ఓ పిల్ల తుమ్మెర

ఓ పిల్ల తుమ్మెర

రచన: కార్తిక్ నిమ్మగడ్డ

మౌనానికి పలుకులు నేర్పాను…
తన మాటలై నాకు సంగీతంలా మారింది
చుక్కలకి మెరుగులు అద్ధ…
అవి తన కనులై నా మనసు దోచుకున్నాయి
ఇంద్ర ధనుస్సుకి చిలిపితనం అంటించా…
అది తన చిరునవ్వు అయ్యి నన్ను మత్తులో ముంచింది
గాలికి విరహాన్ని పరిచయం చేసా…
అది నన్ను కూడా వద్దని తనని చేరి తన ఊపిరిగా నిలిచిపోయింది
నెలవంకకి సొగసును పూస….
తన నడుము వొంపు అయ్యి హొయలు పోతుంది
చీకటిని పొట్లంలా కట్టా…
అది తన ఒంటిపై పుట్టుమచ్చ అయ్యి గొప్పలు పోతుంది
పచ్చదనానికి పసుపు రాశా…
తన మేని పై కోకలా మారి తనతోనే ఉండిపోయింది
ఆ చిరుజల్లులకి అల్లరి నేర్పా…
అది తన మేని పై స్వేదమై నన్నే ఆట పట్టిస్తుంది
ప్రేమకి ఓ రూపం ఇచ్చి చూసుకోవాలి అనుకున్న..
ఆ ప్రేమ తనలా మారి నన్ను తన ప్రేమ కోసం పిచ్చోడిని చేసింది.

You May Also Like

9 thoughts on “ఓ పిల్ల తుమ్మెర

  1. ఎంతమంది కొత్త కవులు పుట్టుకొచ్చిన మీరు రాసే స్టయిల్ ఇంకెవరికి రాదండి మీ రచన శైలి చాలా ప్రత్యేకం మరియు అద్భుతం❤️❤️❤️

  2. Wow సర్ చాలా చాలా బాగుంది. మీరు ప్రేమకి అద్దిన రంగులు👌👌👌👏🏻👏🏻💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!