ప్రేమ

ప్రేమ

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

రెండు మనసుల కమనీయ
దృశ్యకావ్యం ప్రేమ

రెండు హృదయాలను
దరిచేర్చి ఒకటిగా ముడివేసే
బంధమే ప్రేమ

లోకాన్ని సరికొత్తగా చూపించేదే ప్రేమ
కాలాన్ని కనుమరుగు చేసేది ప్రేమ

ఇరువురి తనువులు వేరైనా
మనసులను జత కలిపే బంధమే ప్రేమ

ఇరువురు జీవితాల్లో వసంతంలా సరికొత్త తలపులను నింపునది ప్రేమ

ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ క్షణాలను యుగాలుగా తలచి  మదిలో గుబులురేపునది ప్రేమ

ఇరువురు తనువులు వేరైనా రెండు మనసుల ప్రణయమే ప్రేమ

ఈ కలయిక లో జీవన పయనాన్ని సాగిస్తూ హరివిల్లుల  రంగులను అద్దుతూ
ఇరువురి మదిలో  నిండే కావ్యమే ప్రేమ.

***********

You May Also Like

2 thoughts on “ప్రేమ

  1. సూపర్…. ప్రేమ ఔన్నత్యాన్ని చాలా ఆహ్లాదంగా వివరించిన తీరు అద్భుతం. ధన్యవాదములు అండీ.. 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!