మంచి మార్పు

మంచి మార్పు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)   

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయంతో పాటు అన్నపూర్ణ, రామనాధం కష్టపడతారు. దొడ్లో గోశాల ఉన్నది అందులో ఆరు అవులు ఉంటాయి. రెండు గేదలు ఉంటాయి. గేదె పాలు అమ్ముతారు, ఆవుపాలు ఇంట్లో వాడుకుంటారు. వెన్న తీసి వంటల్లో వాడుతుంది.
కూరగాయలు కూడా అన్ని దొడ్లో పెంచుతారు. ముందు పెరడులో అందమైన మందారాలు, గన్నేరు మల్లె, జాజి, బంతి, చామంతి, లిల్లీ,  పారిజాతాలు, బోగడలు, కాడ మల్లె, మాచి పత్రి మరువం ఉంటాయి. ఏ కాలం పువ్వులు ఆ కాలం విడుస్థాయి. ఇంటి ప్రక్క పెద్ద స్థలం ఉన్నది. అది లీజుకి పుచ్చుకుని కూరలు పండిస్తారు. ముఖ్యంగా అన్నపూర్ణ ఇంటి దగ్గర స్థలంలో కూరగాయల పంటలు చూసుకుంటుంది. రామనాధం పొలం పనులు చూసుకుంటాడు. మనం మంచిగా ఉంటే మనకు అందరూ మంచిగా కనిపిస్తారు అంటారు కానీ, మనం ఎంత మంచిగా ఉన్న అవతల గ్రహించ లేని వ్యక్తులు ఉంటే, మన మంచితనం, అమాయకత్వంగా మిగిలి ఉంటుంది. అవతల కూడా మన గురించి అన్ని మంచిగా గ్రహించే వ్యక్తులు విలువ నిచ్చే వ్యక్తులు ఉంటే అప్పుడు మంచి తనం సుగంధ పుష్ప చందన పరిమళంలా వికసిస్తుంది. పరవశంతో గుబళిస్తుంది కేవలం వన్వే ట్రాఫిక్ కాదు, ఇలా ఆలోచిస్తూ ఆవుపాలు పితుకుతోంది. రోజూ ఆవుపాలు పూర్ణ పితుకడం అలవాటు గేదెపాలు మాత్రం పాలేరు వచ్చి పీతుకుతాడు అవి పాల కేంద్రానికి పంపుతారు. అమ్మ పాలడబ్బు అన్నపూర్ణ పుచ్చుకుంటూ ఉంటుంది. కూరగాయలు మాత్రం ఇంటి వాడకానికి చుట్టూ పక్కల వారికి పంచడాని సరిపోతాయి. అరటి గెలలు మాత్రం సంతకి పంపిస్తారు. ఇంటి పంటతో ఆనందంగా కుటుంబం గడిచి పోతుంది. పండగకు ఇద్దరు పాలెళ్ళూ ఇద్దరు పనివాళ్ళకి కూడా బట్టలు పెడుతుంది. సంక్రాంతికి ఒకసారి, దసరాకి పెడతారు. వాళ్ళకి పెద్ద జీతాలు ఉండవు. కూరలు పప్పులు పొలంలోవే ఇస్తారు. బియ్యం మాత్రం కొన్నవి ఉంటాయి. ప్రభుత్వ పథకం ద్వారా పుచ్చుకుంటారు. దానితో మధ్యలో చద్ది అన్నం పొద్ది, మిగిలినవి పెడితే తింటారు. ఆహార విషయంలో సమస్య లేదు, పూర్ణ అవసరం అంటే వండి పెడుతుంది. అలా అనందంగా గడిచిపోతోంది. ఆడపిల్లలు ఇద్దరు ప్రైవేట్ గా డిగ్రీ చేశారు. ఆ ఊళ్ళో ఓ సంగీతం మాస్టారు ఉన్నారు. ఆయన వచ్చి శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు త్యాగయ్య కీర్తనలు నేర్పేవారు. ధాన్యము వచ్చాక పన్నెండు బస్తాలు ధాన్యం కొలిచి ఓ కొత్త జవారు సంక్రాంతికి పెట్టేవారు. కూరలు పళ్ళు ఇస్తు ఉండేవారు. అప్పుడు డబ్బు అవసరం కంటే మనుష్యులుకు విద్యను నేర్పడం, కానీ డబ్బు ఆశ లేకుండా కుటుంబాలు గడిచేవి. ఇప్పుడు అల కుదరదు వంద కాగితాన్ని పట్టు కెడితే విలువ లేదు. చిన్న పిల్లాడి సహితము, వంద అని ముఖము ముడుచుకుని వెళ్లి పోతాడు. ఐదు వందల కాగితం ఇస్తే ముఖం విప్పారుతుంది. ఇదండీ నేటి పరిస్థితి పిల్లలు సహితము డబ్బు విలువను బాగా తెలుసుకున్నారు. ఇంకా ఒంటిసరుకులు, అన్ని కూడా ఆకాశ ధరలే ఉన్నాయి. పిల్లలు బుద్దిమంతులు, దగ్గరి సంబంధం చేస్తే మంచిది. బయటి సంబంధాలు మెరుపులు కానీ గుణ గణాలు ఏమి తెలియవు. అలాగని ఇరుగు పొరుగు వారిని అడిగితే మంచి వాళ్లే చెయ్యండి అంటారు. అయితే ఇక్కడ బయటి వాళ్ళతో మంచితనం వేరు, పెళ్లివారితో మంచితం వేరు. పెళ్లి వారు దగ్గర, మగ పెళ్లి వారి హుందాతనం చూపిస్తారు. బయటి వాళ్ళ దగ్గర అమ్మ, బాబు అంటారు. దానికి బయటి వాళ్ళు వీళ్ళు ఎంతో మంచి వారని ముద్రవేస్తారు. వారి మెప్పు కోసం బయటి నుంచి పళ్ళు పండగల్లో పిండి వంటలు ఇచ్చి దాతృత్వం చాటు కుంటారు. కనుక ఎవరినీ ఏమి అడిగినా ఏమి మనకు వివరాలు తెలియవు, మనకు మన పిల్లతో పిల్లాడి ప్రవర్తన నిజమైన అనుభవము. అదే జీవితము ప్రేమికులలో కూడా ప్రేమించినంత కాలం ఎన్నో గొప్ప కబుర్లు చెపుతారు. ఆకాశం నుంచి నక్షత్రాలు తెచ్చి ఇవ్వనా, హిమాలయాల నుంచి హంసలను తెచ్చి ఇవ్వానా బంగారు హారాలు కావాలా, కంచి నుంచి పట్టు చీరలు తెప్పించిన అనే గొప్ప కబుర్లు చెపుతారు. మా ఊరు పెళ్లి బట్టలకి పిల్లని పంపండి, నచ్చిన నగలు చీరెలు కొంటాం అంటారు. అవేమీ అవసరం లేదు మీకు నచ్చిన బట్టలు నగలు మీ స్తోమత కొద్ది, మీ ఇష్టం కొద్ది పెట్టండి. పెళ్లి తరువాత దాని ఇష్టాలు మీ ఇష్టలుగా మార్చుకుంటుంది అనేవారు పెద్ద వాళ్ళు అంతా అదే పద్దతి. పెళ్లికి ముందు అత్తింటికి పంపరు. పెళ్లి తరువాతే పంపుతారు. మళ్ళీ పెళ్లి అనగానే అమ్మ, నాన్న అక్క బావ ఇష్టము. వాళ్ళకి నచ్చాలి మా బావ మా ఇంటి పెద్ద. మా నాన్నకి పెద్ద కొడుకు ఇంటి భాధ్యతలు చూస్తారు. అని గొప్పగా వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని చెపుతారు. మరి వీళ్ళ పిల్లకి భర్త అంతేగా అల్లుడు అత్తనీ, మరదళ్లనీ బావమరుదులని జాగ్రత్తగా చూడాలి అనే భావన ఉండదు. ఎంత సేపు వారి గొప్పలు చెప్పుకొంటున్న పద్దతి ఇప్పటికే ఇంతే పెళ్ళిళ్ళలో మార్పులు అంతర్గంగా ఉన్నాయి. పేర్లు మారాలి మాకేమి వద్దు పిల్లలకి పెట్టండి అంటారు. పిల్లలు అంటే ఆడపడుచులు, మరుదులు, పెళ్ళికొడుకుకి అన్ని ఘనంగా పెట్టాలి. వాళ్ళు పిల్లకి ఏమి ఘనంగా పెట్టనవసరంలేదు, ఏవో చీరలు ఒక నగపెట్టీ దాన్ని అసలు స్థిరంగా ఉండానీ. అప్పుడు చూద్దాము అంటూ, హా చూద్దాము అంటారు. ఇప్పటికీ అదే పద్దతి నడుస్తోంది. రామనాధం పెద్ద పిల్లకి బంధువులు అబ్బాయి పెద్ద చదువు చదివాడు అని కుదిర్చారు పోని వాళ్ళు పై వాళ్ళు కాదు. మరదలికి దగ్గర బంధువు, ఆస్తి ఉంది అన్ని బాగున్నాయి అనే భావనతో పెళ్లి వరకు వచ్చింది. ఈ లోగా రామనాధం కంటే డబ్బు ఉన్నవాళ్లు పదిహేనేళ్ల వయసు తేడాలో పిల్లని చెప్పారు అంతే డబ్బుకి ఆశాపడి..కుదుర్చుకున్న సంబంధం వదిలి ఆ పిల్లని చేసుకున్నారు. అప్పటికి అప్పుడు రామనాధం దూరం సంబంధం కోసం కింద మీద పది పడి ఏరుగున్న వాళ్ళు అందరినీ కూడా సంప్రదించి మొత్తనికి మంచి సంబంధం ఆస్థి పరుడు, పెద్ద ఉద్యోగి ఐపి ఓస్ సర్వీస్ గ్రేడ్ వన్ ఆఫీసర్ నీ పట్టితెచ్చి పెళ్లి చేశాడు. ఐదు రోజుల పెళ్లి ఘనంగా పెద్ద ఆఫీసర్ ని చేశాడు. అయితే పిల్లాడు కొంచెం రంగు లేడు తక్కువ. కాకి ముక్కుకు దొండ పండు అంటూ పెళ్లికి వచ్చిన వాళ్ళు పెదవి విరిచారు. రకరకాల విమర్శలు. అయితే మొదటి సంబంధం పిల్లాడి తెలుపు కానీ స్వభావం అంతా మంచిది కాదు, నాలికకి నరం లేదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారు. అయినా పెళ్లికొడుకు ఉద్యోగంతో పాటు వెనుక ఆస్థి ఉండాలి అని భావన ఉండేది.. ఇప్పడు అసలు మంచి స్వభావం, మంచి సాలరీ వున్న పెళ్లి కొడుకు దొరకడం ఎంతో కష్టంగా ఉన్నది. ఎలా అయితే పెద్ద పిల్ల పెళ్లి అయ్యింది. అందుకే కొన్నాళ్ళు ఆడపిల్లలు వద్దు అనుకుని కొన్ని కుటుంబాలలో కేవలం మగపిల్లాలకి ఓటు వేసి మగపిల్లలను కన్నారు. ఈ తరంలో ఆడపిల్లలు చాలా మంది తక్కువ అయ్యారు అనుకున్నారు. ఎందుకు ఒక తరంలో వేధించిన సమస్య ఇంకో తరంలో వేరే రకంగా మారీ పోతుంది. రెండవ పిల్ల పెళ్లికి ఇంక బంధువులు పెత్తనం చెయ్యాలని ఆశా పడ్డారు. కానీ అలాగే కొంత అవకాశం తీసుకుని పెత్తనం చేశారు. ఇంకో పిన్ని భర్త బావ వరుస వారికి పెళ్లి కుదిర్చారు. కానీ ఆ బావ అన్నగారు, నా బావ మరిదికి చేస్తే చెయ్యాలని మళ్ళీ నా తమ్ముడుకి కుదిర్చారు అంటూ పెళ్లికి ఒప్పుకోలేదు చివరకి అంతా సర్ధి చెప్పి పిల్లాడు మంచి వాడు పది ఎకరాలు ఉన్నది. పిల్లని బాగా చూస్తాడు అంటూ పట్టు పట్టి దగ్గర సంబంధ పుర్ణకి వెలు విడిచిన తమ్ముడు అన్నారు. సరే నలుగురు బావగారులు ముగ్గురు ఆడపడుచులు ఉన్నారు. అందరికీ బాగా ఘనంగా లాంఛనాలు పెట్టీ ఐదు రోజులు పెళ్లి చేసి పంపండి అన్నారు. ఆ రోజుల్లో రెండు వందల మందికి భోజనాలు, బోట్లు అన్నారు. అన్ని బాగానే చేశారు సమర్థత ఉన్న రామనాధము గారు. సరే మనుష్యులను సజావుగా బ్రతక నీవ్వరు ఉమ్మడి కుటుంబంలో పిల్లని చెయ్యడం అంతా బుద్దితక్కువ ఇంకొకటి లేదు అందులో ఆఖరు తమ్ముడు. అందరూ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. అలా ఆలోచించి పంపారు. కానీ ఈ సంబంధం తప్పలేదు విధి వ్రాత అయిన రెండో పిల్లకిసుఖం లేదు. అక్కడికి సారి పెట్టీ పంపారు. అంతా విచిత్రంగా ఆ పిల్లని పట్టించుకో లేదు చివరికి కట్టుకున్న భర్త సహితం అత్త ఆడపడుచు మాట వింటాడు. భార్య మాట వినలేదు, పట్టించుకోలేదు. దానితో ఓ రెండు నెలలు ఉండి వచ్చింది. రామనాథము గారు విషయం తెలుసుకుని పిల్లని ఇంటిదగ్గర ఉంచేసారు. అల్లుడిని రమ్మన్నారు అయిన సంబంధం చేదోడు వాదోడుగా ఉంటాని పెళ్లి చేశాను, నువ్వు నీ వాళ్ళ మాటలు నమ్మి పిల్లను భాధ పెట్టవు. ఏ నాడూ ఏ సంబంధం లేని పెద్దమ్మ పిల్లలు, పినతల్లి పిల్లలు మాట పట్టుకుని నా పిల్లలు మనసు భాద పెట్టవు అన్నాడు. ఆ పెళ్లి కుదిర్చిన పెద్దల్ని పిలిచి విషయం చెప్పి అల్లుడిని ఇక్కడే ఉండేలా మాట్లాడించారు. ఏ కళను ఉన్నాడో వాప్పుకుని వచ్చి మామ గారు వ్యవసాయం చేసేవాడు. బావు మరుదులు ఇంకా చదువు కుంటున్నారు. పూర్వం పెద్దల మాట కుటుంబాలు సరిదిద్ద బడేవి. ఇప్పుడు ఎవరూ ఎవరి మాటా వినరు. రామనాథము గారు ఇద్దరు ఆడ పిల్లల్ని ఆహ.. అనేలా చూసుకున్నారు. పెద్ద అల్లుడు మంచివాడు. ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. చిన్న అల్లుడు దూర్వాసుడుకి వారసుడు అందుకే ఆయనే అన్ని చూసుకుంటాడు. రెండో పిల్లకి ఒక ఆడపిల్ల బుద్ది మంతురాలు. సంస్కృతం చెప్పిస్త అంటే వద్దు అని అమ్మమ్మ డాక్టర్ చదివించారు. అంతే సంగీతం కూడా బాగా నేర్పించి కచేరీలుకి పంపేవారు ప్రత్యేకంగా శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు బాగా పాడి, బహుమతులు తెచ్చుకునేధి, పిల్ల ఎదుగుదల చూసి పెద్దలు సంతోషించారు. ఆడపిల్లకి సంబంధాలు ఎదురు వస్తున్నాయి. కానీ పెద్ద పిల్ల పిల్లలు ఇద్దరు మంచి చదువులు చదివిన పెళ్లి కూతుళ్ళు దొరకడం లేదు. కారణం ఒక తరంలో ఆడపిల్లల్ని వద్దు అనుకోవడమే మగాడి పెళ్లి కష్టం గానే ఉన్నది. ఇదండీ రామనాథము గారు కుటుంబము ఆయన కొడుకుకులకి ఎలాగో పెళ్లి చేసి భార్యల ఇష్ట ప్రకారం ఉద్యోగం ఊళ్లలో ఉన్నారు. కనుక సమస్య లేదు  కట్నం లేకుండా కోడళ్లను ప్రేమగా చేసుకున్నారు. అది ఒక మంచి మార్పు కూతుళ్ళ పెళ్లి విషయంలో ఎన్నో భాధలు పడ్డ పూర్ణ మనుమల విషయంలో పెంపకంలో జాగ్రత్త వహించిన మగ పిల్లలు పెళ్లి ఈ తరంలో కష్టం అంటుంది. ఆ పిల్ల తల్లి తండ్రిని చూసుకుంటోంది. ఇక్కడ చెప్పేది ఏమిటి అంటే పూర్వకాలం పెద్దలకి విలువ ఇచ్చేవారు. కనుక కుటుంబాలు సద్ది పంపేవారు. ఇప్పుడు అటు ఇటు తిక్క మనుష్యులు ఎవరి మాట ఎవరూ వినరు. కానీ పెద్దల మాట సర్ధిమూట కనుక కొంచెం పెద్దల సలహాకు విలువ నిచ్చి ఆలోచిస్తే ఇది మంచి మార్పు కదా అందుకే మంచిది అవేశం కాదు మంచి ఆచరణ ఆదరణ ముఖ్యము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!