నేతన్నకు వందనం

 

నేతన్నకు వందనం

రచన: డాక్టర్ అడిగొప్పుల సదయ్య

భావనాఋషి పాద పద్మముల నెదగొలచి
మగ్గమున మడి నేసి మానరక్షణ చేయు

ఎర్రకోట శిరమున ఎగిరే పతాకమా!
భరతాంబ గళసీమ బంగారు పతకమా!

కటిక చీకటి యందు కరువు కోరల జిక్కి
అతుకు గతుకుల చితికి మెతుకు కోసము వెతుకు

నేతన్న! నీబతుకు నెవరు మార్చేరన్న?
ఏమిచ్చి నీ ఋణము మేము తీర్చేమన్న?

అలివేలి మంగమ్మ అన్నదమ్ములు కదా!
ఆడబిడ్డా సొమ్ము ఏడ యందును మీకు?

నీవు నేసిన బట్ట నేనేసుకుంటేనె
నీఋణము తీరేను నీబతుకు మారేను!

పాకచెక్కల తొక్క పాదములు కందేను
పోగుపోగులనతుక పోయేను నీచూపు

రెక్కలే చక్రమై డొక్కయే ఇంజనై
ఊపిరింధనమయ్యి ఉరికితే వస్త్రమై

పడుగు పేకల నడుమ పడి దుప్పటైతివే!
కండెలకు నీకండ కరిగించి పోస్తివే!

నాడె నాదములోన నాడులేకముచేసి
మేలిచాట్లు నేసే సాలెన్న వందనమ్…

You May Also Like

One thought on “నేతన్నకు వందనం

  1. నేతన్నల వెతలను అత్యంత హృద్యంగా అక్షరమాలలో మలిచిన మీ కలాకౌషలానికి అభినందనలు డా సదయ్య గారు 🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!