చిల్లర కొట్టు భవాని

చిల్లర కొట్టు భవాని

రచయిత: నారు మంచి వాణి ప్రభాకరి

 

సూర్యుడి తో పాటు నిద్ర లేచి ఇంటిపనులు వంట పనులు చేసుకుని దీపం దేముడికి పెట్టీ తన కొట్టు ప్రారంభిస్తుంది

భవాని పొందుకైన గృహిణి ఓ పాతిక వేలు సొమ్ము తో చిన్నగా ప్రారంభించింది అక్కడ అంతా రోజు కూలీలు ఏరోజు కా రోజు సాయంత్రం వచ్చి డబ్బు ఇచ్చి సరకు పట్టు కడతారు డబ్బు అంతంత మాత్రం భర్త వెంకటేష్ ఓ ఫ్యాక్టరీ లో ఉద్యోగం చేస్తాడు వచ్చే డబ్బుతో కుటుంబం గడపడం పిల్లలు చదువులు అన్నీ జరగడం కష్టం అందుకు తగిన
సొమ్ము కోసం వేరే తాపత్రయం ఎందుకు అని ఇంట్లో కేజీలు లెక్కన తెచ్చుకున్న వి అక్కడి వాళ్ళకి రెండు రూపాయలకు ఐదు రూపాయలకు సరిపడా చిన్న పొట్లాలు కట్టి ఇస్తుంది
అక్కడ పిల్లలు పెద్దలు అంతా కూడా భవాని దగ్గర కొంటారు ఓ యాబై కుటుంబాల వాళ్ళు చిన్న చితక గా పట్టు కడతారు ఓ ప్రక్క పచ్చారి ఇంకో ప్రక్క ఊరగాయలు కూరగాయలు అమ్ముతుంది . భవాని తెలివైనది భర్త ఫ్యాక్టరీ దగ్గర మధ్యన్నం టీ కొట్టు లేదు అవి చెప్పాడు
భవాని పెద్ద తమ్ముడుకి సంపాదన తక్కువ అందుచేత తమ్ముడు మరదలిని తెచ్చి పెట్టుకుని ఇంట్లో ఇడ్లీ గరే ఉప్మా బజ్జీ లు వండి అమ్మెలా బడ్డి టిఫిన్ సెంటర్ పెట్టింది
అంతా బాగానే ఉంది ఉదయం ఇంటి దగ్గర ఓ వంద ఇడ్లీ యాభయి గారెలు పుణుకులు ఒక కేజీ రవ్వ ఉప్మా అమ్ముడు పోతాయి ఎదో బిజినెస్ తమ్ముడు మరదలు కూడా లాభం వస్తోంది భవాని బిజినెస్ కి డోక్రా వారి సహాయం కూడా లభించింది. ఇంకేమి మరదలు కి టిఫిన్ బడ్డికి కూడా డబ్బు ఇచ్చారు.వాళ్ళ అదృష్టం పండింది ఆ ప్రాంతంలో రెండు పాత ఇల్లు లు అపార్ట్మెంట్లు కి ఇచ్చారు. దానితో పనికి కూలీల తాకిడి పెరిగింది ఇడ్లీలు టీకి గిరాకీ పెరిగింది .భవాని చిల్లర కొట్లో సరుకుల అమ్మకం కూడా పెరిగింది కులి తీసుకుని అక్కడ కోట్లు పచారీ సరుకులు కొని పట్టు కెళ్ళేవారు
అలా చాలా లాభాలు పొందింది అక్కడ ఫ్యాక్టరీ దగ్గర టీ అమ్మకం బాగుంది ఏడాదికే తమ్ముడు మరదలు తృప్తి పడి వదినగారి పట్టు చీర కొన్నారు .

అక్కడే ఇంకో ఇంట్లో వాట పుచ్చుకుని బడ్డి కొట్టు కాస్త పెంచారు గదిలో బల్లలు నాలుగు కుర్చిలే 12 వేసి పూరీలు పెసరట్టు కూడా అమ్మకము పెట్టారు ఓ తల్లి కొడుకుని పనికి పెట్టుకున్నాను .అప్పర్టుమెంట్ కొనడానికి వచ్చిన వాళ్ళని కూడా పరిచయం చేసుకుంది కూల్ డ్రింక్ లు ,ఐస్ క్రీమ్ కూడా పెట్టింది ఖరీదైన మనుషులు అంతా కూడా భవాని తెలివికి మెచ్చుకున్నారు.
ఒక్కొక్క అంతస్తు గృహ ప్రవేశాలు అవుతున్న కొద్దీ భవాని కొట్లో సరుకులు అమ్ముడు అవుతున్నాయి.మరో రెండు ఇల్లు అపార్ట్ మెంట్ కి ఇచ్చారు ఇంచు మించు అక్కగా ఒక అపర్ట్నెట్ లో తొబ్బయ్ మరో దానిలో యాభయి గృహ విభాగాలు వచ్చాయి దానితో భవాని అమ్మ కాలు మొదలయ్యాయి.
కొందరు మాల్స్ కి వెల్ల తెచ్చుకున్న మళ్లీ అవసరానికి భవాని కొట్టు అవసరం ఉంటుంది.ముఖ్యంగా భవాని ఓ పేపర్ వేయించి అందరికీ పెంచింది.ఇళ్లకు వెళ్ళి మీకు కావలసిన సరుకు లీస్ట్ ఇవ్వండి మీకు నచ్చే రకాలు తెస్తాను అని చెప్పేది
బహు బాగు అని కొంత మంది అలాగే ఇచ్చేవారు.మరికొంత మంది అలాగే అని కొన్ని తెప్పించుకుని చూసేవారు.భవాని మొత్తనికి బహుళ అంతస్తుల భవనాలు యాజమానుల ద్వారా తన బిజినెస్ పెంచుకుంది

పెద్ద పిల్లాడు ఇంజినీరింగ్ డిప్లొమా చేసి పంచాయితీ రాజ్ లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ సంపాదించాడు వాడికి 20 ఏళ్లు మించి లేవు.

భవాని ఆనందానికి అవధులు లేవు రెండో వాడు అదే చదువుతున్నాడు పిల్లకి పది అయ్యింది ఇంకా చదువు వద్దు అని పెళ్లికి ప్రయత్నాలు మొదలెట్టింది నాలుగు డబ్బులు ఉన్నపుడే గట్టు ఎక్కలి అంటూ. వెలి విడిచిన మేనల్లుడు ఉంటే వాడికి ఇచ్చి పెళ్లి చేసింది వాడు డిగ్రీ చదివాడు డిటిపి షాప్ పెట్టు కూన్నాడు పిల్లకి కుట్టు నేర్పించిది అది దానికి కుదిరినప్పుడు జాకెట్లు చీర ఫాల్స్ వేసి డబ్బు సంపాదిస్తుంది ఆ ఊరు లోనే వేరే చోట ఉన్నది

మగ పిల్ల వాడికి ఉద్యోగం వచ్చి మూడు ఏళ్లు దాటింది.పెళ్లి చెయ్యాలని కింద మీద పడింది వాడు కొంచెం పొట్టిగా ఉంటాడు.అయితే తెల్లగా లక్ష కట్నం ఇచ్చి బి ఏ చదివిన ఒక్క పిల్ల సంబంధం కుదిర్చింది తల్లి తండ్రికి డాబా ఉంది వాళ్ళకి ఫ్యా న్సి కొట్టు ఉన్నది బిజినెస్ వాళ్ళ పిల్ల అయితే మంచిది డబ్బు ఆదా చేయడం తెలుస్తుంది అని భవాని ఉద్దేశ్యము.

పెళ్లి రోజులు దగ్గర పడుతున్నాయి పెళ్లి కార్డ్స్ పుచ్చుకుని పట్టు చీర కట్టి కూతుర్ని చెల్లెలిని తీసుకుని చక్కగా హాట్ పాక్లు పుచ్చుకుని బొట్టు పేట్టి అవి ఇచ్చి పెళ్లికి రండని పిలిచింది ఈ ఊళ్ళో కాదు కదా శ్రీ సత్య నారాయణ వ్రతము శ్రీ వేంకటేశ్వర దీపారాధనకు రండి అక్కడ భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పింది భవాని నీ అందరూ గొప్పగా ఆలోచించారు . ఇంచుమించు అందరినీ పిలిచింది సరుకు కొన్న కొనక పోయినా విమర్శించిన అందరినీ సమానంగా పిలిచింది.పెళ్లి అయి వచ్చారు పిలిచిన వాళ్ళు ఇంచుమించు అందరూ వెళ్లారు భవానీ చాలా బాగుంది నీ కోడలు అన్నారు ఆనంద పడింది. వచ్చిన వాళ్లకి మామిడి పళ్ళు జాకెట్టు బట్ట పెట్టీ పంపింది ధన వంతులు కూడా అంత బాగా చెయ్యరు అంతా ఆప్యాయత చూపరు కని భవాని బాగా చేసింది కోడలు వచ్చిందని పెద్ద ఇల్లు పుచ్చుకుని ఉంచింది ఇంచు మించు రోజంతా భవాని కి ఆ కొట్లోనే సరిపోతుంది అయినా సరే కోడలు సుఖం కోరి పెద్ద ఇల్లు పుచ్చుకున్న ది. అక్కడ దగ్గరలో మళ్లీ ఎవరో బిల్డరు కొత్తది కడుతున్నాడు అందులో ఒక్ ఫ్లాట్ బుక్ చేసుకుంది తన వాట ఇల్లు పల్లెలో ఉన్నది అమ్మీ కొంత డబ్బు స్వర్జితం చేర్చి ఇల్లు కూడా కొన్నది
చిల్లర కొట్టు భవాని కి చీటిల చెట్టెమ్మ స్నేహితురాలు అక్కడ దాచిన సొమ్ము ఇలా ఉపయోగ పడింది చిల్లర కొట్టుతో కుటుంబ పోషణ ఇల్లు అన్ని అమర్చుకున్నది ఎది ఏమైనా కానీ అడది ఒద్దికగా ఉండి అన్ని ఏర్పాటు చేసుకుంది అన్నారు కొందరు మరి కొందరు దానికి మొగుడు కూడా కలిసి వచ్చి వెనకాల ఉండి చూసాడు ఇద్దరు జగర్త్ మంతు లు కనుక చక్కగా కుటుంబం .నడిపింది అని మెచ్చుకున్నారు
మళ్లీ మనము గృహ ప్రవేశం రెండోవాడి పెళ్లికి ఎప్పుడు పీలుస్తుందా అని ఎదురు చూద్దాము అని ఆనంద పడ్డారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!