కప్పు కాఫీ

కప్పు కాఫీ

రచన: నెల్లుట్ల సునీత

ప్రతి ఉషోదయాన్ని స్వాగతిస్తూ
అందరి మనసు ఉత్తేజపరుస్తూ
జీవిత గమనములో భాగమై
ఆత్మీయ పలకరింపుతో ఆహ్వానం పలుకుతూ……
విశ్వ జగత్తును మేల్కొలుపుతుంది కాఫీ కప్పు.

బద్దకాన్ని దూరం చేస్తూ
మధురామృతమే నోటికి అందిస్తూ
మనసును ఆహ్లాద పరుస్తూ
ఊసులెన్నో మోసుకొస్తూ
కప్పు కాఫీ కలుపునెన్నో బంధాలు

వికాస జ్ఞాన నిథి గా
సృజనాత్మకతను  ప్రోదిచేస్తూ
కొత్త ఆశయాలకు పునాది వేస్తూ
ఉజ్వల భవిష్యత్తుకు
ప్రణాళికల వారధిగా
ఆనందోత్సాహాల ఇంధనమై నిలిచింది కాఫీ కప్పు

శ్రమలో విశ్రాంతినిస్తూ
అలసటలో స్వాంతన నిస్తూ
నిరాశ నిరాసక్త  జడత్వాన్ని కడిగేస్తూ
కొంగ్రొత్త ఊహలను అలంకరించుకుని
నవనవొన్మేశంగా కవన కలువల్ని వికసింపజేస్తుంది.

చిరాకుల్ని పారద్రోలుతూ..
మనసును తేలిక పరిచి
కొందరికి ఉపాధి అవుతూ
చైతన్య స్ఫూర్తినిస్తూ
జీవితానుభవాల ప్రతీకగా
నిలిచింది కప్పు కాఫీ

అతిథులకు ఆతిథ్యమిస్తూ
తేనీటివిందులలో బహు పసందుగా
మర్యాదలకు మహా సాటి
ఓ.కప్పు కాఫీ నే…

రకరకాల హంగులతో
కొత్త పేర్లు ట్యాగ్ లతో
నేడు కొత్త ముస్తాబుతో
గల్లీ గల్లీలో కాఫీ సెంటర్లలో దర్శనమిస్తుంది.

వేడివేడిగా గొంతు దిగందే
ఆణిముత్యాల్లాంటి ఆలోచనలు రావు మరి..
ఏంటో…. దీని రహస్య నిధి..
కప్పు కాఫీ తోనే గమ్యం చేరుకోవాలి
లక్ష్యాల తరంగాలను సృజిస్తూ…..
అవును కదూ……..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!