ప్రేరణ

ప్రేరణ

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

చూడు శ్రావ్య, ఇంట గెలచి, రచ్చ గెలవమన్నారు. అంటే మొదటగా నువ్వు ఇంట్లోనే విజయాన్ని సాధించాలి. అది ఏమంత సులభంగా దక్కే విజయం కాదు అని మన అందరికీ తెలిసిందే.

నిత్య జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లను, కష్టనష్టాలను, మరెన్నో చేదు అనుభవాలను చవిచూశాము. కష్టేఫలి. అందుకే, కష్టాలకు కుంగిపొకుండా, విజయానికి పొంగిపోకుండా…నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. నీ గమ్యం నీకు చేరువ అవుతుంది. అన్నాను.

అమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు. మనము అనుకున్నట్టుగా తేలిక అయిన పని కాదు. జీవితంలో విజయం సాధించడం. అందునా ఈ రోజుల్లో. ఎన్ని అవకాశాలు ఉన్నాయో, అంతకంటే ఎక్కువ పోటి ఉంది ఈ ప్రపంచంలో అంది నిరాశగా.

ఈ రోజు ఎలాగైనా దీని మూడు మార్చి, సరి అయిన దారిలో పెట్టాలి అని నిర్ణయానికి వచ్చాను.

నువ్వు అన్నది నిజమే శ్రావ్య. కాంపిటేషన్ చాలా ఉంది. అలాగని ముందడుగు వేయలేను అంటే ఎలా? నీ మార్గంలో నువ్వు పయనించు, అన్వేషించు, చివరకు ఏదో ఒకటి సాధించు. చివరిగా విజయం చేకూరుతుంది లేదా, జీవితంలో అనుభవాల సారాన్ని గుణపాఠంలాగా వినియోగించు.

అమ్మా, మీ రోజుల్లోలాగా లేవు రోజులు. అంతటా స్వార్డం. అడుగడుగునా రాజకీయ అంశాల పరంపరతో మిళితమై ఉంది ఈ లోకం. తట్టుకుని నిలబడాలి అంటే, ఎంతో చాకచక్యంగా వ్యవహరించడం చాలా అవసరం.

ఆ ధోరణి పక్కన పెట్టు శ్రావ్య. నువ్వు అన్నట్టు, ఇవి మా రోజులు లాంటివి కాకపోవచ్చు. కానీ, బ్రతుకుతున్నాము కదా? మా ఉద్యోగాలు మేము చేసుకుంటున్నాము కదా???

ఆ కంప్యూటరులో వర్క్ నాకు రాదని వెనుకంజ వేయలేదు. ఎంత మంది అవకాశాల కోసం ఎదురు చూసినా, నాకే అర్హత ఉంది అంటూ మా టీం కోసం నన్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోలేదా? ఆ కొత్త ప్యాషన్లు అర్దం కాక, చేంజ్ చెయ్యమని చెప్పటానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డానో… వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసినప్పుడు నువ్వు చూడలేదా????

అప్పుడు నేను చెయ్యలేను అని నేను మా సార్ కి చెప్పేసి ఉంటే, ఇప్పుడు నేను ఈ ఉద్యోగంలొనే ఉండేదాన్ని కాదు కదా??? నీలాంటి యంగ్ స్టర్ ఎవరో నా పోస్ట్ లో ఉండేవారు. చేయవలసిందల్లా… మన ప్రయత్నం అన్నాను నవ్వుతూ.

ఈ లాక్ డౌన్లో నాలో వచ్చిన మార్పుని గుర్తు చేసుకుంటూ… రాదు అనుకుంటే ఏది రాదు, వస్తుందేమో చూద్దాం అనుకుంటే… తప్పకుండా ముందుకు వెళతాము అనేది నా వాదన.

నువ్వు నాకు ఇచ్చే ప్రేరణతో నేను ముందడుగు వేస్తానమ్మా. ఆశల సౌధం నిర్మాణానికి, ఖచ్చితంగా రేపటి నుండి ఎయిర్ఫోర్స్ కు సంభంధించిన బుక్స్ చదువుతాను. మరింత లోతుగా వాటి గురించి అధ్యయనం మొదలు పెడతాను.

థట్స్ గుడ్ బేబీ. విజయం అంటే రోదసిలో ప్రయానమే కాదు. చంద్రుడి మీద నివాసం కాదు. సాగర మధనంలో గెలుపు కాదు. మనకి గోల్డ్ మెడల్స్ వద్దు. టాప్ రేంజ్ ప్లేస్మెంట్ వద్దు. మనం చేసే పనిలో మనకు కలిగే ఆత్మ విశ్వాసమే… మనకు అసలైన విజయం.

మనం కోరుకున్నది మన ప్రయత్న లోపం వల్ల మనకు దక్కక పొతే అది అపజయం. ప్రయత్నం చేసి ఓడిపో… కానీ ప్రయత్నమే చెయ్యక మిగిలిపోకు….

నీకు నువ్వు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆ విమర్శే నీ ఆశల సౌధంలో నువ్వు సాధించిన ఆ చిన్న విజయమే నీకు శ్రీ రామ రక్ష అవుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!