మాతృమూర్తి

మాతృమూర్తి

రచన::చెరుకు శైలజ

లక్ష్మికి ఏమి అర్థం కావడం లేదు .మనసు అంతా అల్లకల్లోలంగా వుంది .ఇంటి ముందు అరుగు మీద తన అవిటి వాడైన కొడుకు పక్కన కూర్చుని వుంది.ఇంక వారం రోజుల్లో ఈ ఇంటిని ఈ ఊరుని వదిలి వెళ్లి పోవాలి. అదే తట్టుకోవడం కష్టంగా వుంది. పైగా తన కొడుకుని వికలాంగుల ఆశ్రమం లో వుంచి తాను తన ఇద్దరి కొడుకుల దగ్గర తన మిగితా జీవితాన్ని గడపాలి. అదే ఆలోచిస్తుంది.రవి మనం ఇల్లు విడిచి పోతున్నాం తెలుసా , నీకూ ఆశ్రమం లో వుండడం ఇష్టమేనా, అని అడిగింది .కొడుకు భుజం మీద చేయి వేసి, ఇష్టమే అన్నట్లు నవ్వుతూ తల వూపాడు. అక్కడ నేను వుండను. నువ్వు వేరే వాళ్ళ తో కలిసి వుండాలి. నేను అన్నయ్య దగ్గర వుంటాను. వారం రోజులకు ఒకసారి వస్తాను అంది. సరే అంటూ చెయ్యి తో సైగ చెశాడు. నీకు బాధగా లేదా, రవి అలా వుండడం అంది. ఏమి లేదు. నువ్వు హాయిగా వుండు. రెస్టు తీసుకో, ఇన్ని సంవత్సరాలు నాకు చేసింది చాలు, అంటూ సైగ చేస్తు తల పట్టుకున్నాడు.ఆ మాటలకు లక్ష్మి కండ్ల లో నీళ్ళు తిరిగాయి.ఇలాంటి పరిస్థితి వస్తుంది.అని తను ఎప్పుడూ అనుకోలేదు. తనకి ముగ్గురు కొడుకులు ఒక కూతురు . అందరికి పెళ్లీళూ అయ్యాయి. భర్త వెంకట్ రావు ఊరిలో వ్యవసాయం చేస్తాడు. పెద్ద ఇల్లు విశాలంగా వుంటుంది. పెద్దకొడుకు రాము హైదరాబాద్ లో గవర్నమెంట్ జాబ్ రెండో కొడుకు వాసు డిల్లీ లో ఉంటాడు.తరువాత కొడుకు రవి అవిటి వాడు.నడవలేడు మాట్లాడలేడు.తను గర్భవతిగా వున్నపుడే కడుపులోనే పోలియో వచ్చింది.ఇంక కూతురు ఉష చిన్నది. పెళ్లి అయింది. వైజాగ్ లో వుంటుంది. రవి పుట్టాక, కొడుకు మాట్లాడం లేదు, అని నడవడం లేదు అని ఎంతో దిగులు పడేది.వెంకట్రావు ఎంతో డబ్బు ఖర్చు మంచి వైద్యం చేయించారు. ఇంకా ఆయుర్వేదం కూడా వాడారు. . ఎన్ని చేయించిన ఫలితం లేక పోయింది. ,ఇంకా అన్ని పనులు చేయడానికి ఒక మనిషిని పెట్టారు. అది పల్లెటూరు కాబట్టి, పని చేయడాని మనిషి దొరికాడు.ఇంక ముందు ముందు ఎలా వుంటుందో, ఒకరోజు లక్ష్మి ,భర్తతో ఏమండి, రవిని ఏదైనా ఆశ్రమంలో వేద్దాం అంది .వీడు పెరుగుతున్నడు కదా, మనం విడిని తీసుకొని ఎటు పోకుండా ఎన్నాళ్ళు ఇలా, .ఎవరి ద్వారా నైన వివరాలు తెలుసుకొండి అంది. వాడిని ఎక్కడ వేసేది లేదు. మనతోనే వుంటాడు. పిల్లలు తల్లిదండ్రులకు బరువా ,అసలే దేవుడు వాడికి అన్యాయం చేశాడు. ఇంకా మనం కూడా వాడిని బాధ పెట్టాలా, అన్నాడు. మరి మనం వున్నంత కాలం, వాడిని బాగానే చూస్తాం. ఆ తర్వాత అంది . అప్పుడు ఆ దేవుని దయ ఎలా వుంటే అలాగే జరుగుతుంది . ఇంకా ఎప్పుడు నా దగ్గర ఆ ప్రస్తావన తెవద్దు.అలాగే హాయిగా వాడితోనే లోకం గా బతికారు. మిగితా పిల్లలు సెలవులకు, పండుగలకు వచ్చి వెళ్లెవాళు. వాళ్ళు ఎక్కడైనా ముఖ్యమైన ఫంక్షన్ వుంటేనే రవితో ఒక సహాయ మనిషిని పెట్టుకొని బయలుదరేవాళ్లు. అలా వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. వెంకట్ రావు గుండె పోటుతో పోయారు. ఇంకా ఎడారిలా అయిపొయింది లక్ష్మిజీవితం .ఆయన లేని లోటును భరిస్తు,ఆయనతో వున్న జ్ఞాపకాలతో బతుకుతూ, తన కొడుకు రవి తోనే జీవితం అనుకుంటు ఇన్ని సంవత్సరాలు వుండ గలిగింది. ఒకరోజు రాము, అమ్మ ఇంకా నువ్వు ఇక్కడే వద్దమ్మ, రవిని ఆశ్రమం లో వెద్దాం అన్నాడు. ఆ మాటలు వినేసరికి లక్ష్మి గుండెలో ఒకేసారి ఏదో తెలియనిబాధ కలిగింది.ఏం అమ్మ మాట్లాడవు అన్నాడు. ఏం మాట్లాడాలి రా నేను ఇది ఊహించుకోలేక పోతున్నాను. ఇప్పుడు మాకెం అయిందని ఈ నిర్ణయం అంది. కదమ్మా ,నువ్వు కూడా ఇప్పటికీ వరకు వాడి కొరకు ఎటు వెళ్ళాకుండ వుండిపోయావు. నీకు చేతకాకుండ అయితే వాడికి ఎవరు చేస్తారు. నువ్వు ఇప్పుడే వాడిని ఉంచడం అలవాటు చేస్తే ఇద్దరికి మంచిది. వాడికి వుండడం అలవాటు అవుతుంది. నువ్వు అందరి దగ్గర కు ఫ్రీగా తిరగచ్చు, అన్నాడు . నాకు అలాంటివి ఏం లేవు. రా, వాడితో నేను సంతోషం గానే వున్నాను..నీకు ఎలా చెప్పాలి. అర్ధం చేసుకో,అమ్మ అని పట్టుబట్టాడు. రెండో కొడుకు వాసు కూడా అన్న చేసిన పనికి ఏకిభవించాడు. నువ్వు మధ్య మధ్య మా దగ్గరకి ఏ బాధ లేకుండా రావచ్చమ్మ అన్నాడు. రెండో కోడలు రమ్య కూడా అత్తయ్య ఇంకా ఎన్నిరోజులు ఎటు పోకుండా బాధపడతారు. హాయిగా మీరు చేతనేనన్ని రోజులు తీరుగో చ్చు అంది.కూతురు ఉష కూడ అన్నయ్య మంచి నిర్ణమే తీసుకున్నాడు అంది .ఇంకా నువ్వు ఏం ఆలోచించకు ఏమైతేనేం మీ నిర్ణయలే మీరు నాకేం అర్థం కావడంలేదు. తప్పదు అమ్మ .కొన్నిటితో మనసుని గట్టిగా చేసుకోవాలి హైదరాబాద్ లోనే కాబట్టి నువ్వు వారానికి వెళ్లి చూసి రావచ్చు. ఏం బాధపడకు అంది. అలా పిల్లలు ఇంకా తోబుట్టువులు , బంధువులు అందరు ఇది సరియైన నిర్ణయామే అన్నారు .దానితో ఇంకా లక్ష్మికి ఒప్పు కోక తప్ప లేదు. అమ్మ గారు ,అమ్మ గారు అంటు గట్టిగా పనిమనిషి సీతమ్మ పిలుస్తానే వుంది. ఆ ,ఏమిటే అంటు లక్ష్మి ఆలోచనల నుండి బయటకు వచ్చింది.అమ్మ గారు ఎప్పటి నుండి పిలుస్తానే ఉన్నాను . పని అంతా అయిపోయింది. ఇంక ఏమైనా వున్నదా చెప్పండి అంది . ఇంకా ఒక్కొక్క సామానులు సర్దుకోవాలి అంది. ఏమో, అమ్మ మీరు ఇడ నుండి పోతే అంటే మనసెంతో బాధగా వున్నది. మీరు పెట్టిన ,ఈ చెట్లు . ఏమాయిపోతాయి. ఇడనే వుంటే ,నేను మీతోనే అంటి పెట్టుకొని వుంట కదా,ఈ బాబు ఓ కాడ, మీరు ఓ కాడ, ఏమైనా చెప్పుండ్రి . నేను గట్టిగా పెద్ద బాబుతో చెప్పెదా అంది .లేదే అంతా అయిపోయింది. వాళ్ళు వినరు. నేనే వారానికి ఒకరోజు వచ్చిపోతుంటాను అంది. సరే అమ్మ, మీ ఇష్టం అంది.ఇంక తాను వెళ్ళే రోజు రానే వచ్చింది. రాము కారు తీసుకోని వచ్చాడు. అలాగే అన్ని సామానులు కొని ఎక్కువగా వున్నవి సీతమ్మకు ఇచ్చింది. వారం రోజుల ముందు నుండే కొన్ని కొన్ని వస్తువులు ఊరిలో అందరికి పంచి పెట్టింది.కారులో అన్ని బ్యాగులు పెట్టుకొని, కారు ఎక్కారు . ఉంటానమ్మా, అప్పుడు అప్పుడు రండి అంది. సీతమ్మ.సరేనే నువ్వు జాగ్రత్త అంటు చెయ్యి ఊపింది.మనసులో ఏదో తెలియని బాధ, ఇల్లుని వదిలి పెట్టి వెళ్ళి పోతుంటే పన్నెండవ ఏట పెళ్లి చేసుకొని వెంకట్రావుతో ఈ ఇంట్లో అడుగు పెట్టింది.అప్పటి నుండి ఈ ఇంట్లోనే ఎన్ని సంతోషాలు,దుఃఖాలు , అనుభవించింది. అరవై ఏండ్లకి అన్నింటిని వదిలి వెళ్ళిపోతుంది.రవి వెనుక కూర్చున్నాడు. తను ముందు కొడుకు పక్కనే కూర్చుంది . కన్నుల నుండి జల జల కన్నీళ్లు రాలుతున్నాయి.అమ్మ, ఏం మాట్లాడవు. మౌనంగా వున్నావు. అని కొడుకు అడిగాడు.ఏం లేదు. బాధగా వుందా, అన్నాడు. అలా అడిగేసరికి అనుకో లేనంతగా దుఃఖం వచ్చింది. కర్చీఫ్ అండం పెట్టుకుంది . ఊరుకో,అమ్మ బాధపడకు, ఏం చేద్దాం, కొన్ని మార్పులు తప్పవు అన్నాడు.తనకు తను తమహించుకొని కొంగుతో కండ్లు తుడుచుకుంది.కారు వచ్చి ఆశ్రమం ముందు ఆగింది . ఇద్దరు కారు దిగారు .ఆ ఆశ్రమం నుండి ఒక పెద్ద మనిషి బయటకు వచ్చాడు.రండి సారు మీ కోసమే ఎదురు చూస్తున్నాం,. అలాగే ఒక విల్ చేర్ తెచ్చారు అందులో రవిని కూర్చో బెట్టి ఆ మనిషి రూం దగ్గరికి తీసుకువెళ్ళారు. లక్ష్మి కూడా వెంబడే వెళ్లింది. రామ్ అన్ని సామానులు అక్కడ పెట్టి,నేను ఆఫీస్ లో డబ్బులు కట్టి వస్తాను, అంటు వెళ్ళాడు. లక్ష్మి ఆ రూంలో అన్ని పరిశీలిస్తుంది. గాలి, వెలుతురు విశాలంగా వుంది. రూంకి అటాచ్ బాత్ రూం.రెండు మంచాలు వున్నాయి. బెడ్ సిట్లు ఆ బెడ్ పైన వేసింది. రవికి పని చేయడానికి ఒక మనిషి వాళ్ళు పెట్టారు.ఆ రూంలో వాళ్ళు తెచ్చుకున్న సామానులు సర్దుతున్న ఆమెను నీ పేరు ఏమిటి? అని లక్ష్మి అడిగింది.నా పేరు మంగమ్మ అంది. మా బాబుని మంచిగా చూసుకో, అసలే నోరు లేదు. ఏం చేసుకో లేడు. అన్ని పనులు చెయ్యలి. అన్నం కలిపి పెడితే చెంచతో తింటాడు. సరే నమ్మ మీరే చూడండి ఎలా చేస్తానో అంది. అన్ని బ్యాగులు పక్కన పెడూతు, అమ్మ అయిపోయిందా, వెళ్దామా అన్నాడు. కొడుకు రాము. నేను రెండు మూడు రోజులు వుండి, వీళ్లకి అన్ని చెప్పి వస్తాను. సరేనమ్మా నీ ఇష్టం. ఏది కావాలి అంటే కాల్ చెయ్యి అన్నాడు.నేను వస్తాను. రెండురోజుల తరువాత అన్ని వెళ్లి పోయాడు . లక్ష్మి అలా బయటకు వచ్చింది.చాలా పెద్ద ఆశ్రమం. పచ్చని చెట్లతో, రక,రకాల పూలతో అందంగా వుంది. ఒక చిన్న దేవుడి గుడి కూడా వున్నది. అన్ని తిరుగుతూ చూస్తుంది బిల్డింగ్ మూడు ఫోర్లు. కింద ఈ పిల్లలు ఫిజికల్డీక్యాప్డ్ .మొదటి దానిలో వంటలు ,సిబ్బంది. మూడో అంతస్తులో ఈ ఆశ్రమం నడిపే భార్య భర్తలు . అంతా శుభ్రంగా వుంది . అమ్మ టీ తీసుకునేందుకు రండి అంటు పిలిచారు ఆఫీస్ మేనేజర్, సరే అంటూ ఆఫీస్ లో కూర్చుంది. టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే బాబుని మొదటి సారి వదిలి వుండడమా అన్నాడు. అవునండి, మీకు చాలా ఓర్పమ్మ ఇంతవరకు, మన బాబుకి మీరే సేవ చేసి చూసుకోవడం .మరి తప్పదు కదా, కన్నకడుపుకి అంది .ఎవరు చేస్తూన్నమ్మ ,ఈ కాలం ఓపికగా కొంచెం పెద్ద అవ్వగానే ఆశ్రమము లో వేసేస్తున్నారు. నా కొడుకుని వదిలి వుండడానికి నాకు ఇంకా మనసు వస్తలేదండి. అమ్మ .మీ కొడుకుతో పాటు చూశారు కదా,మిగితా 20 మంది వున్నారు.కొందరికి తల్లిదండ్రులు లేరు. వున్న వాళ్ళు వచ్చి చూసి పోతారు. .మీరు కూడా వారానికి వచ్చి చూసిపోండి.లేకపోతే మీకు ఇష్టమైతే మీరు కూడా మీ కొడుకుతో పాటు ఏదో ఒక సేవ చేస్తూ ఇక్కడ ఉండొచ్చు. మీ బాబుకి ఏం కష్టం రానివ్వం .మీరు ఏం బాధ పెట్టుకోకండి. ఇలాంటి ఆశ్రమం పెట్టాలని, ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎంతో ప్రేమ తో పెట్టారు. ఇందులో వాళ్ల బాబు కూడా వున్నాడు. సాయంత్రం గుడి లో పూజ అవుతుంది. అప్పుడు వాళ్ళు దిగుతారు. మీతో మాట్లాడుతారు అని చెప్పాడు. తను తిరిగి వచ్చి రూం కి వచ్చి నడుము వాల్చింది. .ఎలా వుంది రవి అని అడిగింది. రవి నవ్వుతూ నచ్చింది అని సైగ చేశాడు.తనకి కొంచెం తృప్తి అయింది. సాయంత్రం ,పూజ, ప్రారంభమయింది. ఆ ఇద్దరు భార్యాభర్తలు పార్వతి పరమేశ్వరు
లాగా వున్నారు .తనతో ఎంతో ప్రేమ గా మాట్లాడారు .మీ బాబు గురించి ఏం చింతించకండి .ఇప్పటికే నుండి మా బాబు అన్నారు. లక్ష్మి వాళ్ళను చూస్తుంటే ముచ్చట వేసింది. అలాగే రోజు సాయంత్రం పూజ కాగానే అందరిని పలకరించి,వారి మంచి చెడులను తెలుసుకొని వెళ్తారట . లక్ష్మి చూస్తుండగా రెండు రోజులు గడిచిపోయాయి.తీసుకెళ్ళడానికి కొడుకు కోడలు వచ్చారు. కోడలు అంతా తిరిగి చూసింది . ఇక్కడ ఏల వుంది అని రవిని అడిగింది రాధ నవ్వుతూ, బాగుందని తల ఊపాడు .ఇంకా కొడుక్కిఅని జాగ్రత్తలు చెప్పి తను వారం రోజులకు వస్తానని చెప్పి వాళ్ళతో పాటు వెళ్లి పోయింది. వెళ్లుతు కొడుకు వైపు చూసి చెయ్యి ఊపింది. గుండెలో ఏదో తెలియని బాధ కన్నుల నుండి నీళ్ళు కారుతున్నాయి. ఇంతలో కొడుకు, కోడలు చూడకుండా కొంగుతో తుడుచుకుంది. లక్ష్మి ఇంట్లో వుంది. అన్నట్టే కాని మౌనం గానే వుంటుంది. సరిగా తినడం లేదు. ఎప్పుడు ఆలోచిస్తూ వుంటుంది. కొడుకు,కోడలు అలా వుండడం చూసి దిగులు పడ్డారు. రామ్ చెల్లెలికి కాల్ చేసి చెప్పాడు. కూతురూ ఉషా వచ్చింది. అమ్మ ఎందుకు అలా వున్నావు .ఏం కాదు. బాధ పెట్టు కోకు, సరే పోదాం పద అన్నయ్య దగ్గరకు అని అంది .ఇద్దరు బయలు దేరారు .రవి వీళ్లని చూడగానే నవ్వుతూ చూశాడు. ఎలా వున్నావు అన్నయ్య అంది. ఉషా, బాగున్నాఅని తల ఊపాడు . అమ్మ నీ పైన బెంగ పెట్టుకుంది.. చూడు అంది. రవి తల్లి వైపు చూశాడు .నేను మంచిగా వున్న అని సైగ చేశాడు. కాని రవిని చూస్తే తెలుస్తుంది.
అది తల్లికే అర్ధం అవుతుంది. ఆ ముఖంలో అప్పటి ఉత్సాహం లేదు. కొన్ని పండ్లు, స్వీట్స్ తెచ్చింది ఉషా. ఒక పండు తీసి తినిపించింది. .అక్కడే రాత్రి వరకు గడిపి ఇంటికి వచ్చారు .ఇంకా తనకి లీవ్ లేదని, తిరుగు ప్రయాణం అయింది ఉషా. నేను ఒకటి నిర్ణయించుకున్నాను. ఉషా బ్యాగ్ సర్దుతూ ఏమిటి చెప్పు అమ్మ అంది. రవి దగ్గరే ఆశ్రమం లో వుండలనుకుంటున్నాను.రవి దగ్గర వుండి, అక్కడ వున్న వాళ్ళకి ,నా చేతనైన అంతా సేవ చేద్దాం,అనుకుంటున్నాను అన్నయ్య అంటు పిలించింది. ఏమిటే అంటు వచ్చాడు రాము అమ్మ రవి దగ్గరే ఆశ్రమం లో వుంటుందట అంది .ఏం అమ్మ ఏమైంది. .మరి ఎందుకు అత్తయ్యా , అప్పుడే అక్కడకు వచ్చిన రాధ, ఈ నిర్ణయం తీసుకున్నారు అంది. ఇది సరియైన నిర్ణయామే, అక్కడే వుండి మీ దగ్గరకు మధ్య ,మధ్య వచ్చిపోతూవుంటాను అంది. అలా అయితే అందరు ఏమనుకుంటారు అమ్మ అన్నాడు.ఏమైన అనుకోని, నా కొడుకు దగ్గరే కదా వుండేది. ఎంత చెప్పినా వినేట్టుగా లేదు. సరే అనుకొని ఉషా రామ్ ఇద్దరు లక్ష్మిని ఆశ్రమం లో దింపారు. ఉషా జాగ్రత్త అమ్మ అని చెప్పి వెళ్ళిపొయింది. రామ్ అమ్మ నీవు ఎప్పుడు రావాలన్న ఫోన్ చెయ్యి వచ్చి తీసుకు వెళ్తాను అన్నాడు. సరే అంది. ఆఫీసులో మేనజర్కీ చెప్పి వెళ్లాడు. రవి సంతోషంగా వున్నాడు . లక్ష్మితిరిగి తన దగ్గరకు వచ్చినందుకు, లక్ష్మి అక్కడ వున్న వారికి నీతీ కథలు చెప్పడం , కొంచెం చేసుకో వచ్చే వాళ్ళకి కొన్ని పనులు నేర్పించడం. రవి దగ్గరగా వుంటు, మిగితా వాళ్ళకు సేవ చేయడం నిజంగా తన అదృష్టంగా భావించింది. ఆ ఆశ్రమం నడుపుతున్న దంపతులు లక్ష్మి తీసుకున్నా ఈ నిర్ణయాన్ని హర్షించారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!