హృదయ రవళి

హృదయ రవళి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభా కరి

సూర్యోదయం ఎంతో అందంగా ఉంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు రోజు ఎంతో ప్రకృతి మార్పులు అనుసరిస్తూ వేడి, చలి, వాన అన్నిటినీ దాటుకుంటు సాయంత్రం అమ్మ ఒడిని చేరుతారు.సూర్యుడు కూడా అమ్మ ఓడి ఇష్టపడతారు. మహనీయుల సహితము తల్లి ప్రేమలో ఎన్నో అందాలు, ఆనందాలు అనుభవిస్తూ ఆహ్లాదంగా తృప్తి పడుతాడు. మరి సామాన్యుని హృదయంలో ప్రేమ అనేది అమ్మ ఒడిలో పుట్టి పెరిగి, సఖి ప్రేమలో మరింత జీవిత ఆనందం పొందుతారు. ప్రేమ అనేది ఒక తరహా హృదయ రవళి. అందులో ఆమే కోసం తపించి పొందడంలో ఎన్నో ఆనందాలు ఉన్నాయి. రవణాలు ఒక్కతే కూతురు తల్లి, తండ్రి చాలా ప్రేమగా పెంచారు. స్కూల్ కి వెలితే కంది పోయేది
అమ్మమ్మ చాలా గారంగా చూసేది. కూతురు కూతుర్ని ఎంతో మహాగారంగా చూసేవారు. అల్లుడు ఒ.న్.జీ.సి లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అత్తగారు ఎంత చెపితే అంతా, మామగారు టీచర్ చేసి రిటైర్ అయ్యాడు. పిల్లకి ఇల్లరికం పెళ్ళి చెయ్యాలని కోరిక. అల అయితే కూతురు ఇంట్లో ఉంటుంది. వాళ్లకి కూతురు అత్త ఇంట్లో ఉండి మెప్పు పొందాలి అనే భావన లేదు. ఆడ పిల్ల జీవితం అంటుమొక్క లాంటిది ఆ ఇంట్లో జీవితం పాతుకు పోవాలి అనే ధోరణి లేదు. ఎంత సేపు అత్తింటి వారిని రమ్మని పండగలు, పబ్బాలు చేస్తూ కాలం గడిపేస్తారు. అల్లుడు కూడా ఎక్కువ భాగం దూరప్రాంతంలో క్యాంప్లంటు కాలం గడుపుతారు. భార్య, భర్త సంప్రదాయం ప్రకారం మంచి, మర్యాద, సంప్రదాయం పద్దతిలో జీవిస్తారు. ఆధునిక భావాలు, ఆధునిక అలవాట్లు ఏమిలేవు ఎంత పెద్ద ఉద్యోగమైన అతని ఇంట్లో తల్లి తండ్రి మాట వినేవారు. ఓరే పెద్దోడా నువ్వు నీ పెళ్లాన్ని కష్ట పెట్టకు. నీ అత్త, మామ మాట విను అని చెప్పేవారు. కోడలు అంటే అందరికీ ప్రేమ. ఒక్క కూతురు ఇప్పటికీ తల్లి వండి అల్లుడుకి పెడుతుంది. అత్తగారు బలంగానే ఉంటుంది. మామగారు మాత్రం నరాల నీరసం సన్నగా ఉంటాడు. రవణాల అనే రమణి ఎంతో తెల్లగా నాజూకుగా ఉంటుంది. మొదట ఒక పిల్ల పుట్టింది. తల్లి, తండ్రి అత్త, మామ వంశోద్దారకుడు ఉండాలి అంటూ రెండో కాన్పు చూశారు. అదృష్టం కొద్దీ మగ పిల్లాడు పుట్టాడు. ఇంకేమి మనుమడునీ చంకన వేసుకుని అల్లారు ముద్దుగా పెంచడం మొదలు పెట్టారు. మనవడునీ దత్తత అయితే మంచిది అనుకున్నారు. కానీ అల్లుడు వద్దు.. మీరు కూడా మా దగ్గరే ఉండండి. కొడుకైన, అల్లుడైన నేనే కదా అంటు హితవు మాటలు చెప్పాడు. దానితో అత్త, మామ మురిసిపోయారు. అల్లుడికి అప్పటికి అస్తమానం క్యాంపులు ఉండేవి. పిల్లని చెయ్యడానికి అందరూ బెదిరిపోతు ఉండేవారు. ఏవో టెంట్లలో ఊరికి అవతల ఉండాలి. పెళ్ళాం పిల్లల్ని దూరంగా సిటీకి ఉంచి వీళ్ళు ఊరు అవతలి పొలాల్లో ఉంచుతారు. నా పిల్ల బెంగ పడుతుంది. పోనీ అత్త, మామ దగ్గర ఉంచుదాం. అంటే పెద్ద సంసారం ఐదుగురు అక్క, చెల్లెళ్ళు ముగ్గురు తమ్ముళ్ళు అంటూ సాగదీసి ఈ రోజుల్లో పెద్ద సంతానంలో ఉండలేము కదా! పిల్లని ఎలా చేస్తాము. ఇంట్లో రోజు పన్నెండు కంచాలు, ఇరవై కప్పుల కాఫీ కలపాలి అంటూ భయపడ్డారు.
చివరకి రమణి సంబంధం కుదిర్చారు. వీళ్ళకి పిల్ల ఇంట్లో ఉండాలి. అల్లుడు వచ్చిపోతు ఉంటే సరి. అల రమణి పెళ్ళి ఘనంగా అయ్యింది. ఇంటికి పెద్ద కోడలు అయిన సరే పెళ్లికి, పేరంటానికి చుట్టం చూపుగా వచ్చివెళ్ళేది. వదిన, వదిన అంటూ చిన్న వాళ్ళు ముచ్చటగా ఉండేవారు. మరదలు..మరదలు అంటూ పెద్ద వాళ్ళు ప్రేమగా ఉండేవారు. అంతా ఎంతో ప్రేమగా హృదయరవళితో ఉండేవారు. మనవడు పెంపకం తాత, అమ్మమ్మ పెంచారు. రమణికి ఇప్పటికీ వంట రాదు. ఇద్దరి పిల్లల్ని తల్లి పెంచింది. అల్లుడికి వంట వండి అత్తగారు పెడుతుంది. మనవరాలి మొగుడికి కూడా అమ్మమ్మ వండి పెడుతుంది. ఈ అదృష్టం ఎంత మందికి వస్తుంది. కొందరికి మాత్రమే ముత్తమ్మమ్మ ఒడిలో మనవడు మానవరాలి పిల్లలు ఆడుకోవడం కొందరికే పరిమితము. రమణి కూతురు రమ్య డీగ్రి కాగానే బంధువుల అబ్బాయి కెనడాలో ఉన్నాడు. పెళ్లిచేసి రెండు పురుళ్లు పోసి ముత్త అమ్మమ్మ ఒడిలో పెట్టీ పెంచిందీ మనవల్లా పెంపకం అంతా పెద్ద వాళ్ళదే. మనవడు మాత్రం డైరెక్టర్ ఫీల్డ్ లో పెట్టారు. వాడు అదే ఇష్టం అన్నాడు. ఎమ్.సి.ఏ చదివిన సరే గ్రాఫిక్ డిజైన్ లు డైరెక్షన్ అంటూ అటు వెళ్ళాడు. ఒక్క కొడుకైన సరే ఇంజినీర్ డాక్టర్ అని కాకుండా నచ్చిన చదువు చదివించాడు. అదే రంగంలో ముగ్గురు, నల్గురు అమ్మాయిలు చరణ్ అంటే ఇష్టం అంటూ ఇంటి చుట్టూ తల్లి, తండ్రులని ప్రేమ పేరుతో తిప్పారు. కానీ అమ్మమ్మ ఓప్పుకోలేదు. సరే అంటూ చరణ్ పెద్దలకి విలువ ఇచ్చాడు. దగ్గరి బంధువుల పిల్ల ఇంజినీర్ చదివింది పిల్ల, పిల్లాడు. ఆ పిల్లను చెప్పారు. సరే పెద్దల అంగీకారం తెలిపిన వివరాల ప్రకారం ఒకే అన్నాడు. రంగ రంగ వైభవంగా భోజనంలో బంగారు రేకులు, స్నాతకంలో వడ్డించారు. అలా జరిగిన పెళ్ళిలో అమ్మమ్మ మనుమారాలికి వడ్డాణం పెట్టింది. మనుమడుకి పెద్ద కారు కొనిచ్చింది. వాళ్ల వంశానికి ఎంతో అందమైన కోడలు వస్తుంది. కానీ ఈ పిల్ల సామాన్యంగా ఉంటుంది. అసామాన్య సిరి ఉన్నది. మనుమడు పిల్లలకు కూడా ఎంతో ప్రేమ పంచుతూ..ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు అంటు అమ్మమ్మ పాడుతు, శ్రీ అన్నమయ్య ఆనాటి పాట శ్రీ వేంకటేశ్వర స్వామి పై పరవశంలో రచించి పాడిన కీర్తన ఈ తరంలో కూడా ఆశీస్సులు.
ప్రేమగా మురుస్తున్న తీరు చరణ్ కి ఎంతో ఆచర్యం ఆనందం కలిగి హృదయ రవళి అనే టెలీఫిలిమ్ కి శ్రీకారం చుట్టింది. కాలం క్రమంలో మనుమడు పిల్లాడికి బారసాల చేశారు. బంగారు పళ్లెం గ్లాసు పెట్టింది. ముత్త అమ్మమ్మ అని అమ్మమ్మలు వంశం కోసం ఎదురు చూస్తారు అందులో ఎంతో ప్రేమ వాత్సల్యం ఉన్నాయి. పిల్లలు వంశం అభివృద్ధి చేసి నిలుపుతారు. కన్న పిల్లలపై ప్రేమ లేని తల్లి తండ్రులు ఎందరో ఉన్నారు. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ మనకి మన పెద్దల నుంచి ఉండాలి. కెరియర్ బిజీలో పెళ్ళి పిల్లలు అన్ని కూడా కను మరుగు అవుతున్నాయి. మన ప్రేమ గానీ, మనసు పెట్టీ ప్రేమించి మనుష్యులు మధ్య ఆర్థిక బంధాలు తప్ప ప్రేమ బంధాలు లేవు. పిల్లలని వీరికి పెంచడానికి కుదరదు పెద్దలు ఇష్టం ఉండరు. ఇంకా కుటుంబాల మధ్య “హృదయ రవళి ఎలా?” ప్రేమ ఎన్నో రకాలు వాటిని అవహన చేసికోవడంలో ఉన్నాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!