ఆత్మహత్య -బలహీనత

ఆత్మహత్య -బలహీనత

రచన: ప్రసాదరావు రామాయణం

ఆగు!
ఒక్క క్షణం
ఒకే ఒక్కక్షణం
తొలగించు ఆ ఉరిత్రాటిని
నీవు మ్రింగిన నైరాశ్యాన్నీ వైరాగ్యాన్నీ
కక్కి వేసేయ్
విధాత నిర్దేశించిన విధిని
పూర్తి చెయ్యకే పోతానంటావ్?

నీ వేదననూ,నిర్వేదాన్నీ ఒకపళ్ళెంలో
నీవారి ప్రేమనూ, ఆశలనూ మరొక పళ్ళెంలో తూచు
ఎటువైపు మొగ్గుతుందో త్రాసు!

జీవితం ఓ హరివిల్లు
వెతికి చూడు ఎన్ని వర్ణాలుంటాయో
లేని నలుపును ఎంచుకుంటావేం?

జీవితం ఎవ్వరికీ పూలబాట కాదు
ముళ్లబాటే…దారి చేసుక సాగిపో!
ఇంట్లో ఎలుక ప్రవేశించిందని
ఇల్లు తగలెట్టుకుంటావా?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!