వసుంధర

వసుంధర

రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి

వసుంధర పేరుకు తగ్గట్టే సహనము కలది అక్క లిద్దరూ పెళ్లి అయ్యాక అన్నగారు పెళ్లి చేసుకున్నాడు. పెద్ద అన్నగారు ఏనాడో విదేశాలకు వెళ్లి అక్కడ సెట్లే అయ్యాడు. తమ్ముడిని రమ్మంటే అందరూ వెళ్ళిపోతే కుటుంబ సభ్యులకు ఏ విధంగా ఉంటుంది.. ఇక్కడ పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అది వదలి రావడ మెందుకు.. అక్కల పెళ్లి చెయ్యాలి అమ్మ నాన్నల్ని చూడాలి అని మంచి భావంతో చూసి విదేశాలకు వెళ్ళాడు 

మేనమామ కూతుర్ని చేసుకోమని చెప్పాడు అక్కల పెళ్లి తర్వాత అని తప్పించుకునేవాడు ఒక్క మాట ఊ.అనుకుంటే తృప్తి అనేవాడు. కానీ రామం మాత్రం ఒప్పుకోలేదు అక్కల పెళ్లిళ్లు ఘనంగా చేశారు అన్ని ఉన్న వాళ్ళు తండ్రికి సహాయంగా ఉండి పెళ్లిళ్లు కానిచ్చాడు రామం.పెళ్లి చేసుకో ఆంటు మామయ్య పట్టు పట్టాడు.దాంతో సరే అని అందరూ వప్పుకుని పెళ్ళిచేసారు 

ఆ తర్వాత అక్కల పురుల్లు బాల సారెలు ఇలా ఏదో ఒక బిజీ తో వసుంధర పెళ్లి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.చిన్నాడ మన వసుకి సంబంధం చూడరా పిల్ల బాధ పడుతుంది.నేను బాధ పడతానని పెళ్లి.చేస్తారా అని అనుకునేదిఅన్నకి వదిన కు తను అడ్డు కాకూడదు అనుకుందిఅయినా ఆడపిల్లకి సమానహక్కు ఆస్తిలో ఉంది.తండ్రి తమకు ఆస్తులు ఇచ్చారు.అక్కల భాధ్యత తీరింది తను తల్లిని తండ్రిని చూడాలనుకున్న ఆడపిల్లకి బాధ్యత పెట్టరు. సంబంధాలు చూశారు మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయిలు ఈ రోజుల్లో దొరకడం కష్టం అయ్యింది .రాము మాత్రం ఓపికగా ఓ బ్యాంక్ సంబంధం కుదిర్చి వసుంధర పెళ్లి చేశాడు.

పెద్ద వయసులో ఉన్న అత్తగారు ఆడపడుచు కెనడా లో ఉంది కట్నాలు కానుకలు అదరహో అనిపించిన రీతిలో పెట్టీ పంపారు .అంత పెత్తనం వసుంధరదే ఆడింది ఆట పాడింది పాట అత్తగారు గుప్పెడు మెతుకులు తిని కూతురుతో ఫోన్ మాట్లాడుకుంటుంది మామగారు పెద్ద కొడుకుతో పాటు దుబాయ్ లో ఉన్నాడు

అత్తగారు ఎప్పుడు పట్టు చీరలు కట్టేది వసుని కట్టుకోమనేది వసు కి ఖరీదైన ఇల్లు ఖరీదైన వస్తువులు. జీవితం సజావుగా సాగింది ముగ్గురు మగపిల్లలకు తల్లి అయింది.బ్యాంక్ మేనేజర్ గా భర్త హోదా పెరిగింది కాలగమనంలో పెద్దల ఆశీస్సులతో పిల్లలు ముగ్గురు మూడు దేశాలు వెళ్ళి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు.

పెళ్లిళ్లు చెయ్యాలి మంచి సంబంధాలు చూడటం మొదలు పెట్టింది .ఏ ఒక్కరూ కట్న కానుకలు సరికదా పిల్లలే అసలు నచ్చడం లేదు. మగపిల్లాడు పెళ్ళీంత కష్టమా ఆడపిల్ల ఐతే నాలుగు ఇళ్లు తిరిగి అడిగి చెయ్యవచ్చును. వసుంధర భర్త మూడు అంతస్తులు కట్టా డు ముగ్గురు పిల్లలకు కానీ ఎవరు వచ్చి ఇక్కడ ఉండరు. కోడలు వస్తుందన్న ఆశతో 24 వేలు పోసి కర్టెన్లు కుట్టించింది.ఇల్లంతా అందంగా అలంకరించుకోవడం వల్ల మరింత అందంగా ఉంది.పై వాటాలన్ని అద్దెకు ఇచ్చారు. మ్యారేజ్ బ్యూరో లకి వెళ్ళడం డబ్బు కట్టడం అక్కడే భోజనం చెయ్యడం ఒక్క పిల్ల నచ్చక వెనక్కి తాంబూలం నములుతూ రావడం ఇది వరస ఇలా 5,6.ఏళ్ల నుంచి జరుగుతొంది విసుగు విరామం లేకుండా పిల్లల్ని చూసి వస్తుంది .తనకే కూతురుంటే ఏమి చేసేదో కదా కొంత మంది విమర్శ ఎప్పటికీ కుదిరేనో..ఇలా పరి పరి విధాల మనసు పోతోంది.  వసుంధర కి జ్యోతిషశాస్త్రం అంటే చాలా ఇష్టం కొన్నాళ్ళు నేర్చుకుంది కూడాను.అయితే పిల్లల జాతకంలో అంశాలు. తెలుసుకోలేక పోయింది ..చదువు విదేశాల వరకు బాగుంది పెళ్లి విషయం తేల్చుకోలేక పోయింది.అప్పటికి ఎందరో ప్రముఖులు.జ్యోతిష్యము అడుగుతూ వచ్చింది తల్లికున్న ఆరాటం తండ్రికి ఉండదు. ముగ్గురు కొడుకులు అందంగాఉంటారు అందమైనకోడలు కోసం ఎన్నో ప్రయత్నము చేస్తోంది.పూజలు వ్రతాలు చేస్తోంది . ఏ మంచి సంబంధంరావడం లేదు.ఈలోగా పైన అద్దెకున్న కుటుంబంలో ఒక అబ్బాయికి పెళ్లి కుదిరింధి

ఈ ప్రపంచంలో ఆడపిల్ల తల్లి అత్త వారికి పనికి రాదు ఆమె సొమ్ము పనికి వచ్చింది.అందరూ సొమ్ము కోసం ఆశిస్తారు .డబ్బు ఎవరికి చేదు? చాలామంది బంధువులు ఆస్తి ఆశిసించారు తల్లిని చూస్తామని చెప్పారు కానీ కౌస్తుభకి నమ్మకం కుదర లేదు.అందుకే పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది. పిల్లాడు ఎదో ప్రైవేట్ కంపెనీ లో పని చేస్తాడు అంతంత మాత్రం అందము, వయస్సు తన పిల్లాడు కన్న ఎక్కువ అలాంటి వాడికి పెళ్లి కుదిరిందని చెపితే ఆశ్చర్యపోయింది. సొంత ఇల్లు కూడా లేదు కుటుంబ బాధ్యతలు ఎక్కువ.పెద్ద కొడుకు పెళ్లికాని ఓ అక్క అందరిని చూడాలి. పల్లెలో ఉన్న తల్లి తండ్రి.అప్పుడప్పుడు వచ్చిపోయే బంధువులు పెద్ద సంసారం. అయినా పిల్ల వాళ్ళకి అన్నగారు కెనడా లో ఉన్నాడు .తల్లి బాధ్యత పిల్లపై ఉంది.అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదు వచ్చే అల్లుడు అత్తగారిని చూడమని అంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు అందుకే ఆలస్యమైంది.పిల్ల అందంగా ఉంటుంది.

మా అబ్బాయికి నచ్చింది తల్లి.టీచర్ చేసి రిటైర్ అయింది .డబ్బుకు లోటు లేదు అయితే తల్లి నీ చూసే వాళ్ళు లేరు అది గాక.ఆమె అంత ఆరోగ్యమంతురాలు కాదు దాని గురించి భయము పొని అమే ను వృద్ధ ఆశ్రమంలో పెట్టు అంటూ బంధువులు సలహాలు తెలుసున్న మనిషి ఇంట్లో డబ్బు ఇచ్చి పెట్టు అంటూ ఇంకొకళ్ళు సలహా.ఈ ప్రపంచంలో సలహా ఉచితముగా దొరుకుతుంది . ఇంకో దూరపు బంధువులువంట మనిషిని పెట్టీ మాకుమీ అమ్మకు కావల్సిన గ్రాసం ప్రతి నెల కొని కొంత సొమ్ము ఖర్చులకు ఇయ్యి అని అడిగారు. మనిషి పెళ్లి అవడమే కష్టంగా.ఉన్న ఈ రోజుల్లోఎన్నో రకాలుగా అవసరాలు అనుగుణంగా ఉండే వ్యక్తి దొరకడం కష్టము.. అయినా వివాహగడియ వస్తె అదే జరుగు తుంది.

మీ ఇంటికి వచ్చిన వేళ మా అబ్బాయికి పెళ్లి కుదిరింధి అంటూ వచ్చి పెళ్లి కి పిలిచారుఎప్పుడు పసుపు కొట్టారు అంటూ ఆశ్చర్యంగా అడిగింది. దానికి నవ్వుతూ వాడికి ముఖమాటం ఎక్కువ అందుకని మేమే అక్షింతలువేశాము అని నవ్వింది . ఏమిటి నీకు చనువు ఇవ్వడం వల్ల నీకు భయం లేదు బాగా లోకువ కట్టి  ఉన్నావు అంది.అడపడుచు తన ప్రతాపాన్ని చూపించింది. అంతే కాదు తల్లిని కూడా సాధించమని చెప్పింది..ఇంకా తమ్ముడినితన చేతిలో పెట్టుకుంది.మరదలి మాట వింటే తమకి తిండి ఉండదు అందుకని ఇంటి పెత్తనం వంట పెత్తనం ఇవ్వకూడదు . అరకేజి కూరతో పోయ్యేది కేజీ కూర వండే ఇంటి ఆమెకు కొంత పనిమనిషిని కొంత పెట్టడం అలవాటు ఒక్క రెక్క సంపాదన. అందరూ కూర్చుని తినే వారే వండిన వంటకి వంక పెట్టడమే ధ్యేయం.కోడలువల్ల తమకు అనుకూలంగా ఉండదేమో అనవసరం గా వీడిని పెళ్లి చేసుకోనిచ్చా ము అని బాధ పడ్డారు ఒక ప్రక్కపిల్లాడికి పెళ్లి కాక వసుంధర ఏడుస్తోంది . అక్కసు పైకి కనిపించనియక పైకి గొప్ప కబుర్లు చెపుతోంది.

కోడలు వంట బాగుంది.నా కెప్పుడు కోడలు వస్తుందో అనుకుంటు ఉండేది.అవును కోడలు తల్లి వస్తుందన్నారు . అంది.ఆవిడ ప్రయాణం చెయ్యి లేదు కోడలు వెళ్ళి తల్లిని తెచ్చుకోవాలి మా వాడికి వేళ్ళడానికి కాళీ లేని ఉద్యోగం. అదే వెళ్ళి తల్లి నీ తెచ్చుకుంటుంది అన్నది ఇంకో మనిషి వస్తారని చెప్పగానే అద్దె పెంచ్చాలని మొహమాటం లేకుండా చెప్పింది. రోజు కూర పట్టుకెళ్లేటప్పడు ఏ మొహమాటం ఉండదు.కోడలు వచ్చి కూర ఇవ్వనివ్వదేమి అనుకున్న వసుంధర కి సౌండ్ లేదు ఎలాగైన గొడవ పెట్టాలి .ఎలాగైనా కౌస్తుభ నీ పంపాలన్నది. వసుంధర తెగ బాధ పడింది.

ఈలోగా తల్లికి వంట్లో బాగాలేదని ఫోన్ వచ్చి కౌస్తుభం పుట్టింటికి వెళ్లింది. తల్లికి కొంచెం ఆరోగ్యం కుదుట పడ్డాక కారు చేసి తల్లిని తీసుకుని బయలు దేరింది.ఈ లోగ తమ్ముడి మనసు విరిగేలా మాటలు చెప్పి అక్క చేతిలో పెట్టు కుంది .వచ్చిన నాడు ఎవరికి ఇష్టత లేదు ఎదో మాట్లాడాలి కనుక ఎందుకు వచ్చారు లేవ లేకుండా. మీ పిల్ల తెలివైనది మాటకు దొరకదు అంటూ బాణాలు వేసింది.  కౌస్తుభ తల్లి బాధ పడింది.ఇన్నాళ్లు ఆగి ఇలా పెళ్లి జరిగింది అందరినీ ఒప్పించి.తనను చూస్తామని చెప్పి చేసుకుని ఇప్పుడు ఇలా ఎదురు మాట్లాడుతున్నారు .పెళ్లి చాలా చక్కగా తక్కువ మంది బంధువులు అటు ఇటు కలిపి ఓ పాతిక మంది తో పెళ్లి జరిపించారు అన్నవరంలో సింపుల్ గా చేసి వ్రతం చేసి వచ్చారు పుట్టినిల్లుకి వెళ్లి అక్కడ తెలుసున్న పది మంది బంధువుల్ని పిలిపించి భోజనాలు పెట్టారు పదహారు రోజుల పండుగ నాటికి ఆడపడుచు భర్త వచ్చి కౌస్తుభ ను తీసుకెళ్లారు ఆ వూళ్ళో తెలుసున్న వారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేశారు.అందరూ అవాక్కయ్యారు .పిల్ల ఇంత అందముగా ఉంది.బంగారు పువ్వులు పూజ చేశారు వీళ్లంతా అనుకున్నారు.

మాకు పెద్ద సారే వద్దు సింపుల్ గా పంపండి పంచి పెట్టడం.కష్టము అని అన్నారు.5రకాలు ఒక్కో కేజీ చొప్పున పంపింది అందరికీ బట్టలు తెచ్చింది  పని వాళ్ళకి.వంట ఆమెకు చాకలికి . పండుగ పనులు చేసే వారికి బట్టలు పెట్టాలని చెప్పారు ఆ ప్రకారం చీరలు అత్తగారికి ఆప్ప చెప్పింది .. అందరూ. ఆ ఇంటికి వచ్చి బుగ్గలు నొక్కు కొన్నారు సారే ఘనంగా పెట్టరు అన్నారు పెళ్లికి ముందు తల్లిని చూస్తామన్నారు. కానీ పెళ్లి .అయ్యి.నెల దాటినా ఆ విషయం ఎత్తలేదు  కౌస్తుభ ఆశ్చర్య పోయింది  చేసే ప్రతి పనికి వంకలు పెడతారు.తనకి వంట బాగా వచ్చు అయిన సరే అబ్బే ఇది బాగా లేదు అది బాగాలేదు అంటూ.వంకలు పెడతారు.ఇంకా అత్త గారు అయితే నా కాలంలో అవలీలగా కుంచెడు పప్పు రుబ్బి. గారేలు వడేదాన్ని అంటూ చెప్పేది .ఇంటి నిండా బంధువులు సందడి ఉండేది దీనిని బట్టి చూస్తే ఆ ఇల్లు ఒక సత్రవు.పిల్లల చేత పని చేయించి ఊరు వాళ్ళకి వండి పెట్టినట్టు అయింది ఒక్క  ఐయిన వాళ్ళు వచ్చి చూడలేదు పిల్ల నీ వ్వ లేదు పిల్లలను చేసుకో లేదు.అందుకే. ఇంత కాలం పెళ్లి కాలేదు అని అంటారు

 నిజానికి ఈ రోజుల్లో భాద్యత ఉన్న కుటుంబాల్లో పిల్లలను చెయ్యడం లేదు ఇక్కడ ఒక్క విషయం మనుషులు ఉన్నందుకు కాదు తిన్నందుకు కాదు ప్రతి విషయము పట్టింపులు పెట్టుకుని వంకలు పెట్టీ విసిగిస్తరు ఒక విధంగా కోడలికి పెత్తనం ఉండకూడదు అంతేకాదు అమే చేసిన ప్రతి పనికి వంకలు పెట్టాలి అప్పుడే అత్తింటి సంతృప్తి ఉంటుంది.కొడలిధి బాగుంది అనకూడదు.కోడలు ఎప్పుడు గుమ్మందగ్గర అత్తగారు ఏమి ఆజ్ఞ వేస్తుందా అని చూడాలి. ఈ పద్దతి ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో ఉంది కూడా.

వసుంధర పై ఇంటి పెళ్లి వల్ల.చాలా అశాంతికి గురి ఐయ్యింది ఇదే విషయం చాలాసార్లు భర్త తో అంటే ఎవరి అదృష్టం వారిది. ఇంక ఆపు నీ గొడవ..ఎవరికి ఎవరు.రాసి పెడితే వాళ్ళు.అవుతారు అనే వాడు .కొత్త పెళ్లి కూతురిలా గాక ఆ ఇంట్లో పనులందుకుని చేసేది.ఆడ పిల్ల పెళ్లి కాకుండా ఉండ కూడదు అని చెప్పిన వీళ్ళు 40 ఏళ్ళు వచ్చినా ఆడపిల్లకి పెళ్లి చెయ్యకుండా కోడలికి ఆంక్షలు పెడుతూ బాధిస్తూ ఉండటం సమంజసమా..అని ఎవ్వరూ చెప్పారు. ఇందుకే పెళ్లికాని పిల్లలు ఉంటే పెళ్లి చెయ్యరు. ఈ రోజుల్లో ఆడబడుచులు ఉంటే పిల్ల నివ్వడం లేదు 

ఒకరింట్లో నలుగురు ఆడపిల్లలకి పెళ్లి చెయ్యలేదు చదువు తక్కువ ఆస్తి తక్కువ అని పెళ్ళి చెయ్యలేదు పిల్లాడికి ఎవరు సంబంధం చెప్పటంలేదు.ఎవరైనా చేపు దా మని వచ్చిన ఆపరి స్థితికి భయపడి పిల్ల నీ చ్చేవారు కాదు కౌస్తుభ పెద్ద మనసు తో ఆడ పిల్ల ఉన్నా ధైర్యంగా చేసుకుంది.కేవలం తల్లిని చూడ వచ్చని ఆనందంతో వప్పుకుంది కానీ ఇక్కడ పరిస్తితి వేరుగా ఉంది.

ఇంటామే పెత్తనం అత్తగారు మంచిదే కాని ఆడబడుచు వసుంధర తో కుమ్ముక్కు అయి భాధలు పెట్టిన పర్వాలేదు కానీ అసలు తనను ఆ ఇంటిలో ఉండ నిచ్చెల లేరు .

ఒక రోజు ఆదివారము.అందరూ భోజనాలయ్యాక పకోడీ వెయ్యి మన్న రు.పిండి కలిపి ఉల్లి మిర్చి తరిగి కలిపింది తల్లి కూడా కూతురికి సహాయం వచ్చి వంటింట్లో నిలుచుంది .కొంచెం మెత్త వేపు తియ్యి  అని చెప్పింది. ఇలోగా ఇంటమే వచ్చింది ఏమిటి టిఫిన్ అంటూ., ఆ మా వియ్యపురాలు వచ్చింది కదా ఆదివారం మని పకోడీ వేయిస్తున్నాను  ఆహా చాలా ఇష్టం నాకు అంటూ వంట ఇంటిలోకి వెళ్లి పళ్ళెంలోంచి గుప్పిడ తో పకోడీలు తీసుకుని హాల్లొకి వెళ్ళి సోఫాలో కూర్చుంది.

అయినా వియ్యపురాలు దగ్గర ఉంటే మీ కోడల్ని పని చెయ్యి నివ్వధు అంటూ ఓ సర్టిఫికేట్ ఇచ్చింది అసలే ఇష్టం లేని పెళ్లి కొడుకు చేసుకున్నాడు .తమ రోజు గడిపే దేల అనే బెంగ కి తోడు వసుంధర మాట ఇంకా బాధ కల్గించింది.

ఆ రోజు సాయంకాలం ఇదే మాట అంది అంతే కాదు మీ ఊళ్ళో మీకు మందులు తెచ్చేవాడు,కూరలు తెచ్చే వాడినో చూసి పెళ్లి చెయ్యక నా కొడుకు కావాల్సి వచ్చాడు  అంది దానికి కౌస్తుభ నొచ్చుకుని అసలు పెళ్లి చేసుకో వడం మీకు ఇష్టం లేదు అందుకని అలా వంక పెడుతున్నారు. మీ అంత మంచి సంబంధం.ఎవరు వదులుకుంటారు ఇంత మంచి అత్తగారు ఆడపడుచు అన్నది. వసుంధర పెద్ద కొడుకు ఆలోచించాడు .కుటుంబం అంతా తల్లి పోషణ తోనే జరిగింది తండ్రి బ్యాంక్ పనులు క్యాంపులంటు వెళ్ళి పోయేవాడు . మామ్మ తాతగారు పెంపకంలో బాల్యం గడిచింది సింగపూర్ ఉద్యోగం వదిలి తల్లి దగ్గరికి వచ్చేసరికి.కొంత సంబంధాలు పెరిగిన.అత్త గారి దగ్గర పిల్ల ఉండాలని కొందరు వెనుకడుగువేశారు. .ఈలోగా పై ఇంటి పెళ్లి వసుంధరకు బాధ గా ఉంది.

కౌస్తుభ నీ ఎలాగో అల మానసికంగా హింసించి చూడాలి తనకి కోడలు రాకుండా వీరికి వచ్చింది.ఆ బాధని ఎలాగో అలా వేళ్ళ గొట్టాలన్ ఆవిడ ఆకాంక్ష..కౌస్తుభ.వదిన గారితో నీకుపెళ్లి కాకుండా నీ తమ్ముడుపిల్లని కంటే నీ చేత బట్టలు ఉతికిస్తారు  ము తమ్ముడికి చెప్పి ఆ భార్యను దూరంగా ఉంచమని చెప్పిందిఅలాగే రాత్రి టైంలో అడ అడుచు ఏడుస్తూ ఉండేదిఅత్తగారు పిల్లని సమర్ధించేది. కౌస్తుభ కి ఒకగది విడిగా ఇట్చ రు మీ అమ్మని నువ్వు చూసుకో మాకు సంబంధం లేదు అన్నట్లుగా అలగే కొంత కాలం భరించింది..డాక్టర్స్ కి డబ్బు కౌస్తుభ చేతఇప్పించిఇంటిల్లిపాది చూపించు కునే వారు ఒకరోజు డా క్టిర్.చేత మీఅమ్మకు కావల్సిన దానికంటే ఎక్కువగానే మేము చూస్తున్నాము ఆవిడకు ఈ వాతావరణం పడదు కనుక నువ్వు మీ ఊరు తీసుకెళ్ళి పెట్టుకుని ఉండు మీ కు అక్కడమందులు కూరలు తెచ్చి చూసే లా మనిషిని పెట్టుకో అని చెప్పి జ్వరంతో వుండగానే బస్సు ఎక్కించారు .

ఆ తర్వాత కాలం గడుస్తోంది వసుంధర మూడో కొడుకు .నైజీరియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఆవిషయం తెలిసి లబో దిబో మన్నది

అంతా. కలిసి ఆమెను ఓదార్చారు..ఎలాగో సర్దుకునే లోగా రెండో వాడు.దుబాయ్ లో అక్కడి పిల్లని చేసుకున్నాడు ఇంక  సింగపూర్ లో  పెద్ద కొడుకు పెళ్లి కాని వారిలో మిగిలాడు వాడు చిన్నప్పటి నుంచి.తాతగారు పెంపకంలో ఉన్నా డు సంధ్య వందనము పూజలు అన్ని సరదాగా.శ్రద్ధ గా చేసే వాడు

చిన్న తనం లో.వడుగు చేశారు అందుకని అతని పెంపకము తేడా గా ఉంది ఫోన్ లో తల్లి బాధ పడటం చూసి నేను అక్కడ ఎవరిని చేసుకోను.ఇండియా వచ్చి నీదగ్గరే నీకు నచ్చిన దాన్ని చేసు కుంటానని ప్రామిస్ చేశాడు .నాయనా నన్ను వదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నా జీవితం నీ దగ్గర వెళ్లి పోవాలి అని బాధ పడింది. వసుంధర మాటలు.అత్తగారు బాగా నచ్చినట్టు ఉన్నాయి.అదే పదే పదే అంటూ ఉంటుంది .ఈలోగా పెద్ద అడబడుచూ పిల్లలు భర్తతో కలిసి వచ్చింది ఊరిలో ఉంటుంది కారు మేడ పొలం ఉన్నాయి పిల్లల చదువు కోసం తమ్ముడికి దగ్గరగా ఉండాలని అనుకుంది కానీ భర్త ఒప్పుకోలేదు వాడికి ఇంట్లో ఉన్న అక్క అమ్మ నాన్న చాలదా మళ్లీ మనం ఎందుకు? అని దూరంగా ఉంచారు. వీడు పెళ్ళాన్ని అసలు చూస్తాడా.వీళ్ళు చూడనిస్తరా గొప్ప కబుర్లు చెప్పి పెళ్లి చేసుకున్నారు అనుకుంటాడు ఏదొ చట్టం చూపుగా వచ్చి వెళ్లాలి కాని అక్కడ ఉండకూడదు .ఇప్పటికే అది సత్రం.

 బావగారు మంచిగా ఆలోచించి బావ మరిది కస్టం తినడం ఇష్టం లేదు అన్నాడు.అదేమిటి అల్లుడు మా అమ్మాయి తమ్ముడింట్లో పట్టెడు మెతుకు తినాలి అంతే గాని వద్దు అనకు అంటూ ఎప్పుడో పెళ్లిరోజు కని కొన్న చీర నాదగ్గర ఉండిపోయింది బీరువా లోంచి తీసి ఇచ్చింది. దాని గొడవ ఇప్పుడు ఎందుకు?.పెళ్లి కాని పిల్లకు ఇవ్వవచ్చు అనుకుంది. 

తల్లి అక్క అంటే భయపడే  కౌస్తుభ భర్త వాళ్ళు ఎలా చెపితే అల ప్రవర్తించేవాడు కౌస్తుభ ఆలోచించింది ఇక్కడ తనకు జీవితం లేదు.వాళ్ళు తన భర్తను గుప్పిట్లో పెట్టుకొన్నారు కారణం డబ్బు తిండి.వాళ్ళు తనను సుఖపడనివ్వరు అక్కడ తల్లి బాధ పడుతుంది ఇది ఎలా తెల్తుంది.కౌస్తుభ  ఆలోచించి తను గతంలో నిర్వహించే.సంస్థ ఉంది అది వేరే ఫ్రెండ్ కి అప్పగించి వచ్చింది  తన భర్త ను తనతో మాట్లాడాలని తహతహలాడే సమయం లో వదిన గారు వచ్చి నిలబడి కోపంగా చూసేది. అందుకే ముందు అత్తగారిని తను బ్రతిమాలుకుంది తన తల్లికి బాగాలేదు కనుక నేను వెళ్లి అక్కడ ఉంటాను మీ అబ్బాయి మిమ్మలిని చూస్తాడు అన్నది. దానికి ఆవిడ ముఖంలో సంతోషం కనిపించింది కోడలు తెలివైనది

ఎవరి మనస్సు నొప్పించదు.అలాగే వాడికి నేను చెపుతాను .పెద్దావిడ కదా నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు అన్నది.అందరూ కౌస్తుభ వెళ్ళే పోవడమే మంచి దనుకున్నారు.మంచి ముహూర్తం లో ఆమెను భర్త బస్సు ఎక్కించాడు మనస్సులో బాధ ఉన్నా అక్క సంగతి తెలుసు అమ్మ ఒప్పుకున్న అది గోడవ చేస్తోంది అటు భార్య మనస్సు నొప్పించకుండా శాంతియుతంగా ఉండాలి అని ఏవో కబుర్లు చెప్పి ఎక్కించాడు ఎంతయినా తాళి కట్టిన భార్య ఎక్కడో బాధ హృదయంలో కలుక్కుమంది. అయితే..అత్తగారికి కోడలు అడుగుతుందని భయం అన్ని తన పిల్లలే వాడు కోవాలి ఎక్కడి నుంచి వచ్చిందో భర్త కోసమే కదా ఆ భర్తను అమే దారి కాకుండా స్వప్రయోజనం కోసం కోడలిని విమర్శిస్తూ భర్తను దగ్గరకు రానివ్వకుండా జీవితం గడిపారు పిల్లాడికి పెళ్లి చేయాలని తపన పడటం కాదు పిల్ల వచ్చాక కసురులువిసుర్లు లేకుండా పిల్లని ఇంట్లో కలుపుకోవాలి. అంతే గాని అక్క మెప్పు చెల్లి మెప్పు బావ మెప్పు అని అనుకో కూడదు కట్టు కున్న వా డు సరిగ్గా చూస్తే ఈ భార్యలు ఎక్కడికి  వెడతారు .భర్త ప్రవర్తన బట్టే భార్య ఉంటుంది, అమ్మాయి జీవితం బాగుండాలని ప్రతి తల్లి తండ్రి ఆరాటపడతారు వారి పరిధి మేరకు మంచి సంబంధాలు తెస్తారు రాతను బట్టి పెళ్లిళ్లు ఉంటాయి.అవి స్వర్గంలో నిర్ణయిస్తారు..అంటారు నిజం మనకు తెలియకుండానే అన్నీ జరుగుతాయి ..

డబ్బు దర్పం ఇవన్నీ ఆడ పెళ్లి వారి దగ్గర చూపుతారు.మా ఆడపిల్ల అంత గొప్ప ఇంత గొప్ప అంటారు.తీరా పెళ్లి అయ్యాక మా పిల్లల ముందు మీ పిల్లలు ఎంత అని విమర్శిస్థారు. ఈ తరహ మనుష్యులు తన గురించి తెలుసు కోరు.ఎదుటివాళ్లపై నింద వేస్తారు.మగ పెళ్ళివారమనే ఘనత వారిలో పోదు అంతా అంతే ఆడపిల్ల జీవితము. ఐఏఎస్ అయిన ఐపిఎస్. ఐఎఫ్.ఎస్ అయిన.తప్పదు ఆఫీస్ నుంచి వచ్చి కాఫీ తనే కలిపి ఇంటిల్లి పాదికి ఇవ్వాలి.అమే వచ్చే వరకు వేచి ఉంటారు. పనిమనిషి సహాయంతో వంట వార్పు చెయ్యాలి.ఇంట్లో వంటమనిషి ఉంది అయిన ఏది నచ్చదు పోపులు భార్య వెయ్యాలి ఇది సమాజంలో జరుగుతున్న నిజాలు. కౌస్తుభ.పరి పరి విధాల ఆలోచించి వీరికి తన వల్ల కోపం విసుగు వస్తోంది కనుక తల్లిని చూసు కోవడానికి వెడతానని చెప్పింది అందరూ ఆనందంగా పంపారు. బస్సు ఎక్కిన తర్వాత కూడా ఆలోచనలు మారలేదు .ఎంతో కోరుకుని పెళ్లి చేసుకున్న మనిషి ఇలా మరి పోవడం వింతగానే ఉంది ఇది విధిరాత అనుకోవాలా అసమర్ధత అనుకోవాలా..

బస్సు వేగంగా అందుకుని పట్టణ పొలిమేర దాటింది.తెచ్చుకున్న టిఫిన్ తిన్నది.మాజా తాగింది కడుపులో చల్లబడింది కానీ మనసు పరిపరి విదాల అలోచనలు.తన వదిన గారు పెళ్లి అయితే గాని అత్తగారు మనసు చల్లబడదు. అప్పుడే తన జీవితం చక్కగా బాగుంటుంది తన భర్త మంచి వాడు.అయితే వసుంధర లాజిక్ తో అందరూ మాయ మాటలు నమ్మి తనని దూరం చేశారు.బంగారం లాంటి జీవితం అందమైన భార్య వచ్చింది.తన కొడుకులకు రాలేదు సరి కదా కులాంతర,దేశాంతరం పెళ్లిళ్లు చేసుకున్నారు అందుకే ఆమెకు ఈర్ష్య.. అన్ని రకాల అందరినీ వేధిస్తూ ఉండేవారికి కాళీ గా ఉండటం ఇష్టం ఉండదు ప్రమోటర్ ఆఫ్ క్వారెల్స్ కథలు అందరికీ తెలిసినవే కాని ప్రతి జీవితంలో అవి తప్పడం లేదు.

 కౌస్తుభ ఊరు చేరి బస్ దిగి ఇంటికి వెళ్ళింది తల్లి అల్లుడు కోసం వెతికింది. ఎప్పుడు నిరాశే అతనిని తల్లి అక్క రానివ్వరు వాళ్ళ మాట వేదము మార్పు కోసం ఎదురు చూస్తోంది.. తను నిర్వహించే సంస్థ అభివృధి చేస్తూ తల్లిని చూసుకుంటోంది . కాలం సమాధానం చెపుతుంది  ఆ దృఢ నిశ్చయంతో కౌస్తుభ ఉంది. కాల గమనంలో వదిన గారు పెళ్లి చేసుకొన్నారు కారు హోదా.అన్ని ఉన్న బ్యాంక్ ఆఫీసర్ వచ్చి తన వృద్ధ తల్లిని చూసే అవకాశం ఉన్న అమ్మాయి చెపితే నమ్మి చేసుకున్నాడు పెళ్లికి, భర్త వచ్చి కౌస్తుభను పెళ్లికి తీసుకెళ్ళాడు.కౌస్తుభ ఎంతో సంతోష పడింది. పెళ్లి సింపుల్గా చేశారు  తల్లిని చూసే వ్యక్తి కావాలని చేసుకున్నారు నా అక్క చాల మంచిది .అందుకే దానికి మంచి పెళ్లి చేశారు అని అంతా ఆనందించారు  . కౌస్తుభ , తల్లిని తండ్రిని పల్లెకు పంపాడు కౌస్తుభ కోసం అమే వెంట వెళ్ళాడు కారణం ఆమెకు ఎవరు బంధువులు లేరు తల్లి తను తప్ప, వృద్ధులను భాధించకూడదు.అన్ని తెలుసుకుని వారికి నచ్చచెప్పి పెళ్లి చేసుకున్నాడు .గతము మనిషికి గుర్తుకు వచ్చింది. తొందరలో జాబ్ మారుతాను  మా కంపెనీ ఇక్కడ బ్రాంచ్ పెడుతున్నారు దానికి మేనేజర్ గా వేస్తామన్నారు అని చెప్పిన విషయం కౌస్తుభ కి తల్లికి ఆనందం కలిగింది.కాలం మార్పు మనిషిలో మానవత్వం కలిపింది. అందుకే కౌస్తుభ భర్త తనలో మార్పు తెచ్చుకుని. కౌస్తుభను ప్రేమగా చూసాడు.

ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. కాలగమనంలో ఇద్దరు మగ పిల్లలకు తల్లి అయింది .తను పిల్లలను జాగ్రత్తగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. అదే విధంగా పెంచి పెద్దవాళ్ళను చేసి పెళ్లిళ్లు వారికి నచ్చిన వాళ్ళను చేసుకోమంది .ఎవరు ఉద్యోగం ఉన్న వూరిలో వారికి అపార్టుమెంట్ కొనుక్కోమని సలహా ఇచ్చింది. ఆ విధంగా ఎవరి ఇంట్లో వాళ్ళు పెళ్ళాం పిల్లలతో ఉన్నారు.కౌస్తుభ చుట్టం చూపుగా వచ్చి వెడుతుంది అత్తగారు ప్రవర్తనకి కోడళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. అత్తలు పెత్తనానికి కాదు.  కుటుంబాలు చక్కదిద్దాలని చూడాలి గాని వచ్చిన కోడల్ని సాధించడం కాదు అని చెప్పి నవ్వుతుంది కోడళ్ళు సంక్రాంతికి దసరాకి పుట్టింటికి కాక అత్త ఇంటికి వచ్చేలా ప్రవర్తిస్తుంది .వసుంధరను కోడళ్ళు ఎవరు రానివ్వరు తన ఇల్లు అద్దెకు ఇచ్చి వారిచే పనులు చేయించుకుంటు కాలం గడుపుతోంది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి ఎమ్మెస్ గళం నుంచి నా నాటి బ్రతుకు నాటకము శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశా అమృత కీర్తన శ్రావ్యంగా.వినిపిస్తోంది అంతా శుభమే కదా  ….  ప్రపంచం ఎంత మారినా ఆడపిల్ల అత్తింట ఎంత ఒదిగిన ఎక్కడ మార్పు లేదు సహనం ప్రదర్శించే కొద్ది విమర్శల విసుర్లు వియ్యలవారిని నా కొడుకు ముందు కూర్చో పెట్టీ ఒప్పించి పెళ్లి చేశారు నీ తెలివి మాకు ఇష్టం లేదు వాడు పెళ్లి చేసుకుని కూర్చుంటే సరా ఆడపిల్లల సంగతి అని అదిపోసుకునే అత్తవారు నేటికి ఉన్నారు అమ్మాయిలు మీరు అంతరిక్షాన్ని చూసినా విమర్శలు తప్పవు కదా…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!