అక్షర కాగడాలు

అక్షర కాగడాలు

రచన: మక్కువ. అరుణకుమారి

క్షరం కానివి అక్షరాలు
ఆ అక్షర కూరుపులు భాషకు మేలుకొలుపులు

అక్షరాలు లక్ష మెదళ్ళకు కదలికలు
అజ్ఞానాంధకారాన్ని తరిమేసే ఉషఃకిరణాలు
విజ్ఞాన జ్యోతులు ప్రసరించే ప్రగతి కాగడాలు

అక్షరం కురిపించు అంతులేని భావాలు
అక్షరం పలికించు సప్తస్వర రాగాలు

అక్షరం మెరిపించు జ్ఞానశకలాలు
అక్షరం విరియించు విజ్ఞాన వీచికలు

అక్షరం సాగించు అంతరిక్ష పయనాలు
అక్షరం నడిపించు జాతి భవితవ్యాలు

అక్షరం మురిపించు ఘనమైన చరితలు
అక్షరం వెలిగించు వేవేల భవితలు

మదిలో మెదిలే అక్షరాలు అనాకారాలు
కలంపట్టి కాగితంపై లిఖిస్తే అపురూప కావ్యాలు

అక్షరాలు ముందు వెనుక పదునున్న కరకు ఆయుధాలు
అక్షరాలు భావవ్యక్తీకరణకు సొగసైన సాధనాలు

అపరిచితులను ప్రాణమిత్రులుగా మలిచేవి
జ్ఞానుల మధ్య పోటీతత్వం పెంచేవి

అభినందనల వెల్లువలో ముంచేత్తెవి
కోపాల కొరడాలు ఝుళిపించేవి
ముందున్న ముళ్ళబాటలో పూలగుత్తులు పరిచేవి
అక్షరాలు

*********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!