జీవితాలను మార్చిన కథ

జీవితాలను మార్చిన కథ

కొఠారి ప్రమీలా రాణి

ఉదయం సుప్రభాతం వినసొంపుగా వినబడుతుంటే నిద్ర మత్తు పూర్తిగా వదిలింది. ఎదురుగా “గుడ్ మార్నింగ్” అని విష్ చేస్తూ నా అందాల రాక్షసి, ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నా దరికి చేరుస్తూ.. అదేంటో తనని చూడగానే నా మాటే మూగబోతుంది.
ఐశ్వర్యం తెచ్చిన అదృష్టంతో దొరబాబులా పెరిగినా, జీవితంలో అత్యున్నత స్థానంలో ఉన్నా గర్వం అనే గీత వైపు నడవలేదెన్నడూ. నిజాయితీకి మారు పేరులా ఉన్న నన్ను నేను తల్చుకున్నపుడూ, నా మాటే వేదంలా నా వెన్నంటే నా భార్యను చూసినా, తన మాటలతో మైమరిపించే నా చిన్నారి కూతురు సిరి వర్షిని వల్లనైనా నా అంత అదృష్టవంతుడు వేరే ఉండరు అని మురిసిపోతాను.
“ఏమండీ ఈ రోజు మీటింగ్ ఎర్లీగా ఉందన్నారు గుర్తులేదా” అంటున్న స్వాతి డార్లింగ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను.
వెంటనే రెడీ అయ్యి ఆఫీస్ కు బయలుదేరాను. నాకు రెడ్ కలర్ కార్ లో వెళ్ళాలనిపించి బయటికి తీశాను. కార్లంటే ఉన్న పిచ్చితో కొత్త మోడల్ ఏదైనా వచ్చి నచ్చితే తీసుకుంటాను. దేవుడి దయ ఎక్కువ కదా! అంతేకాదు, పేదలకు సాయం కూడా చేస్తాలెండి. అది మా అమ్మ నాన్నల నుండి అలవడిన అపురూప వరం.
ఆఫీస్ కి చేరి మీటింగ్ అటెండ్ చేసి బయటకు చేరాను. వన్ వీక్ నుండి ఆఫీసు లో హెవీ వర్క్ ఉండటంతో రిలాక్స్ కోసం లీవ్ తీసుకుని మూవీ ప్లాన్ చేశాను.
“మూవీ వెరీ నైస్ కదా” అన్నాను థియేటర్ నుండి బయటకు వస్తూ నా భార్యతో.
“అవునండీ” అంటూ నా భార్య సంతోషంగా సమాధానమిచ్చింది. షాపింగ్ కూడా ముగించుకుని బయలుదేరాం. ఇంతలో మా సిరి వర్షిణి చేతి నుండి బాల్ జారిపోయింది, వెంటనే బాల్ వెంట పరుగెత్తింది కార్ల పార్కింగ్ వైపు, అటుగా వస్తున్న కారు చూడకుండా.. అంతా క్షణాల్లో జరిగింది నా మైండ్ బ్లాంక్ అయింది. ఇంతలో నా పాప నా దగ్గర ఉంది. అది కూడా క్షేమంగా…
నా కన్నీళ్లతో పాపను కాపాడిన ఆ దేవుడిని చూసాను, గాయాల పాలయిన ఆ దేవుడిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాను. తన ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి తీసుకు వెళ్ళాను. తన పేరు కిరణ్ అని, ఒక పాన్ షాప్ నడుపుతూ ఉంటానని చెప్పాడు. నా కూతురుని కాపాడిన అతనికి ఏవైనా సరే ఇద్దామనుకున్నాను.
చిరునవ్వుతో వద్దనేసాడు. బ్రతిమాలాను, వినలేదు, మొండివాడు. ఆ క్షణం నుండి అతనికి అభిమానిగా మారిపోయాను. స్నేహబంధం ముడి వేశాను.
కిరణ్ స్నేహం నన్ను ఇంకా ఆనందంగా మార్చేసింది. తన నుండి విలువైన జీవిత విలువలు ఇంకా నేర్చుకున్నాను. గతంలో ఎక్కడైనా అసహనం ఉన్నా, దాన్ని కిరణ్ స్నేహం మాయం చేసింది.
**************
“హలో మిస్టర్ రవి, మీరు వెంటనే హాస్పిటల్ కి రాగలరా ” కిరణ్ ఫ్రెండ్ రాజు ఫోన్లో..
ఏమైందోనని కంగారుగా హాస్పిటల్ కి చేరుకున్నాను. రాజుని కలిసాను. ఐసీయూలో ఉన్న కిరణ్ ని చూడగానే నా గుండె ఆగినంత పని అయింది. ఏం జరిగిందని రాజుని అడిగాను.
“సూసైడ్ చేసుకోబోయాడని” చెప్పాడు రాజు. డాక్టర్ తో మాట్లాడి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించి నా స్నేహితుడిని బ్రతికించుకున్నాను కానీ, ఎంత అడిగినా కారణం చెప్పలేదు.
రెండు రోజుల తర్వాత కిరణ్ ని డిశ్చార్జ్ చేశారు. నేను కిరణ్ వాళ్ళ ఊరికి కిరణ్ ని తీసుకొని వెళ్ళాను. ఊరు బాగుంది, ఇల్లు బాగుంది, ఇంటిలోని వారంతా కిరణ్ పట్ల చాలా ఆప్యాయంగా ఉన్నారు. కానీ కిరణ్ కి ఏ ప్రాబ్లం ఉందో అర్దం కాక మనసులో ఆందోళన తొలుస్తూ ఉంది. కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ చూపించే ఆప్యాయత నన్ను కట్టిపడేసింది. ఇల్లంతా చూడాలనిపించింది. నడుస్తూ ఉన్న నా కాళ్లు ఒక చోట ఆగిపోయాయి, శరీరం చల్లబడింది, ప్రాణాలు పోతున్న భావన…
“ఏంటి బాబు అలా ఉన్నారు” కిరణ్ వాళ్ళ బామ్మ గారు నన్ను తట్టి అడిగేసరికి షాక్ నుండి తేరుకున్నాను.
“ఆ ఫోటో ఎవరిది” అని అడిగాను అనుమానంగా గోడ మీద వేలాడుతున్న ఫోటోని చూపిస్తూ.. కన్నీళ్ళ పర్యంతమైన బామ్మ తన గతం నా ముందుంచింది.
ఆ ఫోటోలో ఉన్నది తన అన్నయ్య అని, ఆడపిల్ల అని చులకనగా చూసే తన అమ్మానాన్నల మనస్తత్వంతో, అతను తనను మతిస్థిమితం లేని బాగా డబ్బున్న వాడికి ఇచ్చి పెళ్లి చేశాడని, ఆ తర్వాత తమ ఆస్తిని కాజేశాడని, పేదరికంతో మగ్గిపోతూ కుటుంబాన్ని నడిపించానని, చదివించే స్తోమత లేక పిల్లలను చదివించ లేదని, తన కొడుకు కూడా కష్టపడి పని చేసినా కలిసిరాలేదని, అందువల్ల మనవడు కిరణ్ ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాడని, ఆత్మహత్యాయత్నం చేశాడు అని వివరించింది.
నా చెవులు, కళ్ళు పనిచేయడం లేదు. నా జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుంది అనుకోలేదు. నా పాదాల కింద భూమి కంపించింది. ఎందుకంటే ఆ ఫోటోలో వ్యక్తి మా నాన్నకు జన్మనిచ్చిన తండ్రి. నేను అనుభవిస్తున్న ఆస్తి కిరణ్ వాళ్ళది, నా ఆనందం సంతోషం అన్ని కిరణ్ కి దక్కాల్సినవి.
నిజమే మా తాత బ్రతికే ఉన్నాడు. కానీ వాళ్ల దృష్టిలో ఎప్పుడో చనిపోయాడు. నా దృష్టిలో ఇప్పుడు చనిపోయాడు.
ఇంటికి చేరాను. మనిషిని కాలేకపోయాను. నాది అనుకున్న ప్రతిదీ వాళ్ళ నుండి లాక్కున్నదే.
***
వారం తరువాత కిరణ్ ని కలిసాను. తన పేరు మీదకు మార్చిన ఆస్తులను కిరణ్ కి అందించాను. ఒక బైక్ కొనుక్కున్నాను. బైక్ పై ఆఫీసుకు వెళ్ళడం చాలా బాగుంది.
తృప్తి కలిగిన జీవితానికి ఆ ఆనందమే వేరు…

**సమాప్తం**

You May Also Like

2 thoughts on “జీవితాలను మార్చిన కథ

  1. ఎప్పటికైనా సరే చేసిన తప్పు అనుభవించక తప్పదు…సూపర్ స్టోరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!