ఆనందానికి ఆనవాలు

ఆనందానికి ఆనవాలు

రచయిత: బోర భారతీదేవి

పచ్చని పకృతి కి ఆనవాలైన కుగ్రామం. వెళ్లాలంటే పొలం గట్లపై నుండి నడవ వలసిందే బస్సు సౌకర్యం లేదు. ఒక కిలోమీటరు దూరంలో వున్న గ్రామానికి ఓ బస్సు వస్తుంది. అది కూడా రోజుకొక సారి మాత్రమే.
సరకులు కొనాలంటే పట్టణం పోవాల్సిందే. లేదంటే ఎంత జమిందారైనా ఆ ఊరి రంగడు చిల్లరకొట్టుకి వెళ్ళాల్సిందే.అదే ఊరికి పెద్ద షాపింగ్ మాల్ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి.పుట్టుక నుండి చావు వరకు జరిగే ప్రతి తంతుకు అవసరమైన వస్తువులు అమ్ముతారు మరి.అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడలేని ఉత్సాహం పచ్చని పైర్లు,ఏటి గట్టు ఆడే ఆటలు, తోటల అందాలతో పాటు రంగడు చిల్లరకొట్టులో కొనుక్కునే, దుంపలు, శనగలు, చకినాలు, గవ్వలు, బిళ్ళలు అంటే మహా పిచ్చి. ఎప్పుడు సెలవిస్తారా అమ్మమ్మ ఇంటికి పోదామా అనే ఆలోచన తో గడిపేవాళ్ళం. రంగడు కూడా అమ్మా పిల్లలు ఎప్పుడు వస్తారు. సెలవులు ఇంకా ఇవ్వలేదా అంటూ మాకోసం ఎదురుచూసే వాడు. ఒకరికొకరు ఏమి కాక పోయినా ఆ ప్రేమ ఆప్యాయత ఆనాడు అలా ఉండేది మరి. చిన్నతనంలో తెలిసి తెలియక డబ్బులు లేకుండానే వెళ్లి కొట్టు ముందు కూర్చున్న మమ్మల్ని పిలిచి ఏదోకటి తినడానికి చేతిలోపెట్టెవాడు.ఊరిలో అందరికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. పంట చేతికొచ్చే వరకు అందరికీ అరువే . వ్యాపారమంతా నమ్మకంతో నడిచేది.ఇంటిల్లిపాదీ అదే పనిలో నిమగ్నమై ఉండేవారు.అది వ్యాపారమో సహకారమో అన్నట్లుండేది. మాకు ఒకో మధుర జ్ఞాపకమై మిగిలింది. నేటి పిల్లలకు ఆ ఆనందం లేదు. ఈనాడు వెతికినా మనుష్యుల్లో ఆ అభిమానం కానరాదు. నేడు స్వలాభం తప్ప మంచితనానికి చోటు కానరాదు.నేడు ఎన్నో షాపింగ్ మాల్స్ తిప్పినా
ఆ ఆనందాన్ని అందివ్వలేము.

నీతి:ఎంత డబ్బు ఖర్చు చేసినా ఆనందాన్ని కొనలేము.

You May Also Like

One thought on “ఆనందానికి ఆనవాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!