉంది అయినా అది తన ప్రయత్నం మానక  చివరికి తన గూటి ని చేరుకొని అల్లడం చూసి రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. దాని పట్టుదల చూసిన రాజు కు జ్ఞానం,కర్తవ్యం బోధపడింది.ఈ చిన్ని సాలిపురుగు కే ఇంత  పట్టుదల ఉంటే,మరి నేను ఏంటి ఇలా పిరికి వాడిల పారిపోయి వచ్చాను అని అనుకోని ,తను చేసిన పనికి సిగ్గు పడి, ధైర్యం గా శత్రువులు ను ఎదుర్కోవాలి,ఎన్ని కష్టాలు ఎదురైన మనం చెయ్యాలి అనుకున్న పని పూర్తిచేయాలి అనుకోని.!
తిరిగి యుద్ధంలో అడుగు పెట్టి. తన సైనికులకు,యుద్ధవిధ్య లో ని మెళుకువ లు నేర్పుతూ, మరింత ప్రత్యేక శిక్షణ ఇస్తూ,యుద్ధం లో ఎత్తుకు పై ఎత్తులు  వేస్తూ,తెలివిగా శత్రువు ని ఎలా జయించాలి అనే విషయాలు తన సైనికులకు నేర్పి ,పట్టుదలతో యుద్ధంలో జయించాడు.పెద్ద సైన్యం ఉన్న రాజు పై , చిన్న సైన్యం ఉన్న రాజు గెలిచాడు.!దీనిని బట్టి చూస్తే ఏ పనిని అయినా చెయ్యడానికి ముఖ్యంగా పట్టుదల,ఓర్పు,సహనం ,బలం,బలగంతో పాటు,ఎత్తు కు పైఎత్తులు వేయడం,నేర్పరితనం కూడా కావాలి. అంతే కానీ ఒకటి,రెండు సార్లు ప్రయత్నం చేసి వదిలేయకూడదు. సరేనా!
ఆ పని పూర్తి అయ్యే వరకు ఎన్ని సార్లు ఓడిపోయిన ,విజయం సాధించే వరకు వెనుకడుగు వేయకూడదు.! అని జయ  చెప్పిన  కధ విన్న, హరి మళ్ళీ బొమ్మ గీయడం మొదలు పెట్టి , చివరికి బొమ్మ గీసి  అమ్మ కి చూపించాడు.
నీతి:-ఏ పని అయినా పట్టుదలతో చేస్తే విజయం మన సొంతం.

You May Also Like

One thought on “పట్టుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!