బంధం…అనుబంధం….!!

బంధం…అనుబంధం….!!

రచన : స్వాతి బొలిశెట్టి

చిగురించే ఆకులలో బంధం నీవు..!
పరిమళ కుసుమై అనుబంధం నేను…!!

నీటి అలలతో మేఘ బంధం నీవు..!
వర్షించే చిరుజల్లుల అనుబంధం నేను…!!

మనిషిలోని మనసు బంధం నీవు..!
ఆనందపు కేరింతల అనుబంధం నేను…!

సెలయేటి సవ్వడుల బంధం నీవు..!
సేదతీర్చు తీరాల అనుబంధం నేను…!!

హృదయానికి రుధిర బంధం నీవు…!
అలజడిగా స్పందించే అనుబంధం నేను..!

కన్నులలో కలల బంధం నీవు…!
కమ్మని కావ్య అనుబంధం నేను..!

అధారలపై పలుకుల బంధం నీవు…!
మాధుర్యపు భావనగా అనుబంధం నేను..!

ఊపిరిలోని ఉచ్ఛ్వాసపు బంధం నీవు..!
వెచ్చని నిశ్వాసపు అనుబంధం నేను..,!

అంతరంగపు ఆత్మ బంధం నీవు…
అంతర్లీన స్పర్శతో అనుబంధం నేను…!

పాటలోని‌ చరణాల బంధం నీవు..!
పల్లవై పాడే రాగపు అనుబంధం నేను…!!

కలువలతో వెన్నెల బంధం నీవు…!
కౌగిలింతల రేయితో అనుబంధం నేను…!

ప్రకృతిలో సౌందర్య బంధం నీవు…?
ఆకృతినే ఊహించే సాహిత్య అనుబంధం నేను…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!