అద్భుతమీ కలయిక

అద్భుతమీ కలయిక

రచన : యం. టి. స్వర్ణలత

ఉరకలెత్తే ఉడుకు రక్తం
ఆకాశం అంచులు దాటే ఆవేశం
ఎగసిపడే ఉత్తుంగ తరంగం
నిప్పులు మూటగట్టిన నిలువెత్తు రూపం..
అణువణువునా నిండిన చైతన్యం
హద్దులు దాటే కోపపు రూపం…
భగభగలాడే అగ్నిగోళం అతడు
పురుషాహంకారం
పుణికిపుచ్చుకున్న మగధీరుడతడు

ఘనీభవించిన మంచు శిఖరం
ఓర్పులో భూదేవి సహనంలో సీత
చదువులో అపర సరస్వతి
ఆలోచనలో అపర మేధావి
పరిస్థితుల సమన్వయ కర్త
ఆకాశంలో సగం తాను
అమ్మలా లాలించే ప్రేమ మూర్తి
శాంతికి ప్రతిరూపం ఆమె

ఆ ఇద్దరి కలయిక అద్భుతమే
నీరు నిప్పు కలిసి సాగించే జీవనమే
పిడికిలి బిగించి సాగించే సమరమే
ఏదైనా సాధించే పట్టుదలకు రూపమే
నీరు నిప్పుల కలయిక విస్ఫోటనం
ఆవేశం ఆలోచనల ఆచరణాత్మకం
కోపం సహనాల సహాకారం…
చైతన్యం నిండిన శాంతి స్థాపనమే

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!