తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు

తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు

రచన: సిరి.యం

సాహితీ ,చందు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు పక్క పక్క ఇళ్ళల్లో నే ఉన్నారు … రెండు ఫ్యామిలీస్ కలిసి మెలిసి ఉన్నారు …. సాహితీ ,చందు ఓకే స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు ….

వీళ్ళవి మధ్యతరగతి కుంటుబాలు … సాహితీ కి కొంచెం డబ్బు మీద ఆశ ఎక్కువగా ఉన్నదిది .. స్కూల్లో కూడ డబ్బు ఉన్నా పిల్లలు తోనే స్నేహం చేసేది …. చందు తో స్కూల్లో సరిగా మాట్లాడేది కాదు చందు సాహితీ నీ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు….

స్కూల్ చదువులు అయి కాలేజీ కి వెళ్ళడం మొదలు పెట్టేరు.. చందు కి ముందే చెపుతుంది మన ఇద్దరం కాలేజీ లో ముందే తెలిసినట్లు ఉండకూడదు అని …. దానికి సరే అని చెప్పి క్లాస్ కి వెళ్ళేరు….

ఫస్ట్ డే అందరూ క్లాస్ లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటే ఎక్స్క్యూజ్మీ అని ఒక అందమైన యువకుడు వచ్చాడు …. యస్ అనగా లోపలికి వచ్చి తన పేరు వసంత్  అని చెప్పేడు ఆడపిల్లలు అందరూ వసంత్ వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళల్లో సాహితీ కూడా ఉంది….

వసంత్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాడు … ఆడపిల్లలు ఎప్పుడు వసంత్ చూట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు సాహితీ మాత్రం చూసేది కానీ ఎప్పుడూ మాట్లాడేది కాదు అలా ఫస్ట్ ఇయర్ గడిచింది…..

చందు కి సాహితీ పట్ల స్నేహం ప్రేమగా మారింది … చందు కి తెలుసు సాహితీ కి డబ్బు మీద ఉన్నా వ్యామోహం చూసి చాలా సార్లు చందు కి చెప్పి చూశాడు డబ్బు ఉంటే సుఖం ఉంటుంది అనుకొవడం తప్పు అని….. కానీ చందు మాట లెక్క చేసేది కాదు సెకండ్ ఇయర్ లో వసంత్ సాహితీ తో మాట్లాడటం మొదలు పెట్టేడు …..

వసంత్ కి ఉన్నా అందం డబ్బు చూసి వసంత్ నీ ప్రేమించింది… కానీ తనంట తాను వెళ్ళి ఎప్పడు మాట్లాడేది కాదు … వసంత్ తన దగ్గర వచ్చి మాట్లాడాలి అని అనుకొని వసంత్ నీ దూరం నుంచి చూస్తూ ఉంది…. సాహితీ చాలా అందంగా ఉంటుంది అందుకే తోనే వచ్చి మాట్లాడుతాడు అని ధీమా గా ఉండేది…

తను ఆశించినట్లు వసంత్ తన దగ్గర కు వచ్చి మాట్లాడేసరికి తన ఆనందానికి అవదులే ఉండవు…. చందు కి వసంత్ మీద మంచి అభిప్రాయమే ఉండదు … సాహితీ వసంత్ తో మాట్లాడటం చందు కి ఇష్టం లేదు …..

ఒకసారి సాహితీ తో చెపుతాడు అతనిని చూస్తే అంతా మంచి గా  అనిపించడం లేదు జాగ్రత్తగా ఉండు అని చెప్పేడు…. అలా చెప్పాడు అని చందు తో మాట్లాడటం మానేసింది…
కాలేజీ కి కూడ కలిసి వెళ్ళేది కాదు ఇంట్లో అడిగితే ఎదో ఒకటి చెప్పింది…..

వసంత్ తో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది ఎంతలా అంటే క్లాసులకు కూడా వెళ్ళకుండా సినిమా లు షికార్లు అని తిరుగుతూ ఉండేవారు …. వాళ్ళు ఎక్కడకు వెళ్ళినా చందు వాళ్ళకి తెలియకుండా ఫాలో అవుతూ థియేటర్లో ఏదైనా  పిచ్చి వేషాలు వేయబోతే వాళ్ళ వెనుక ఉండి అలా చేయకుండా చేసి సాహితీ నీ జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు….

ఒకరోజు వసంత్ తన బర్త్ డే అని గెస్ట్ హౌస్ లో పార్టీ అని చెప్పి రమ్మన్నాడు సాహితిని ….ఆ విషయం చందు కి తెలలిసింది…. సాహితీ ఇంట్లో ప్రెండ్ బర్త్ డే పార్టీ వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళింది…..

చందు సాహితీ నీ ఫాలో అవుతూ వెళ్ళేడు …. సాహితీ గెస్ట్ హౌస్ దగ్గర అటో దిగి లోపలికి వెళ్ళి హాల్లో చూస్తే ఎవరు ఉండరు … వసంత్ డోర్ బంద్ చేసి వెనుక గా వచ్చి సాహితీ నీ కౌగిలించుకున్నాడు ….

సాహితీ ఉలిక్కిపడి వెనుక కు చూసేసరికి వసంత్ నవ్వతూ ఉంటే “పార్టీ అన్నావు ఎవరు లేరు ఏమిటి వసంత్” ” నా ప్రియమైన నీకు మాత్రం మే పార్టీ ఇస్తున్నాను ఎందుకో తెలియదు నీ ఒక్క దానితో చేసుకోవాలి అనిపించింది అందుకే ఎవరిని పిలువలేదు అనేసరికి అనందపడింది…

ఫస్ట్ కూల్ డ్రింక్ తాగుదాం అని కూల్ డ్రింక్ ఇచ్చాడు సాహితీ కూల్ డ్రింక్ తాగి మైకం గా వసంత్ దగ్గరకు వచ్చింది …. తనకు కావాల్సింది ఇదేగా అన్నట్లు నవ్వుకొని “ఏమిటి సాహితీ ఏమైంది” …

ఏమో తెలియదు వసంత్ నా ఒళ్ళంతా గాలి లో తెలుతున్నట్టు ఉన్నది ఎదో కావాలనిపిస్తుంది వసంత్ ” ” నవ్వుకుంటూ ఏమి కావాలి ” ” వసంత్ దగ్గరకు వచ్చి కౌగిలించుకుని ముద్దులు పెడుతూ ఉంది అప్పుడే లోపలికి వచ్చిన చందు సాహితీ నీ లాగి చంప మీద కొట్టేడు …..

కొంచెం తెలివి వచ్చిన సాహితీ కి తాను ఏమి చేయబోయిందో గుర్తు కు వచ్చి  చందు నాకు ఎదో అవుతుంది నాకు  ఏమి తేలియడం లేదు అని చందు నీ పట్టుకొని ఏడ్చింది….

చందు నీ సోఫా లో కూర్చోబెట్టి వసంత్ దగ్గరకు వచ్చి “నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్ల తో ఇంతా నీచంగా ప్రవర్తిస్తావా  నువ్వు అసలు మనిషి వేనా అని తన్ని ఇంకొక సారి సాహితీ తో మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి సాహితీ నీ  తీసుకొని బయటకు వచ్చాడు …..

సాహితీ నీ  ఈ పరిస్థితుల్లో ఇంటికి ఎలా తీసుకు వెళ్ళాలి అని ఆలోచించి ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఈ నైట్ నీ రూమ్ లో ఉంటాను రా అని ఆడిగేడు…. అలాగే చందు నేను పని ఉండి ఊరి కి వచ్చాను రూమ్ కీ ఎక్కడ పెట్టేడో చెప్పి  ఫోన్ పెట్టేడు …

సాహితీ నీ తీసుకొని రూమ్ కి వెళ్ళేడు … సాహితీ వసంత్ ఇచ్చిన డ్రగ్ ప్రభావం తో చందు నాకు ఎదో లాగా ఉంది నాకు ఎదో కావాలి అనిపిస్తుంది  నా బాధ తీర్చు అని మైకం గా అంటుంటే  చందు కి బాధ తో కన్నీళ్లు వస్తే  తుడుచుకొని సాహితీ నీ పట్టుకొని  ఇంకా రెండు గంటలు ఓర్చుకో తగ్గి పోతుంది …ఈ లోపు  నేను మనం చిన్నప్పుడు చేసిన అల్లరి చెపుతాను  మనం కొట్టుకోవడం అలగడం అని కబుర్లు చెపుతూ మైండ్ డైవర్ట్ చేస్తూ మధ్య లో సాహితీ చేసే పనులతో తనని తాను కంట్రోల్ ఉంచుకొని ఆ రాత్రి గడిపేరు….

ఆ తర్వాత  సాహితీ లో చాలా మార్పు వచ్చింది  వసంత్ నీ చూస్తే చాలు పురుగు నీ చూసినట్లు చూసేది ….. చందు తో ప్రేమగా ఉంటూ కాలేజీ పూర్తి చేసి మంచి జాబ్ లో జాయిన్ అయి ఒక శుభముహూర్తాన పెళ్ళి చేసుకున్నారు …..

నైట్ రూమ్ లోకి వచ్చిన సాహితీ “చందు కాళ్ళ కి దండం పెడుతుంటే లేపి ఏమిటి సాహితీ ఇది” ..”నా జీవితాన్ని కాపాడినందకు చందు”  … “నువ్వు లేకపోతే నేను ఏమైపోయాదానినో ” “నువ్వు నా ప్రాణం సాహితీ అలాంటిది నా ప్రాణాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోలేనా ”  ” చందు నేను నిన్ను అర్ధం చేసుకోలేక పోయాను”

” ఇప్పుడు కూడా” ” ఇప్పుడా” ” టైం అంతా మాటలేనా ఆ రోజు వద్దు వద్దు ‌అంటే నన్ను ఉక్కిరిబిక్కిరి చేశావు ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా”  ” ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోమని చెప్పానా ” అని అనేసరికి సాహితీ అంటూ కౌగిలించుకున్నాడు…

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!